‘కెన్‌–బెట్వా’లానే పోలవరం పరుగెత్తేది | Ken Betwa Link Project is finishing fast | Sakshi
Sakshi News home page

‘కెన్‌–బెట్వా’లానే పోలవరం పరుగెత్తేది

Published Sun, Aug 18 2024 5:02 AM | Last Updated on Sun, Aug 18 2024 7:28 AM

Ken Betwa Link Project is finishing fast

నిర్మాణ బాధ్యతలు కేంద్రం చేపట్టి ఉంటే అదీ పరిస్థితి 

అలా జరగనందుకే జాప్యం అంటున్న అధికారులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రం చేపట్టి ఉంటే.. ఈ పాటికి ప్రాజెక్టు ఎప్పుడో పూర్త­య్యే­దని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తు­న్నా­రు. ఇందుకు కేంద్రం శరవేగంగా పూర్తి చేస్తున్న కెన్‌–­బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టే ఉదాహరణ అని అధికార వర్గాలు సైతం ఉదహరి­స్తు­న్నాయి. ఈ ప్రాజె­క్టు కోసం 2022–23, 2023–­24­ల­ో రూ.9,105.01 కోట్లు ఖర్చు చేసిన కేంద్రం.. 2024–25 బడ్జెట్‌లో రూ.4000 కోట్లు కేటాయించి.. 2030 నాటికి పూర్తి చేసేలా శర­వేగంగా అడుగులు వేస్తోంది. 

అంటే.. కెన్‌–­బెట్వా అను­సంధానం ప్రాజెక్టుకు ఏడా­దికి సగటున రూ.4,552.50 కోట్లు ఖర్చు చేసినట్లు స్పష్ట­మవుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం 2014–­­15 నుంచి ఇప్పటి వరకు పదేళ్లలో రూ.15,146.27 కోట్లు విడుదల చేసింది. అంటే.. ఏడాదికి కేవలం రూ.1,514.62 కోట్లు మా­త్ర­­మే ఇచ్చింది. కమీషన్ల కక్కు­ర్తితో నిర్మాణ ప్రోటో­కాల్‌ను తుంగలో తొక్కిన చంద్ర­బాబు.. ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడంతో పోల­వరం ప్రాజెక్టులో విధ్వంసం చోటుచేసుకుంది. 

అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. ఓ వైపు విధ్వంసం.. మరో వైపు నిధుల సమస్యతో ఈ ప్రా­జెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పోలవ­రాన్ని ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్ప­లేని పరి­స్థితుల్లో ఉన్నామని సీఎం చంద్రబాబు చెప్పడమే ఇందుకు నిద­ర్శనం. ఈ పాపమంతా ఆయనదేనని నీటి పారు­దల రంగ నిపుణులు, అధికారులు స్పష్టం చేస్తున్నారు.

కెన్‌–బెట్వా లింక్‌ ప్రాజెక్టు ఇలా
కెన్‌–బెట్వా నదుల్లోని మిగులు జలాలను మళ్లించి మధ్యప్రదేశ్‌లో 8.11 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 2.51 లక్షల హెక్టార్లు వెరసి 10.62 లక్షల హెక్టార్లకు సాగునీరు, 62 లక్షల మందికి తాగునీరు (మధ్యప్రదేశ్‌లో 41 లక్షలు, ఉత్తర­ప్రదేశ్‌లో 21 లక్షలు) అందించేలా ఎన్‌డ­బ్ల్యూడీఏ­(జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ) అను­సంధానం ప్రాజెక్టును ప్రతిపాదించింది. కేంద్రప్ర­భుత్వ సారథ్యంలో అనుసంధాన పను­లు చేపట్ట­డానికి అంగీకరిస్తూ 2021 మార్చి 22న మధ్య­ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. 

ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 90 శాతం కేంద్రం, పది శాతం(ఆయకట్టు, తాగునీరు ఆధారంగా దామాషా పద్ధతిలో) రాష్ట్రాలు భరించేలా ఒప్పందం కుదిరింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 2021 డిసెంబర్‌ ధరల ప్రకారం రూ.44,605 కోట్లు. ఇందులో కేంద్రం వాటా రూ.39,317 కోట్లు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ల వాటా రూ.5,293 కోట్లు. ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం 2022 ఫిబ్రవరి 11న స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్పీవీ)­గా కెన్‌–బెట్వా లింక్‌ ప్రాజెక్టు అథారిటీ (కేబీ­ఎల్‌పీఏ)ని కేంద్రం ఏర్పాటు చేసింది. 

ఈ అథా­రిటీ సారథ్యంలో పనులు చేపట్టింది. 2022–23, 2023–­24లో ప్రాజెక్టు పనుల కోసం రూ.9,105.01 కోట్లు ఖర్చు చేసింది. 2024–25 బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లు కేటాయించింది. 2030 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి, ఆయకట్టుకు నీళ్లందించేలా పనులను వేగవంతం చేసింది. నదుల అనుసంధానంలో ఇదే మొదటి ప్రాజెక్టు.

