MA Khan
-
వైఎస్సార్ ఉండుంటే.. కాంగ్రెస్‌కు ఈ గతి పట్టేది కాదు
యాచారం(ఇబ్రహీంపట్నం): డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం కాంగ్రెస్‌కు తీరని లోటని, ఆయన బ్రతికుంటే నేడు దేశంలో కాంగ్రెస్‌కు ఈ గతి పట్టేది కాదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యు డు ఎంఏ.ఖాన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి, ఎంపీ కేవీపీ రాంచంద్రరావు అందజేసిన రూ. 10 లక్షల ఆర్థిక సహకారంతో యాచారంలో వెంకటేశ్వర రైతుమిత్ర కమ్యూనిటీ భవనాన్ని నిర్మించారు. రైతుల పక్షపాతి అయిన వైఎస్సార్ చిత్రపటాన్ని శుక్రవారం రైతుమిత్ర భవనంలో ఎంఏ ఖాన్ తన చేతులమీదుగా ఆవిష్కరించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంఏ ఖాన్ మాట్లాడుతూ... వైఎస్ బ్రతికుంటే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చేదని, ఆ ప్రభావం దేశంలోని పలు రాష్ట్రాలపై పడి నేడు బీజేపీ అధికారంలోకి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు తీ రని నష్టం జరుగుతుందని గ్రహించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెల ంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని అ న్నారు. కాంగ్రెస్ నాయకుల ఐక్యత లో పం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపో యిందని అన్నారు. సోనియా పుణ్యం తో సీఎం అయిన కేసీఆర్.. నేడు కాం గ్రెస్నే ధూషిస్తున్నాడని మండిపడ్డారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చాడని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన సమయంలో కాంగ్రెస్ స్పష్టంగా తీర్మాణంలో పేర్కొన్నా.. నేడు మోదీ ప్రభుత్వం అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం హిందూ మతాన్ని పెంచి పోషిస్తూ ఇతర మతాలను ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. వైఎస్సార్ మాట తప్పని మనిషి: ముదిరెడ్డి రైతాంగ సంక్షేమం కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశాడని, ఆయన మా టిస్తే మడమ తిప్పకుండా అమలు చేసేవాడని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నా రు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్ర చేసి రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారని తెలిపారు. రైతుల రుణ మాఫీని ఒకేసారి అమలు చేయడం వల్ల రైతుల్లో సంతోషం వెల్లివిరిసిందని అన్నారు. జలయజ్ఞంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని తెలిపారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా 16 పంటలకు సంబంధించి మద్దతు ధరను రైతులకు న్యాయం జరిగేలా అమలు చేస్తామని కోదండరెడ్డి పేర్కొన్నారు. అనంతరం రైతుమిత్ర భవనంలో డాక్టర్ వైఎస్సార్, భవన నిర్మాణం కోసం స్థలమిచ్చిన భూదాత బొమ్మడిక మల్లారెడ్డిల చిత్రపటాలను, వైఎస్సార్ నిత్యకృషీవలుడు అనే పుస్తకాన్ని ఎంఏ ఖాన్, ముదిరెడ్డి కోదండరెడ్డిలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, ఇబ్రహీంపట్నం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పడాల శంకర్‌గౌడ్, కాంగ్రెస్ యాచారం, ఇబ్రహీం పట్నం, మంచాల మండలాల అధ్యక్షులు దెంది రాంరెడ్డి, శ్రీనువాస్‌రెడ్డి, వెంకటేష్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కాలె మల్లేష్, నక్కర్తమేడిపల్లి, గడ్డమల్లయ్యగూడ సర్పంచ్‌లు పాశ్ఛ భాషా, మల్లేష్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షెక్ దావుద్, నక్కర్తమేడిపల్లి ఉప సర్పంచ్ శ్రీనువాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు యాదయ్య, సంధాని, కుర్మిద్ద మాజీ ఎంపీటీసీ యాదయ్యచారి, నాయకులు ఇబ్రహీం, పొలే రమేష్, సుబానీ, సంగెం రవి, తదితరులు పాల్గొన్నారు. -
పీఏసీ సభ్యుడిగా ఎంఏ ఖాన్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) సభ్యుడిగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ నియమితులయ్యారు. ఒక సభ్యుడి పదవీకాలం పూర్తి కావడంతో ఆ స్థానంలో కాంగ్రెస్ తరఫున ఎంఏ ఖాన్‌ను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని ధ్రువీకరిస్తూ పార్లమెంట్ శనివారం బులెటిన్ విడుదల చేసింది. ప్రతిష్టాత్మకమైన ఈ కమిటీకి లోక్‌సభలో ప్రతిపక్ష నేత చైర్మన్‌గా వ్యవహరిస్తారు. లోక్‌సభ నుంచి 22 మంది, రాజ్యసభ నుంచి ఆరుగురు ఇందులో సభ్యులుగా ఉంటారు. -
ఏపీ ఎక్స్‌ప్రెస్ వేగం అంతే..!
