సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో కూటమి పాలనలో జనసేన నాయకులు రెచ్చిపోతున్నారు. అధికారం తమదే అన్న భావనలో తాము ఏది చేసినా చెల్లుతుందని కబ్జాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన నేతలు తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా దోపీడీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అడ్డు చెప్పిన వారిని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
వివరాల ప్రకారం.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన నాయకులు రెచ్చిపోతున్నారు. పోలవరం కాలువ గట్లపై జనసేన, టీడీపీ నేతలు మట్టిని తవ్వేస్తున్నారు. ఈ క్రమంలో పచ్చ నేతల దోపిడీని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, మరింత రెచ్చిపోయిన ఎల్లో బ్యాచ్.. అడ్డు వచ్చిన స్థానికులనే చంపేస్తామని బెదిరింపులకు దిగారు.
అయితే, స్థానికంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల అండతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అక్రమార్కుల నుంచి పోలవరం గట్లను కాపాడాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment