పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులను ఈనెల 6వ తేదీన విదేశీ నిపుణుల బృందం పరిశీలించనుంది. నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో మకాం వేసి పనులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర జలవనరుల శాఖ, బావర్, మేఘ ఏజెన్సీ ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకోనున్నారు.
ప్రస్తుతం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య సీపేజ్ వాటర్ తొలగించే పనులు జరుగుతున్నాయి. నీటిని తొలగించిన ప్రాంతంలో శాండ్ ఫిల్లింగ్ పనులు చేస్తున్నారు. బృందం సభ్యులు కొత్త డయాఫ్రమ్‌వాల్ నిర్మాణంపై చర్చించిన అనంతరం తుది నివేదిక తయారు చేస్తారని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment