AB Pandya
-
బాధ్యులెవరంటూ బండ అబద్ధాలు..!
సాక్షి, అమరావతి: పోలవరంలో గైడ్ బండ్ జారడానికి దారితీసిన కారణాలను తేల్చేందుకు సీడబ్ల్యూసీ మాజీ ౖౖచైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో కేంద్ర జల్ శక్తి శాఖ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ అసలు ఇప్పటిదాకా నివేదిక ఇవ్వలేదు. క్షేత్రస్థాయిలో గైడ్ బండ్‌ను పరిశీలించిన అనంతరం కారణాలను గుర్తించేందుకు మరికొన్ని పరీక్షలు అవసరమని కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో గైడ్ బండ్‌కు తాత్కాలిక మరమ్మతులు, శాశ్వతంగా పటిష్టం చేయడంపై జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశం జరిగింది. జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, సీడబ్ల్యూసీ చైర్మన్ కుస్విందర్‌సింగ్ వోరా, నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈలోగానే గైడ్ బండ్ కుంగడానికి బాధ్యులెవరో తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని జల్ శక్తి శాఖ ఆదేశించినట్లు ఈనాడు రామోజీ అచ్చేశారు. ఆ విషయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి ఆయన చెవిలో చెప్పారా? లేదంటే ఆ సమావేశంలో ఎక్కడైనా బల్ల కింద నక్కి విన్నారా? బాధ్యతా రాహిత్యంగా కథనాలను ప్రచురించారు. ఈనాడు ఆరోపణ: గైడ్ బండ్‌ను 4 నెలల్లోనే పూర్తి చేయాలనేది తొలి ప్రణాళిక. అలాంటిది ఏడాదికిపైగా పట్టింది. ఇలా ఆలస్యం కావడం వల్లే నిర్మాణ ప్రదేశంలో మార్పులు జరిగి గైడ్ బండ్, రిటైనింగ్ వాల్ దెబ్బతిన్నాయి. వాస్తవం: గోదావరి సహజ మార్గాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించడానికి వీలుగా స్పిల్‌వే ఎడమ వైపు స్క్యూబండ్ నిర్మి ంచాలని సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ తొలుత ప్రతిపాదించాయి. సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్)లో నిర్వహించిన అధ్యయనంలో స్క్యూబండ్ నిర్మిస్తే స్పిల్‌వేకు ఎడమ వైపున వరద ఉద్ధృతి సెకనుకు 13.6 మీటర్లకు పెరిగి సుడిగుండాలకు దారి తీస్తుందని తేలింది. దీనిపై 2019 మార్చి 26న నిర్వహించిన డీడీఆర్పీ 12వ సమావేశంలో స్క్యూబండ్ స్థానంలో గైడ్ బండ్ నిర్మి ంచాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అప్రోచ్ చానల్‌కు సమాంతరంగా 500 మీటర్ల పొడవున గైడ్ బండ్ నిర్మి స్తే వరద ఉద్ధృతి సెకనుకు 3 నుంచి 6.5 మీటర్లకు తగ్గుతుందని 2021 మార్చి 23న జరిగిన డీడీఆర్పీ 17వ సమావేశంలో సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదించింది. ఆ మేరకు గైడ్ బండ్ డిజైన్ రూపొందించాలని డీడీఆర్పీ ఆదేశించింది. దీంతో 2021 మార్చిలో గైడ్‌బండ్ నిర్మి ంచే ప్రాంతంలో ఎనిమిది చోట్ల ఈసీపీటీ(ఎలక్ట్రో కోన్ పినట్రేషన్ టెస్ట్) నిర్వహించారు. అదే ఏడాది ఏప్రిల్ 12న రిటైనింగ్ వాల్, మే 15న స్టోన్ కాలమ్స్‌తో గైడ్ బండ్ డిజైన్లను సీడబ్ల్యూసీకి రాష్ట్ర జలవనరుల శాఖ సమర్పించింది. రిటైనింగ్ వాల్ డిజైన్‌ను 2021 ఏప్రిల్ 30, స్టోన్ కాలమ్స్‌తో కూడిన గైడ్ బండ్ డిజైన్‌ను 2021, మే 24న సీడబ్ల్యూసీ ఆమోదించింది. గైడ్ బండ్లో మొత్తం 13,762 స్టోన్ కాలమ్స్‌కుగానూ 8,388 కాలమ్స్‌ను 2021 మే 25 నుంచి జూన్‌లోపే కాంట్రాక్టు సంస్థ పూర్తి చేసింది. రిటైనింగ్ వాల్లో మొత్తం 105 ప్యానళ్లకుగానూ 35 ప్యానళ్లను 2021 మే నెలలో పూర్తి చేసింది. జూలైలో వరదలు వచ్చాయి. వరదలు తగ్గాక 2021 డిసెంబర్లో మళ్లీ పనులను ప్రారంభించింది. 