కమీషన్ల కోసం చట్టాన్ని తుంగలో తొక్కిన వైనంరాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. వంద శాతం వ్యయాన్ని భరించి తామే పూర్తి చేస్తామని విభజన చట్టం సెక్షన్‌–90లో స్పష్టంగా పేర్కొంది. ఆ చట్ట ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎస్పీవీగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని 2014 మే 28న ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకుంటే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

 

కానీ.. 2014 జూన్‌ 8 నుంచే కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికే అప్పగించాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. చివరకు ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు అంగీకరించడంతో 2016 సెప్టెంబరు 7న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం.. రాష్ట్రానికి అప్పగించింది. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం 2014 ఏప్రిల్‌ 1 నాటికి నీటి పారుదల విభాగం పనుల్లో మిగిలిన పనులకు అయ్యే వ్యయం రూ.15,667.90 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చెప్పినదానికీ చంద్రబాబు తలూపారు.

ప్రాజెక్టు పనులకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే.. ఆ తర్వాత రీయింబర్స్‌ చేస్తామని కేంద్రం పెట్టిన షరతుకూ అంగీకరించారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న చంద్రబాబు.. కమీషన్ల కోసం ప్రాజెక్టు నిర్మాణ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వే ను పునాది స్థాయిలోనే వదిలేసి.. ప్రధాన డ్యామ్‌ పునాది డయా ఫ్రమ్‌ వాల్‌ పూర్తి చేసి చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారు. ఇది చాలదన్నట్టు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు చేపట్టి.. వాటిని పూర్తి చేయలేక ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలు వదిలేసి చేతులెత్తేశారు. 

దాంతో.. 2019, 2020లో గోదావరికి వచ్చిన భారీ వరదలు కాఫర్‌ డ్యామ్‌ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉధృతితో ప్రవహించడం వల్ల డయా ఫ్రమ్‌ వాల్‌ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఈ విధ్వంసానికి చంద్రబాబు సర్కార్‌దే పాపమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చి చెబుతూ ఈ నెల 12న సీడబ్ల్యూసీ, పీపీఏకు నివేదిక ఇచ్చింది. 

ఈ విధ్వంసం వల్లే పోలవరం పనుల్లో జాప్యం చోటు చేసుకుంటోంది. ప్రాజెక్టు నిర్మాణానికి 2014 ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,761.74 కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం రూ.15,146.27 కోట్లు రీయింబర్స్‌ చేసింది. మరో రూ.1615.47 కోట్లు రీయింబర్స్‌ చేయాల్సి ఉంది.

జీవనాడిని గాడిలో పెట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 
కమీషన్ల కక్కుర్తితో పోలవరం పనుల్లో చంద్ర­బాబు చేసిన తప్పులను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సరిదిద్దుతూ ప్రాజెక్టును గాడిలో పెట్టింది. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ఫైలట్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేసి.. 2021 జూన్‌ 11నే స్పిల్‌ వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున గోదావరి ప్రవాహాన్ని మళ్లించి వైఎస్‌ జగన్‌ రికార్డు సృష్టించారు. ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–1­లో పునాది డయా ఫ్రమ్‌ వాల్, గ్యాప్‌–3లో కాంక్రీట్‌ డ్యామ్‌.. జలాశయాన్ని కుడి, ఎడమ కాలు­వలతో అనుసంధానం చేసే కనెక్టివిటీస్, ఎడమ కాలు­వలో వరాహ అక్విడెక్టు సహా కీలకమైన పనులు పూర్తి చేశారు. 

దెబ్బతిన్న డయా ఫ్రమ్‌ వాల్‌ భవితవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామంటూ 2022 డిసెంబర్‌ నుంచి కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. ప్రాజెక్టు భూసే­కరణ, నిర్వాసి­తుల పునరావాసానికే రూ.33 వేల కోట్లు వ్యయం అవుతుందని.. ఈ నేపథ్యంలో 2013–14 ధరల ప్రకారం రూ.15,667.90 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని వైఎస్‌ జగన్‌ చెప్పిన వాస్తవా­లతో ప్రధాని మోదీ ఏకీభవించారు. తాజా ధరల మేరకు ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేలా వైఎస్‌ జగన్‌ కేంద్రాన్ని ఒప్పించి నిధుల సమస్యను తప్పించారు. 

వైఎస్‌ జగన్‌.. వరద ప్రవాహాన్ని మళ్లించే పనులతోపాటు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేసిన నేపథ్యంలో ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2లో డయా ఫ్రమ్‌ వాల్‌తో పాటు ప్రధాన డ్యామ్‌ పనులు చేపట్టడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకుండా, విధ్వంసం సృష్టించకుండా ఉండి ఉంటే.. 2022 డిసెంబర్‌ నాటికే పోలవరాన్ని వైఎస్‌ జగన్‌ పూర్తి చేసి ఉండే వారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement