మాట్లాడుతున్న ఎంఏ ఖాన్
యాచారం(ఇబ్రహీంపట్నం): డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం కాంగ్రెస్‌కు తీరని లోటని, ఆయన బ్రతికుంటే నేడు దేశంలో కాంగ్రెస్‌కు ఈ గతి పట్టేది కాదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యు డు ఎంఏ.ఖాన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి, ఎంపీ కేవీపీ రాంచంద్రరావు అందజేసిన రూ. 10 లక్షల ఆర్థిక సహకారంతో యాచారంలో వెంకటేశ్వర రైతుమిత్ర కమ్యూనిటీ భవనాన్ని నిర్మించారు. రైతుల పక్షపాతి అయిన వైఎస్సార్ చిత్రపటాన్ని శుక్రవారం రైతుమిత్ర భవనంలో ఎంఏ ఖాన్ తన చేతులమీదుగా ఆవిష్కరించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంఏ ఖాన్ మాట్లాడుతూ...
వైఎస్ బ్రతికుంటే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చేదని, ఆ ప్రభావం దేశంలోని పలు రాష్ట్రాలపై పడి నేడు బీజేపీ అధికారంలోకి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు తీ రని నష్టం జరుగుతుందని గ్రహించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెల ంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని అ న్నారు. కాంగ్రెస్ నాయకుల ఐక్యత లో పం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపో యిందని అన్నారు. సోనియా పుణ్యం తో సీఎం అయిన కేసీఆర్.. నేడు కాం గ్రెస్‌నే ధూషిస్తున్నాడని మండిపడ్డారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చాడని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన సమయంలో కాంగ్రెస్ స్పష్టంగా తీర్మాణంలో పేర్కొన్నా.. నేడు మోదీ ప్రభుత్వం అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం హిందూ మతాన్ని పెంచి పోషిస్తూ ఇతర మతాలను ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు.
వైఎస్సార్ మాట తప్పని మనిషి: ముదిరెడ్డి
రైతాంగ సంక్షేమం కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశాడని, ఆయన మా టిస్తే మడమ తిప్పకుండా అమలు చేసేవాడని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నా రు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్ర చేసి రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారని తెలిపారు. రైతుల రుణ మాఫీని ఒకేసారి అమలు చేయడం వల్ల రైతుల్లో సంతోషం వెల్లివిరిసిందని అన్నారు. జలయజ్ఞంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని తెలిపారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా 16 పంటలకు సంబంధించి మద్దతు ధరను రైతులకు న్యాయం జరిగేలా అమలు చేస్తామని కోదండరెడ్డి పేర్కొన్నారు.
అనంతరం రైతుమిత్ర భవనంలో డాక్టర్ వైఎస్సార్, భవన నిర్మాణం కోసం స్థలమిచ్చిన భూదాత బొమ్మడిక మల్లారెడ్డిల చిత్రపటాలను, వైఎస్సార్ నిత్యకృషీవలుడు అనే పుస్తకాన్ని ఎంఏ ఖాన్, ముదిరెడ్డి కోదండరెడ్డిలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, ఇబ్రహీంపట్నం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పడాల శంకర్‌గౌడ్, కాంగ్రెస్ యాచారం, ఇబ్రహీం పట్నం, మంచాల మండలాల అధ్యక్షులు దెంది రాంరెడ్డి, శ్రీనువాస్‌రెడ్డి, వెంకటేష్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కాలె మల్లేష్, నక్కర్తమేడిపల్లి, గడ్డమల్లయ్యగూడ సర్పంచ్‌లు పాశ్ఛ భాషా, మల్లేష్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షెక్ దావుద్, నక్కర్తమేడిపల్లి ఉప సర్పంచ్ శ్రీనువాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు యాదయ్య, సంధాని, కుర్మిద్ద మాజీ ఎంపీటీసీ యాదయ్యచారి, నాయకులు ఇబ్రహీం, పొలే రమేష్, సుబానీ, సంగెం రవి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment