'ప్రత్యేక' ప్రైవేటు బిల్లు ఓటింగ్పై ఉత్కంఠ
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత కేవీపీ రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం మరోసారి చర్చకు వస్తుంది. అయితే, ఓటింగ్ నిర్వహిస్తారా లేదా అనేది మాత్రం ఉత్కంఠగా మారింది.
ప్రైవేటు బిల్లు నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలందరికి విప్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తేనే అక్కడి ప్రజలకు మేలు జరుగుతుందని గత కొంతకాలం ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని రకాల రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రైవేటు బిల్లుపై ఏం చేస్తుందనేది వేచి చూడాలి.