2022 మార్చికి రిటైనింగ్ వాల్, ఏప్రిల్‌కు స్టోన్ కాలమ్స్‌ను పూర్తి చేసింది. గైడ్ బండ్ పనులను 2022 ఏప్రిల్ 12న ప్రారంభించింది. వరదలు వచ్చేలోగా గైడ్ బండ్‌ను +35 మీటర్ల ఎత్తుకు పూర్తి చేయాలని 2022 జనవరిలో పీపీఏ నిర్దేశించింది. ఆ ప్రకారం +34 మీటర్ల ఎత్తు వరకూ గైడ్ బండ్‌ను పూర్తి చేశారు. గతేడాది ఎన్నడూ లేని విధంగా జూలై 10న గోదావరికి లక్ష క్యూసెక్కుల వరద వ చ్చింది. జూలై 17 నాటికి అది 25 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో పీపీఏ నిర్దేశించిన విధంగా వరద తగ్గాక మిగిలిన కొద్దిపాటి పనిని చేపట్టి ఈ ఏడాది ఏప్రిల్‌కు పూర్తి గైడ్ బండ్ +51.32 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసింది. ఈనాడు ఆరోపణ: గైడ్ బండ్ కుంగడానికి డిజైన్ పరంగా, నిర్మాణపరంగా వైఫల్యం. వాస్తవం: జాతీయ ప్రాజెక్టు పోలవరం పనులపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పీపీఏ, సీడబ్ల్యూసీ, డీడీఆర్సీ, సీఎస్‌ఆర్‌ఎంఎస్, వ్యాప్కోస్, జీఎస్ఐ అజమాయిషీ ఉంటుంది. నిపుణుల పర్యవేక్షణలో నిర్మాణంలో లోపాలకు అవకాశమే ఉండదు. నాణ్యత పరీక్షలు నిర్వహించి ««ధ్రువీకరించాకే పనులు చేస్తారు. గైడ్ బండ్ అంటే.. నీటి ప్రవాహానికి మార్గ నిర్దేశం చేయడానికి ప్రత్యేకంగా నిర్మించే వంతెనలాంటి కట్టడాన్ని గైడ్ బండ్ అంటారు. పోలవరం ప్రతిపాదిత ప్రాజెక్టు వద్ద ఉన్న భౌగోళిక పరిస్థితుల రీత్యా గోదావరి సహజ ప్రవాహాన్ని అప్రోచ్ చానల్ ద్వారా మళ్లించి స్పిల్ వే నిర్మించారు. తద్వారా స్పిల్ వే ఎడమ వైపున వరద ఉధృతి ఎక్కువగా ఉంటుందని, దీంతో సుడిగుండాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని గుర్తించారు. స్పిల్ వే కు కూడా కొంత ఇబ్బంది ఉంటుందని భావించారు. ఆ సమయంలో నీటి వేగాన్ని తగ్గించి, సుడిగుండాల నివారణ కు రాళ్లు, మట్టితో స్పిల్ వే కు ఎగువన ఎడమ వైపున గైడ్ బండ్‌ను నిర్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్పిల్ వే పొడవునా నీటి ప్రవాహ వేగం ఒకేలా ఉండేందుకే దీనిని నిర్మించారు. నిపుణులంటూ ఊహాగానాలా.. ఇప్పుడు చెప్పండి రామోజీ.. పనుల్లో ఎక్కడ జాప్యం జరిగింది? గైడ్ బండ్‌ను 4 నెలల్లోనే నిర్మించాలన్నది తొలి ప్రణాళికని మీకు మీరే ఊహించుకున్నారా? నిర్మాణంలో జాప్యం వల్లే గైడ్ బండ్, రిటైనింగ్ వాల్ దెబ్బ తిన్నట్లు ప్రాథమికంగా తేల్చిన నిపుణుడు మీరేనా? వరద తగ్గాక అప్రోచ్ చానల్ గైడ్ బండ్ వద్ద మట్టి తవ్వకం పనులు చేస్తున్నప్పుడు రిటైనింగ్ వాల్ 144 మీటర్ వద్ద వంగినట్లు, గైడ్ బండ్ 51.32 మీటర్ల నుంచి జారినట్లు జూన్ 3న అధికారులు గమనించారు. ఆ వెంటనే సీడబ్ల్యూసీకి తెలిపారు. దీనిపై జూన్ 5న సీడబ్ల్యూసీ చైర్మన్ కుస్విందర్‌సింగ్ వోరా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాక గైడ్ బండ్ జారలేదు. -
2022 నాటికి పోలవరం పూర్తి: ఏబీ పాండ్యా
రాజమండ్రి (తూర్పుగోదావరి జిల్లా): ఆంధ్రప్రదేశ్ వరప్రదాయినిగా పిలిచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2022 నాటికి పూర్తవుతుందని డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ (డీడీఆర్పీ) చైర్మన్ ఏబీ పాండ్యా ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టులోని పలు విభాగాల్లో చేపట్టిన పనులను ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్‌తో పాటు ఇతర సభ్యులతో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం పనులపై పీపీఏ సభ్యులు, కేంద్ర జలసంఘం సభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులతో రాజమహేంద్రవరంలో ఏబీ పాండ్యా అధ్యక్షతన సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఏ.బి. పాండ్యా మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు 48 గేట్లుకుగానూ 29 గేట్లు అమరిక పూర్తయిందని, మిగిలిన గేట్లు అమరికపై అధికారులకు పలు సూచనలు చేశామన్నారు. పోలవరం గేట్లు ప్రపంచంలోనే అతి పెద్దవిగా పేర్కొన్నారు. పోలవరంలో 52 మీటర్ల ఎత్తున స్పిల్‌వే పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. స్పిల్ వే బ్రిడ్జి 1,128 మీటర్లుకుగాను 1,105 పూర్తి చేసినట్లు తెలిపారు. 