న్యూఢిల్లీ : విశాఖ-న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ గరిష్టంగా 110 కి.మీ. వేగంతో మాత్రమే వెళ్తుందని కేంద్ర రైల్వే శాఖ స్పష్టం చేసింది. అందువల్ల ప్రస్తుత ప్రయాణ సమయాన్ని కుదించడం సాధ్యం కాదని పేర్కొంది. రాజ్యసభలో సభ్యుడు ఎం.ఎ.ఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు శుక్రవారం సమాధానమిచ్చారు. ఈ ఎక్స్‌ప్రెస్ పేరును రాజధాని ఎక్స్‌ప్రెస్‌గా గానీ, దురంతో ఎక్స్‌ప్రెస్‌గా గానీ మార్చడం సాధ్యపడదన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలను దేశరాజధానితో అనుసంధానించేందుకు ఉద్దేశించినందున 19 హాల్టింగ్‌లతో నడుస్తోందని చెప్పారు. రాజధాని, దురంతో తరహాలో పనిచేసే అవకాశం కూడా ఈ ఎక్స్‌ప్రెస్‌కి లేదని తెలిపారు. అందువల్ల అటు వేగం పెంచడం గానీ, ఇటు హాల్టింగ్‌లు కుదించడం గానీ సాధ్యపడదని చెప్పారు. అయితే ఈ ఎక్స్‌ప్రెస్ రైలుకి నాన్ -ఏసీ బోగీలను కలపాలని వినతులు వెల్లువలా వచ్చాయని గుర్తు చేశారు. అయితే 2014-15 బడ్జెట్లో ఏపీ ఎక్స్‌ప్రెస్‌గా ప్రకటించిన నేపథ్యంలో దానిని మార్చలేమని వివరించారు. -
డిగ్రీ కళాశాలల్లో సీట్ల పెంపు
సాక్షి, ముంబై : ముంబై విశ్వవిద్యాలయం డిగ్రీ కళాశాలల్లో 10 శాతం సీట్లను పెంచడంతో వేల మంది విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. ట్రెడిషనల్ డిగ్రీ కోర్సులలో కూడా 10 శాతం సీట్లను పెంచేందుకు అన్ని కాలేజీలకూ అనుమతించింది. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు 15 శాతం సీట్లు ఈ విద్యా సంవత్సరం నుంచే పెంచామని పేర్కొంది. మెరిట్ సాధించని విద్యార్థులకు ఈ విధానం ఎంతో దోహదకరంగా ఉంటుంది. ఇందుకు ఆన్లైన్ దరఖాస్తు కోసం తుది గడువు జూలై 15వ తేదీ వరకు పొడిగించారు. ఈసారి అధిక శాతం విద్యార్థులు మంచి మార్కులు స్కోర్ చేయడంతో ఈ ఏడాది సీట్లు పెంచాల్సిందిగా నగరంలోని పలు కాలేజీలు డిమాండ్ చేశాయని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం.ఎ.ఖాన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని తీర్మానించింది. యూనివర్సిటీ అనుబంధ కళాశాలల మొత్తం సామర్థ్యం 1.3 లక్షలుగా ఆయన పేర్కొన్నారు. కాలేజీలలో సీట్లు పెంచాలని ఇదివరకే 130 కళాశాలలు దరఖాస్తు చేశాయని ఆయన పేర్కొన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ముఖ్యంగా బీకాం, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోర్సులకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని తెలిపారు. ఆఫర్ చేసిన సీట్లకంటే మూడింతలుగా విద్యార్థుల నుంచి కళాశాలలు దరఖాస్తులను స్వీకరించారు. చర్చ్‌గేట్‌లోని జైహింద్ కళాశాలలో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోర్సులైన బీఎంఎం, బీఎంఎస్‌లకు 120 సీట్లు ఉండగా దాదాపు రెండు వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. బీకాం కోర్సు కోసం హెచ్ఆర్ కళాశాల ఇతర కామర్స్ కళాశాల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. గతంలోనే కళాశాలలో 10 సీట్లు పెంచాలని పలు కళాశాలలు డిమాండ్ చేసినా ఇప్పుడు దీనికి మోక్షం లభించింది. కొన్ని కాలేజీల విముఖత ఇదిలా ఉండగా కొన్ని కాలేజీలు మాత్రం 10 శాతం సీట్లను పెంచేందుకు విముఖత చూపిస్తున్నాయి. 10 శాతం సీట్లను పెంచడంతో తరగతి గదుల్లో రద్దీ పెరుగుతోందనీ, అధ్యాపకులపై కూడా అదనపు భారం పడుతోందని సీట్ల పెంపునకు అంగీకరించడం లేదు. నగర వ్యాప్తంగా కాలేజీలలో చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయని విలేపార్లేలోని ఎన్ఎం కళాశాల ప్రిన్సిపల్ సునీల్ మంత్రి అభిప్రాయపడ్డారు. మరిన్ని సీట్లను పెంచడం సరికాదని తెలిపారు. కానీ డివిజన్లను పెంచి, అనుగుణంగా ప్రక్రియ మంజూరు చేస్తే ఉంటే బాగుంటుందనీ అభిప్రాయం వ్యక్తం చేశారు. వృథాగా అన్‌పాపులర్ కోర్సులు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోర్సులలో 15 శాతం సీట్లను పెంచడంతో ప్రస్తుతం 60 మంది విద్యార్థులకు బదులు ఒకో డివిజన్లో 69 మంది విద్యార్థులు చేరవచ్చు. ట్రెడిషినల్ కోర్సులలో కూడా మామూలుగా కళాశాలల్లో 120 సీట్లు ఉండగా, 10 శాతం సీట్లు పెంచడంతో మరో 12 మంది విద్యార్థులను అదనంగా చేర్పించుకోవచ్చు. ఈ ఏడాది అడ్మిషన్ల కోసం 1.3 లక్షల డిగ్రీ సీట్లు ఉండగా, 60 వేల సీట్లు వృథాగా పడి ఉన్నాయి. అన్ పాపులర్ కోర్సులకు సంబంధించి చాలారోజులుగా నగరంలోని కళాశాలలో సీట్లు వృథాగా పడి ఉన్నాయని ఎం.ఎ.ఖాన్ తెలిపారు. -
కేవీపీ, టీస్సార్, ఎంఏఖాన్ నామినేషన్లు
హైదరాబాద్ : కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులుగా కేవీపీ రామచంద్రరావు, టీ.సుబ్బరామిరెడ్డి, ఎంఏఖాన్ మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. కేవీపీ నామినేషన్‌పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీపీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ సంతకాలు చేశారు. రాజ్యసభ నామినేషన్లకు మంగళవారం తుదిగడువు కావడంతో, రాష్ట్రం నుంచి జరగనున్న ఆరు రాజ్యసభ సీట్లకు నామినేషన్లు దాఖలు కానున్నాయి. కాంగ్రెస్ నుంచి తిరుగుబాటు అభ్యర్ధులుగా ఉన్న ఎమ్మెల్సీ చైతన్యరాజు ఇప్పటికే నామినేషన్ వేశారు. కొందరు ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకోవటంతో చైతన్యరాజు మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు. ఇక టీఆర్ఎస్ నుంచి కేశవరావు, టీడీపీ నుంచి సీతామహాలక్ష్మి, గరికిపాటి మోహనరావు నామినేషన్లు దాఖలు చేశారు. -
చివరి నిమిషంలో జేసీ విత్ డ్రా
హైదరాబాద్ : అధిష్టానాన్ని ధిక్కరించి అయినా రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధపడ్డ మాజీమంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అధిష్టానం తనను ఎంపిక చేయకపోయినా పోటీ చేసి తీరాతానంటూ హంగామా చేసిన జేసీ హఠాత్తుగా తన నిర్ణయం మార్చుకున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని తనకు రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించిన టి సుబ్బరామిరెడ్డి, కెవిపి రామచంద్రరావు ఫోన్ చేసినట్లు జేసీ పేర్కొనటం విశేషం. కాగా కోస్తా ఆంధ్రా ప్రాంతం నుంచి ఎమ్మెల్సీ చైతన్యరాజు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన మంగళవారం ఉదయం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. చైతన్యరాజుకు జేసీ దివాకర్ రెడ్డి మద్దతు పలికారు. కాగా రెబల్‌గా పోటీలోకి దిగేందుకు చైతన్యరాజు, విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే రాయలసీమ నుంచి