
సాక్షి, విజయవాడ: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై కేఆర్‌ఎంబీకి ఏపీ వాస్తవాలు వివరించింది. శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరం తెలిపింది. ఉమ్మడి ప్రాజెక్టులపై సాగు, తాగునీటి అవసరాలను పరిగణించి విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉందని ప్రభుత్వం లేఖలో పేర్కొంది. తెలంగాణ వాదన పూర్తి అసంబద్ధమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా టీఎస్ జెన్‌కో చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్‌ఎంబీని కోరింది.
ఇవీ చదవండి:
కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. అసలు నిజం ఇదే!
కర్నూలులో ఓ భక్షక భటుడి లీలలు..
Comments
Please login to add a commentAdd a comment