రాజ్యసభలో ఓటింగ్ పెట్టలేం: జైట్లీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు.. మనీ బిల్లు అని, రాజ్యాంగం ప్రకారం ద్రవ్యబిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ పెట్టలేమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. శుక్రవారం రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన హామీలను నెరవేరుస్తామన్నారు.
అలాగే విభజన సందర్భంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆయన ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలనే తాము చూస్తున్నామని జైట్లీ తెలిపారు. విభజన హామీలపై ఇవాళ కూడా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ ఎంపీలతో మాట్లాడామన్నారు. పార్లమెంట్లోని రెండు సభలకు వేర్వేరు హక్కులున్నాయన్నారు. ఆర్టికల్ 110లో ద్రవ్య బిల్లు గురించి స్పష్టంగా ఉందని జైట్లీ పేర్కొన్నారు.
ద్రవ్య బిల్లును లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలని, రాజ్యాంగం ప్రకారం ద్రవ్య బిల్లుకు రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించే సంప్రదాయం లేదని అందువల్ల ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడతామన్నారు. కొన్ని అంశాలపై రాజ్యసభలో నేరుగా చట్టాలు చేయలేమన్నారు. ఈ సందర్భంగా కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును జైట్లీ ద్రవ్య బిల్లు అనటంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవీపీ బిల్లును ఆర్థిక బిల్లు అని జైట్లీ అనడం సరికాదన్నారు. ప్రతి బిల్లు ఆర్థిక అంశాలతోనే ముడిపడి ఉందన్నారు.
కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును జైట్లీ ద్రవ్య బిల్లు అనటంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవీపీ బిల్లును ఆర్థిక బిల్లు అని జైట్లీ అనడం సరికాదన్నారు. ప్రతి బిల్లు ఆర్థిక అంశాలతోనే ముడిపడి ఉందన్నారు.