జేసీ దివాకరరెడ్డి పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ సీమాంధ్ర నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు చైతన్యరాజు వైపు మొగ్గు చూపారు. మరోవైపు టీఆర్ఎస్ తరపున కేశవరావు నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్కు సీపీఐ మద్దతు ఇచ్చింది. కాగా కేవీపీ రామచంద్రరావు, టీ సుబ్బరామిరెడ్డి, ఎంఏ ఖాన్లకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈరోజు గాంధీభవన్‌లో బీఫారమ్‌లు అందించారు. పార్టీకి చేసిన సేవకు గుర్తింపుగానే సోనియా ముగ్గురికి టిక్కెట్లు ఇచ్చిందని బొత్స తెలిపారు. ఇక టీడీపీ తరపున పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట సీతామహాలక్ష్మి, గరికపాటి మోహన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు వారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. -
రాజ్యసభ తెరపైకి రత్నాబాయి పేరు
న్యూఢిల్లీ : రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ సభ్యులుగా కేవీపీ రామచంద్రరావు, కొప్పుల రాజు, ఎంఏ ఖాన్ల ఎంపిక ఖరారు అయినా చివరి నిమిషంలో సస్పెన్స్ కొనసాగుతుంది. కొప్పుల రాజు అభ్యర్థిత్వంపై ఏఐసీసీ వర్గాలు విముఖత చూపటంతో మళ్లీ రత్నాబాయి పేరు తెరమీదకు వచ్చింది. కేవీపీ, ఖాన్ల పేర్లు దాదాపు ఖరారు అయినా...మూడో అభ్యర్థిత్వంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో రంపచోడవరం ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యురాలిగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న టి. రత్నాబాయి.. కాంగ్రెస్ రాజకీయాల్లో చాలా సీనియర్. దానికి తోడు ఎస్టీ కూడా కావడంతో ఆ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. -
కేవీపీ, ఎంఏఖాన్, కొప్పులకు చోటు!
-
కేవీపీ, ఎంఏఖాన్, కొప్పులకు చోటు!
న్యూఢిల్లీ : రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపిక కావాల్సిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు ఖరారు చేసినట్లు సమాచారం. ఈసారి మూడు సీట్లకే కాంగ్రెస్ పోటీ చేయాలని నిర్ణయించింది. రాజ్యసభ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థులుగా కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్, కొప్పుల రాజులను ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపినకు ఈరోజు మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్న నేతలను కాంగ్రెస్ బుజ్జగించే పనిలో పడింది. కాగా ఫిబ్రవరి 7న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇక రాజ్యసభ టికెట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ కాంగ్రెస్‌కు తలనొప్పి వ్యవహారంగా మారింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు పార్టీ ఎంపిక చేసే అభ్యర్థులను ఓడిస్తామని చెబుతుండటం, సమైక్యవాదాన్ని విన్పిస్తున్న నేతలను స్వతంత్రులుగా బరిలో దింపేందుకు ప్రయత్నిస్తుండటంతో అధిష్టానం పెద్దలకు అభ్యర్థుల ఎంపిక చిక్కుముడిగా మారింది. ఇలాంటప్పుడు కొత్తవారిని ఎంపిక చేయడం లేనిపోని ఇబ్బందులకు దారి తీయొచ్చన్న ఆందోళన కూడా నేతల్లో ఉన్నట్టు తెలుస్తోంది. సిట్టింగులనే మళ్లీ బరిలో దించితేనే మేలన్న ఆలోచన అధిష్టానం ఉంది.