48 గేట్లకుగాను 29 గేట్లు బిగింపు పూర్తయిందని వివరించారు. గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్లు, పవర్ ప్యాక్‌లు అమర్చే పనులు వేగంగా సాగుతున్నాయని పాండ్యా తెలిపారు. పోలవరం స్పిల్ వే నిర్మాణంలో కీలకమైన 192 గడ్డర్లు అమరిక నేటితో పూర్తయిందని అధికారులు వివరించారు. ప్రధానంగా ఐదు అంశాలపై సమావేశంలో చర్చించారు. వరదల సమయంలో కోతకు గురైన ఎడమ గట్టు పరిరక్షణ విషయం కూడా చర్చకు వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ చేపట్టిన విషయం తెలిసిందే. సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్, జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ సి. నారాయణ రెడ్డి , పోలవరం ప్రాజెక్ట్ ఎస్ఈ నరసింహమూర్తి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ డైరెక్టర్ సీహెచ్ సుబ్బయ్య, జీఎం సతీశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా జలాలపై పాండ్యా కమిటీ
► ఈ నెల రెండో వారంలో రాష్ట్రంలో పర్యటించనున్న త్రిసభ్య కమిటీ ► 5న ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శుల సమావేశం! సాక్షి, హైదరాబాద్: కృష్ణానదీ జలాలపై నెల కొన్న వివాదాలను కొలిక్కి తెచ్చే ప్రక్రియలో భాగంగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సీడబ్ల్యూసీ(కేంద్ర జల సంఘం) మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్లు ఏకే బజాజ్, సురేష్‌చంద్ర సభ్యులుగా ఉంటారు. ఇరు రాష్ట్రాలకు కృష్ణా జలాల తాత్కాలిక పంపిణీ, కేఆర్ఎంబీ పరిధి, విధి విధానాల ఖరారు చేసే బాధ్యతలను ఈ కమిటీకి కట్టబెట్టింది. కమిటీ ఈ నెల రెండో వారంలో రాష్ట్రంలో పర్యటించే అవకాశాలున్నాయని తెలిసింది. కృష్ణా జలాల పం పకం, ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేకకార్యదర్శి అమర్జీత్సింగ్ అధ్యక్షతన ఈ నెల 21 నుంచి 23 వరకు తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించినా ఏకాభిప్రా యం కుదరని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీ నియమిస్తామని కేంద్రం తెలిపింది. నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటూ ఈ కమిటీని కేంద్రం ఆదేశిం చింది. ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ఈ నెల రెండో వారంలో దిగువ కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులి చింతల, ప్రకాశం బ్యారేజీ, సుంకేసుల జలాశయాలను సందర్శించనుంది. ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఈఎన్సీలు, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు, కృష్ణా బోర్డు ఇన్చార్జి చైర్మన్ రాంశరాణ్‌తో సమావేశం కానుంది. కమిటీ పర్యటనకు ముందే ఈ నెల 5న ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శుల సమావేశం జరిగే అవకాశం ఉంది. -
ప్రాణహితకు త్వరగా జాతీయ హోదా
కేంద్ర జలసంఘం చైర్మన్‌కు టీఆర్ ఎస్ ఎంపీల విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు త్వరితగతిన జాతీయ హోదా మంజూరు చేయాలని కేంద్ర జల సంఘం చైర్మన్ ఏబీ పాండ్యాను టీఆర్ఎస్ ఎంపీలు కోరారు. ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీ లు బి.వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత, బీ.బీ. పాటిల్, జి.నగేశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, చీఫ్ ఇంజ నీర్ హరిరామ్, ఎస్ఈ వెంకటేశ్వర్లు మంగళవారం ఇక్కడ పాండ్యాతో సమావేశమయ్యారు. ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వారంతా మీడియాతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీ చైర్మన్ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు త్వరలో మంజూరు చేస్తామన్నారని చెప్పారు. -
నీటి విడుదలకు గ్రీన్‌సిగ్నల్
