Fact Check: Ramojis Own Report Will Be Ready Before The Report Comes In Polavaram Guide Bund Damage - Sakshi
Sakshi News home page

Fact Check: బాధ్యులెవరంటూ బండ అబద్ధాలు..! 

Published Fri, Jun 30 2023 4:57 AM | Last Updated on Fri, Jun 30 2023 9:43 AM

Ramojis own report will be ready before the report comes - Sakshi

సాక్షి, అమరావతి:  పోలవరంలో గైడ్‌ బండ్‌ జారడానికి దారితీసిన కారణాలను తేల్చేందుకు సీడబ్ల్యూసీ మాజీ ౖౖచైర్మన్‌ ఏబీ పాండ్య నేతృత్వంలో కేంద్ర జల్‌ శక్తి శాఖ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ అసలు ఇప్పటిదాకా నివేదిక ఇవ్వలేదు. క్షేత్రస్థాయిలో గైడ్‌ బండ్‌ను పరిశీలించిన అనంతరం కారణాలను గుర్తించేందుకు మరికొన్ని పరీక్షలు అవసరమని కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో గైడ్‌ బండ్‌కు తాత్కాలిక మరమ్మతులు, శాశ్వతంగా పటిష్టం చేయడంపై జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశం జరిగింది.

జల్‌ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, సీడబ్ల్యూసీ చైర్మన్‌ కుస్విందర్‌సింగ్‌ వోరా, నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈలోగానే గైడ్‌ బండ్‌ కుంగడానికి బాధ్యులెవరో తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని జల్‌ శక్తి శాఖ ఆదేశించినట్లు ఈనాడు రామోజీ  అచ్చేశారు. ఆ విషయాన్ని కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి ఆయన చెవిలో చెప్పారా? లేదంటే ఆ సమావేశంలో ఎక్కడైనా బల్ల కింద నక్కి విన్నారా? బాధ్యతా రాహిత్యంగా కథనాలను ప్రచురించారు.  

ఈనాడు ఆరోపణ:  గైడ్‌ బండ్‌ను 4 నెలల్లోనే పూర్తి చేయాలనేది తొలి ప్రణాళిక. అలాంటిది ఏడాదికిపైగా పట్టింది. ఇలా ఆలస్యం కావడం వల్లే ని­ర్మాణ ప్రదేశంలో మార్పులు జరిగి గైడ్‌ బండ్, రిటైనింగ్‌ వాల్‌ దెబ్బతిన్నాయి. 
వాస్తవం: గోదావరి సహజ మార్గాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించడానికి వీలుగా స్పిల్‌వే ఎడమ వైపు స్క్యూబండ్‌ నిర్మి ంచాలని సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ తొలుత ప్రతిపాదించాయి. సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ (సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌)లో నిర్వహించిన అధ్యయనంలో స్క్యూబండ్‌ నిర్మి­స్తే స్పిల్‌వేకు ఎడమ వైపున వరద ఉద్ధృతి సెకనుకు 13.6 మీటర్లకు పెరిగి సుడిగుండాలకు దారి తీస్తుందని తేలింది. దీనిపై 2019 మార్చి 26న నిర్వహించిన డీడీఆర్పీ 12వ సమావేశంలో స్క్యూబండ్‌ స్థానంలో గైడ్‌ బండ్‌ నిర్మి ంచాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

అప్రోచ్‌ చానల్‌కు సమాంతరంగా 500 మీటర్ల పొడవున గైడ్‌ బండ్‌ నిర్మి స్తే వరద ఉద్ధృతి సెకనుకు 3 నుంచి 6.5 మీటర్లకు తగ్గుతుందని 2021 మార్చి 23న జరిగిన డీడీఆర్పీ 17వ సమావేశంలో సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ నివేదించింది. ఆ మేరకు గైడ్‌ బండ్‌ డిజైన్‌ రూపొందించాలని డీడీఆర్పీ ఆదేశించింది. దీంతో 2021 మార్చిలో గైడ్‌బండ్‌ నిర్మి ంచే ప్రాంతంలో ఎనిమిది చోట్ల ఈసీపీటీ(ఎలక్ట్రో కోన్‌ పినట్రేషన్‌ టెస్ట్‌) నిర్వహించారు. అదే ఏడాది ఏప్రిల్‌ 12న రిటైనింగ్‌ వాల్, మే 15న స్టోన్‌ కాలమ్స్‌తో గైడ్‌ బండ్‌ డిజైన్లను సీడబ్ల్యూసీకి రాష్ట్ర జలవనరుల శాఖ సమర్పించింది.

