సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ చకచకా పూర్తి చేస్తుండటంతో రాజకీయంగా చంద్రబాబుకు నూకలు చెల్లడం ఖాయమనే భయం.. వియ్యంకుడిని కాంట్రాక్టర్‌గా తప్పించడంతో తమ దోపిడీకి అడ్డుకట్ట పడిందనే అక్కసుతో రామోజీరావు పదే పదే విషం చిమ్ముతున్నారు. గైడ్ బండ్‌లో ఉత్పన్నమైన చిన్న సమస్యను పెద్ద విపత్తుగా చూపిస్తూ.. విశ్రాంత సూపరింటెండెంట్ ఇంజినీర్, విశ్రాంత చీఫ్ ఇంజినీర్, కీలక ఇంజినీరింగ్ అధికారి అంటూ.. వారి పేర్లు ప్రస్తావించకుండా.. ఆ ముసుగులో తన అభిప్రాయాలనే వారి అభిప్రాయాలుగా ‘ఈనాడు’లో రోతరాతలు అచ్చేశారు.
టీడీపీ సర్కార్ హయాంలో చంద్రబాబు, నవయుగ చేసిన తప్పిదం వల్ల గోదావరి వరదల ఉధృతికి పోలవరం ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైంది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. వీటిని చక్కదిద్దడానికి రూ.2020.05 కోట్లు అదనంగా వ్యయం చేయాలని సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) తేల్చి0ది. ఈ విపత్తుకు చంద్రబాబు చేసిన మానవ తప్పిదమే కారణమని ఐఐటీ(హైదరాబాద్), డీడీఆర్పీ, ఎన్‌హెచ్‌పీసీ నిపుణులు తేల్చిచెప్పారు.
ఇవన్నీ తన బాబు సీఎం కుర్చిలో లేరని కుంగిపోతున్న రామోజీరావుకు కన్పించవు. ఎందుకంటే.. చంద్రబాబు, వియ్యంకుడి సంస్థ నవయుగతో కలిసి పోలవరంలో రామోజీరావు డీపీటీ (దోచుకో పంచుకో తినుకో) పద్ధతిలో దోచుకున్నారు కాబట్టి. ఆ పెను విపత్తును కప్పిపెడుతూ.. గైడ్ బండ్‌లో ఉత్పన్నమైన చిన్న సమస్యను పెద్ద విపత్తుగా చిత్రీకరిస్తూ శుక్రవారం ‘మెగా వైఫల్యం’ శీర్షికన ప్రచురించిన కథనంలో వీసమెత్తు వాస్తవం లేదు.
ఆరోపణ: రిటైనింగ్ వాల్ కమ్ గైడ్ బండ్ పూర్తిగా కుంగిపోయి ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడింది.
వాస్తవం: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్‌కు తగ్గట్టుగానే గైడ్ బండ్ నిర్మాణం జరిగింది. రిటైనింగ్ వాల్ కమ్ గైడ్ బండ్ నిర్మాణానికి ముందు.. దాని నిర్మాణ ప్రాంతంలో వైబ్రో కాంపాక్షన్ కాలమ్స్‌తో భూమిని అభివృద్ధి చేశారు. జీఎస్‌ఐ (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) శాస్త్రవేత్తలు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అనుమతి ఇచ్చాకే రిటైనింగ్ వాల్ కమ్ గైడ్ బండ్ నిర్మాణం చేపట్టారు.
డిజైన్ ప్రకారం నిర్మించకపోయి ఉంటే.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన జీఎస్‌ఐ, వ్యాప్కోస్, సీఎస్‌ఎంఆర్‌ఎస్, పీపీఏలు మౌనంగా ఉండవు. వీటిని పరిశీలిస్తే.. డిజైన్‌లోనూ లోపం లేదు. నిర్మాణంలోనూ లోపం లేదన్నది స్పష్టమవుతోంది. ఇక గైడ్ బండ్ పూర్తిగా కుంగిపోయిందనడం అవాస్తవం. రిటైనింగ్ వాల్‌లో ఒక చోట స్టోన్ కాలమ్స్ కాస్త ఒంగిపోవడం వల్ల గైడ్ బండ్‌లో 134 మీటర్ల మేర కొంత జారింది. దీనిని సరిచేయడంలో నిపుణులు నిమగ్నమయ్యారు.
ఆరోపణ: కుంగిపోయిన గైడ్ బండ్ స్థానంలో మళ్లీ మొదటి నుంచి నిర్మించాల్సి వస్తుందేమోనని ఇంజినీర్లు చెబుతుంటే.. సాక్షాత్తు సీఎం జగన్ దీన్ని చిన్న అంశంగా తేల్చి పారేయడం విస్మయం కలిగించింది.
వాస్తవం: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సీడబ్ల్యూసీ, పీపీఏ, సీఎస్‌ఆర్‌ఎంఎస్, సీడబ్ల్యూపీఆర్‌ఎస్, వ్యాప్కోస్, జీఎస్‌ఐ వంటి సంస్థల అధికారుల పర్యవేక్షణలో పోలవరం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుని.. చకచకా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ సదుద్దేశం.
గైడ్ బండ్ పరిస్థితిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. సమీక్షించి.. జారడానికి గల కారణాలను మదింపు చేసి నివేదిక ఇవ్వడానికి సీడబ్ల్యూసీ ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ 16లోగా నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా గైడ్ బండ్‌ను చక్కదిద్దుతారు. ఈ చిన్న సమస్యను సాకుగా చూపి ప్రాజెక్టు నిర్మాణంలో అహర్నిశలు శ్రమిస్తోన్న అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం, నిర్మాణ సంస్థ సమర్థతను ప్రశ్నిం ర్నిచడం అవివేకమే అవుతుంది.
ఆరోపణ: గైడ్ బండ్‌లో రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణ శైలిని 2ః1 నిష్పత్తిలో కాకుండా.. 3ః1 నిష్పత్తిలో నిర్మించి ఉంటే కుంగిపోయేది కాదు. (విశ్రాంత ఇంజినీర్ పేరుతో రామోజీ మనసులోని
మాట ఇది)
వాస్తవం: డిజైన్ల రూపకల్పన, ఖరారులో సీడబ్ల్యూసీ అత్యున్నత సంస్థ. ఆ సంస్థ ఆమోదించిన డిజైన్ ప్రకారం సైడ్ స్లోప్ 2ః1 నిష్పత్తితోనే గైడ్ వాల్ నిర్మించారు. స్పిల్ వేకు ఎగువన సుడిగుండాలను నియంత్రించి.. స్పిల్ వేపై ఒత్తిడి తగ్గించడానికి నిర్మించిందే గైడ్ బండ్. సముద్ర తీర ప్రాంతాలు కోతకు గురవకుండా గేబియన్లు వేస్తారు. గైడ్ బండ్‌కు అలాంటివి వేయరు.
ఇది రామోజీరావు వంటి విశ్రాంత చీఫ్ ఇంజినీర్‌కు తెలియదేమో? సుడిగుండాలను నియంత్రించడం, స్పిల్ వేపై ఒత్తిడిని తగ్గించడానికి.. వరద సులభంగా దిగువకు వెళ్లడానికి వీలుగా.. స్పిల్ వేకు ఎగువన ఎడమ గట్టు కొండకు సమాంతరంగా 500 మీటర్ల పొడవుతో గైడ్ బండ్ నిర్మించాలన్న సూచన మేరకు రిటైనింగ్ వాల్ కమ్ గైడ్ బండ్‌ను నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment