హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి, కృష్ణా నదీ జలాల నిర్వహణ మండలి (కెఆర్ఎంబి) చైర్మన్ ఏబి పాండ్య లేఖ రాశారు. ఈ నెల 8,9 తేదీల్లో మండలి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ లోపు రెండు ప్రభుత్వాలు మండలి సభ్యులను నియమించాలని ఆయన కోరారు. వచ్చే మండలి సమావేశంలో నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
పాండ్య గత వారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, సీఎస్ రాజీవ్ శర్మలతో సమావేశమైన విషయం తెలిసిందే. కృష్ణా జలాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. నీటి విడుదల వివాదంపై పాండ్య వారితో చర్చించారు.
ఇదిలా ఉండగా, కృష్ణా డెల్టాకు నీటి విడుదలను వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ సాగునీటిశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. తాగునీరు ముసుగులో సాగునీటిని తీసుకెళ్తే సహించమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులలో మండలి సమావేశం కానుంది.
రెండు ప్రభుత్వాలకు కృష్ణా నదీ జలాల నిర్వహణ మండలి లేఖ
Published Wed, Jul 2 2014 4:59 PM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
Advertisement