రిటైనింగ్‌ వాల్‌ డిజైన్‌ను 2021 ఏప్రిల్‌ 30, స్టోన్‌ కాలమ్స్‌తో కూడిన గైడ్‌ బండ్‌ డిజైన్‌ను 2021, మే 24న సీడబ్ల్యూసీ ఆమోదించింది. గైడ్‌ బండ్‌లో మొత్తం 13,762 స్టోన్‌ కాలమ్స్‌కుగానూ 8,388 కాలమ్స్‌ను 2021 మే 25 నుంచి జూన్‌లోపే  కాంట్రాక్టు సంస్థ పూర్తి చేసింది. రిటైనింగ్‌ వాల్‌లో మొత్తం 105 ప్యానళ్లకుగానూ 35 ప్యానళ్లను 2021 మే నెలలో పూర్తి చేసింది. జూలైలో వరదలు వచ్చాయి. వరదలు తగ్గాక 2021 డిసెంబర్‌లో మళ్లీ పనులను ప్రారంభించింది. 2022 మార్చికి రిటైనింగ్‌ వాల్,  ఏప్రిల్‌కు స్టోన్‌ కాలమ్స్‌ను పూర్తి చేసింది. గైడ్‌ బండ్‌ పనులను 2022 ఏప్రిల్‌ 12న ప్రారంభించింది.

వరదలు వచ్చేలోగా గైడ్‌ బండ్‌ను +35 మీటర్ల ఎత్తుకు పూర్తి చేయాలని 2022 జనవరిలో పీపీఏ నిర్దేశించింది. ఆ ప్రకారం +34 మీటర్ల ఎత్తు వరకూ గైడ్‌ బండ్‌ను పూర్తి చేశారు. గతేడాది ఎన్నడూ లేని విధంగా జూలై 10న గోదావరికి లక్ష క్యూసెక్కుల వరద వ చ్చింది. జూలై 17 నాటికి అది 25 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో పీపీఏ నిర్దేశించిన విధంగా వరద తగ్గాక మిగిలిన కొద్దిపాటి పనిని చేపట్టి ఈ ఏడాది ఏప్రిల్‌కు పూర్తి గైడ్‌ బండ్‌ +51.32 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసింది.  

ఈనాడు ఆరోపణ:  గైడ్‌ బండ్‌ కుంగడానికి డిజైన్‌ పరంగా, నిర్మాణపరంగా వైఫల్యం.
వాస్తవం: జాతీయ ప్రాజెక్టు పోలవరం పనులపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పీపీఏ, సీడ­బ్ల్యూసీ, డీడీఆర్సీ, సీఎస్‌ఆర్‌ఎంఎస్, వ్యాప్కోస్, జీఎస్‌ఐ అజమాయిషీ ఉంటుంది.  నిపుణుల పర్యవేక్షణలో నిర్మాణంలో లోపాలకు అవకాశమే ఉండదు. నాణ్యత పరీక్షలు నిర్వహించి ««ధ్రువీకరించాకే పనులు చేస్తారు.  

గైడ్‌ బండ్‌ అంటే..
నీటి ప్రవాహానికి మార్గ నిర్దేశం చేయడానికి ప్రత్యేకంగా నిర్మించే వంతెనలాంటి కట్టడాన్ని గైడ్‌ బండ్‌ అంటారు. పోలవరం ప్రతిపాదిత ప్రాజెక్టు వద్ద ఉన్న భౌగోళిక పరిస్థితుల రీత్యా గోదావరి సహజ ప్రవాహాన్ని అప్రోచ్‌ చానల్‌ ద్వారా మళ్లించి స్పిల్‌ వే నిర్మించారు. తద్వారా స్పిల్‌ వే ఎడమ వైపున వరద ఉధృతి ఎక్కు­వ­గా ఉంటుందని, దీంతో సుడిగుండాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని గుర్తించారు. స్పిల్‌ వే కు కూడా కొంత ఇబ్బంది ఉంటుందని భావించారు.

ఆ సమయంలో నీటి వేగాన్ని తగ్గించి, సుడిగుండాల నివారణ కు రాళ్లు, మట్టితో స్పిల్‌ వే కు ఎగువన ఎడమ వైపున గైడ్‌ బండ్‌ను నిర్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్పిల్‌ వే పొడవునా నీటి ప్రవాహ వేగం ఒకేలా ఉండేందుకే దీనిని నిర్మించారు.   

నిపుణులంటూ ఊహాగానాలా..  
ఇప్పుడు చెప్పండి రామోజీ.. పనుల్లో ఎక్కడ జాప్యం జరిగింది? గైడ్‌ బండ్‌ను 4 నెలల్లోనే నిర్మించాలన్నది తొలి ప్రణాళికని మీకు మీరే ఊహించుకున్నారా? నిర్మాణంలో జాప్యం వల్లే గైడ్‌ బండ్, రిటైనింగ్‌ వాల్‌ దెబ్బ తిన్నట్లు ప్రాథమికంగా తేల్చిన నిపుణుడు మీరేనా? వరద తగ్గాక అప్రోచ్‌ చానల్‌ గైడ్‌ బండ్‌ వద్ద మట్టి తవ్వకం పనులు చేస్తున్నప్పుడు రిటైనింగ్‌ వాల్‌ 144 మీటర్‌ వద్ద వంగినట్లు, గైడ్‌ బండ్‌ 51.32 మీటర్ల నుంచి జారినట్లు జూన్‌ 3న అధికారులు గమనించారు.

ఆ వెంటనే సీడబ్ల్యూసీకి తెలిపారు. దీనిపై జూన్‌ 5న సీడబ్ల్యూసీ చైర్మన్‌ కుస్విందర్‌సింగ్‌ వోరా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు తాత్కాలి­క మరమ్మతులు చేపట్టాక గైడ్‌ బండ్‌ జారలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement