దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చెప్తున్నవన్నీ అసత్యాలేనని, గతంలో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.