సాగర్ కుడి, ఎడమ కాల్వలకు 20 టీఎంసీలు డెల్టాకు 3 టీఎంసీలు, నల్లగొండకు 3 టీఎంసీల నీరు కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయం హైదరాబాద్: రెండు రాష్ట్రాల ప్రజల తాగునీటి అవసరాల కోసం 26 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతానికి తాగునీటికే పరిమితం చేసిన బోర్డు.. భారీ వర్షాలు కురిసి, ప్రాజెక్టుల్లోకి కొత్తనీరు వస్తే సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని, అందుకోసం త్వరలోనే మరోమారు సమావేశం కావాలని నిర్ణయించింది. కృష్ణానది యాజమాన్య బోర్డు తొలి సమావేశం గురువారం నగరంలోని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) కార్యాలయంలో జరిగింది. బోర్డు చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో జరిగిన ఈ సమా వేశంలో మెంబర్ సెక్రటరీ గుప్తాతో పాటు తెలంగాణ రాష్ర్టం నుంచి ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవిందరెడ్డి, ఈఎన్సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలోనే బోర్డు ఆవశ్యకత, తీసుకునే నిర్ణయాలపై చైర్మన్ సభ్యులకు వివరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి కొరత ఉన్న నేపథ్యంలో కేవలం తాగునీటి విడుదలకు సంబంధించే చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కొంత అభ్యంతరం వ్యక్తం చేసింది. డెల్టాకు రెండో వారం నీటి విడుదల విషయంలో తమతో సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం తరఫు నుంచి పాల్గొన్న అధికారులు చెప్పారు. తాము వద్దన్నా డెల్టాకు నీటిని ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అధికారులు జోక్యం చేసుకుని డెల్టా తాగునీటి అవసరాలకు గతంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం మేరకే బోర్డు నీటిని విడుదల చేసిందని స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్ నగరం తాగునీటి అసవరాలకు రోజు 900 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారని.. అయితే ఇందుకు బోర్డు అనుమతి లేదని ప్రకటించారు. పైగా హైదరాబాద్ అవసరానికి కేటాయించిన నీటి కోటా కూడా ఇప్పటికే మించిపోయిందని గుర్తు చేశారు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లో ఉన్న నీటి నిల్వలను అంచనా వేసిన బోర్డు..సాగర్ కుడి కాల్వకు 10 టీఎంసీలు, ఎడమ కాల్వకు 10 టీఎంసీలు, డెల్టాకు మూడు టీఎంసీలు, నల్లగొండకు మూడు టీఎంసీలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అయితే ఈ నీటిని కేవలం ఆయా ప్రాంతాల్లోని తాగునీటికే ఉపయోగించుకోవాలని సూచించింది. బోర్డు పూర్తి స్థాయిలో పనిచేయడం కోసం నియమ నిబంధనల రూపకల్పన, సిబ్బంది నియామకం వంటి అంశాలను తుది నిర్ణయానికి రావడానికి వీలుగా ఒక వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు. ఇందులో ఇరు రాష్ట్రాలకు చెందిన ఈఎన్సీలు, కేంద్రానికి చెందిన బోర్డు మెంబర్ సెక్రటరీలు ఉంటారు. -
రెండు ప్రభుత్వాలకు కృష్ణా నదీ జలాల నిర్వహణ మండలి లేఖ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి, కృష్ణా నదీ జలాల నిర్వహణ మండలి (కెఆర్ఎంబి) చైర్మన్ ఏబి పాండ్య లేఖ రాశారు. ఈ నెల 8,9 తేదీల్లో మండలి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ లోపు రెండు ప్రభుత్వాలు మండలి సభ్యులను నియమించాలని ఆయన కోరారు. వచ్చే మండలి సమావేశంలో నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. పాండ్య గత వారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, సీఎస్ రాజీవ్ శర్మలతో సమావేశమైన విషయం తెలిసిందే. కృష్ణా జలాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. నీటి విడుదల వివాదంపై పాండ్య వారితో చర్చించారు. ఇదిలా ఉండగా, కృష్ణా డెల్టాకు నీటి విడుదలను వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ సాగునీటిశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. తాగునీరు ముసుగులో సాగునీటిని తీసుకెళ్తే సహించమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులలో మండలి సమావేశం కానుంది.