న్యూఢిల్లీ : రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ సభ్యులుగా కేవీపీ రామచంద్రరావు, కొప్పుల రాజు, ఎంఏ ఖాన్ల ఎంపిక ఖరారు అయినా చివరి నిమిషంలో సస్పెన్స్ కొనసాగుతుంది. కొప్పుల రాజు అభ్యర్థిత్వంపై ఏఐసీసీ వర్గాలు విముఖత చూపటంతో మళ్లీ రత్నాబాయి పేరు తెరమీదకు వచ్చింది. కేవీపీ, ఖాన్ల పేర్లు దాదాపు ఖరారు అయినా...మూడో అభ్యర్థిత్వంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
గతంలో రంపచోడవరం ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యురాలిగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న టి. రత్నాబాయి.. కాంగ్రెస్ రాజకీయాల్లో చాలా సీనియర్. దానికి తోడు ఎస్టీ కూడా కావడంతో ఆ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది.