Koppula raju
-
‘రాహుల్ అపాయింట్మెంట్తో రాజుకు ఏం సంబంధం’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి టికెట్ల కేటాయింపుల్లో ఏఐసీసీ నాయకుడు కొప్పుల రాజుకు ప్రమేయం లేదని రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి ఆర్సీ కుంతియా స్పష్టం చేశారు. టీపీసీసీ ఎన్నికల కమిటీ నిర్ణయం మేరకే టికెట్ల కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. పీసీసీ, ఎల్.ఓ.పి, ఇంచార్జి కార్యదర్శులు, ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఆలోచించే టిక్కెట్లు కేటాయించామని తెలిపారు. వాటితో కొప్పుల రాజుకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. తమకు టికెట్ ఇవ్వకుండా రాజు అడ్డుకున్నారనే కొంతమంది వాదనల్లో నిజం లేదని తేల్చిచెప్పారు. పార్టీ నాయకులెవరైనా తమ ఫిర్యాదులను పీసీసీ, ఏఐసీసీకి దృష్టికి తీసుకెళ్లాలి. కానీ, పత్రికలకు ఎక్కి ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. కొప్పుల రాజు సిన్సియర్‌గా పనిచేస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఆయనకు తెలంగాణ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాజు వల్లనే రాహుల్ గాంధీని కలవలేక పోతున్నామనే కొందరు నేతల ఆరోపణల్ని సైతం కుంతియా కొట్టిపారేశారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్తో కొప్పులరాజుకు ఏం సబంధమని ప్రశ్నించారు. అది పూర్తిగా రాహుల్ గాంధీ వ్యక్తిగత కార్యదర్శి చూసుకుంటారని పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్ నాయకులు పత్రికలకి ఎక్కి ఆరోపణలు చేయకుండా సమస్యలేవైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికపై మాట్లాడాలని సూచించారు. -
రెండురోజులపాటు కాంగ్రెస్ శిక్షణా తరగతులు
హైదరాబాద్: ఈ నెల 19, 20 తేదీలలో సికింద్రాబాద్‌లోని కేజేఆర్ గార్డెన్స్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటలనుంచి సాయంత్రం 7 గంటల వరకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. శిక్షణా తరగతుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీతత్వం, భావజాలంపై, అదేవిధంగా కేంద్రంలో, రాష్ట్రంలో పాలక పక్షాలైన బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల పాలనా వైఫల్యాలపై స్థానిక ప్రజాప్రతినిధులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ శాస్త్రవేత్తలతో శిక్షణ ఇవ్వనున్నారు. గతంలో పురపాలక సంఘాల స్థాయిలో పట్టణ స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహించిన తరహాలోనే ఈసారి గ్రామీణ స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటిరోజున జడ్పీటీసీలు, ఎమ్పీపీలు, ఎమ్పీటీసీలు, సింగిల్ విండో ఛైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొంటారు. రెండో రోజున సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు శిక్షణా తరగతుల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రముఖ నాయకులు దిగ్విజయ్ సింగ్, కొప్పుల రాజు, రామచంద్ర కుంతియా తదితరులు పాల్గొంటారు. -
దళితుల్లో అభద్రత పెంచిన మోదీ : కొప్పుల రాజు
ఏఐసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు సాక్షి, హైదరాబాద్: దళితులపై కాకుండా తనపై దాడి చేయాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో దళితుల్లో, మైనారిటీల్లో మరింత అభద్రత పెరిగిందని ఏఐసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్కతో కలసి మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. దళితులకు ప్రత్యేకంగా ఉన్న చట్టాలను అమలు చేస్తామని, దాడులు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మోదీ చెప్పలేదన్నారు. భరోసా కల్పించేవిధంగా మాట్లాడకుండా, మరింత ప్రోత్సహించే విధంగా మోదీ మాట్లాడటంతో మరింత అభద్రత, ఆందోళన పెరుగుతున్నదన్నారు. గో రక్షక్ విషయంలో చట్టంపై నమ్మకాన్ని కలిగించేలా మోదీ ఎందుకు మాట్లాడలేదని రాజు ప్రశ్నించారు. రెండేళ్లుగా మైనారిటీలపై, దళితులపై దాడులు జరుగుతున్నా నోరెందుకు విప్పలేదన్నారు. జీవో 123పై సుప్రీంకు... జీవో 123పై హైకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగు, ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలపై వాస్తవ జలదృశ్యాన్ని ఈ నెల 17న ఆవిష్కరిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టి, ప్రాజెక్టుల విషయంలో వాస్తవాలేమిటో ప్రజలకే వెల్లడిస్తామన్నారు. ఈ నెల 16న ఆదిలాబాద్‌లో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం, సాయంత్రం రైతు గర్జన ఉంటాయన్నారు. -
రాహుల్ రాజకీయ కార్యదర్శిగా కొప్పుల?
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా ఉన్న కొప్పుల రాజు త్వరలో రాహుల్ గాంధీ రాజకీయ కార్యదర్శిగా నియమితులవబోతున్నారని సమాచారం. బిహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏఐసీసీ కార్యవర్గాన్ని బలోపేతం చేసే దిశగా కసరత్తు చేస్తున్న పార్టీ.. కొప్పుల రాజుకు ఈ పదవిని కట్టబెట్టనున్నట్టు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో పేద, వెనకబడిన వర్గాల సంక్షేమ పథకాల రచనలో కీలక పాత్ర పోషించిన ఈయన రాహుల్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నారు. రాహుల్ ముఖ్య ప్రసంగాల కూర్పు నుంచి పార్టీ విధానాల రూపకల్పన వరకూ కొప్పుల క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న నేతగా స్వల్ప కాలంలోనే పేరు తెచ్చుకున్నారు. పార్టీలో ఎస్సీల పాత్ర పెరగడానికి అనుగుణంగా ఆయన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. -
సంఘ సంస్కర్త, జాతి నిర్మాత
విశ్లేషణ రేపు అంబేద్కర్ వర్ధంతి 1950-51 మధ్య కాలంలో డాక్టర్ అంబేద్కర్, నెహ్రూలు హిందూ స్మృతిని పార్లమెంటులో ఆమోదింపచేయటం కోసం ప్రయత్నించారు. కానీ నిలువెత్తు ప్రతిఘటనతో బిల్లును పక్కన పెట్టాల్సివచ్చింది. ఇందుకు నిరసనగానే అంబేద్కర్ మంత్రి మండలికి రాజీనామా చేశారు. డాక్టర్ బీఆర్ అంబే ద్కర్ (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956) సంస్కర్త, ఉదార ప్రజాతంత్ర వాది. అణగారిన వర్గా లు, ప్రత్యేకించి ఎస్సీ/ ఎస్టీల ప్రయోజనాల కోసం పాటుపడ్డ వ్యక్తిగా ప్రధానంగా చెప్పుకోవడం పరిపాటి. దీనితో మొత్తం జాతి నిర్మాణానికి ఆయన అందించిన సేవలు మరుగున పడ్డాయి. భారత రా జ్యాంగ నిర్మాతగా ఆయన చరిత్రలో స్థిరపడిపోయినా ఈ బహుముఖ ప్రజ్ఞాపా టవాల గురించి చర్చ నడవలేదు. 1927లో హిల్టన్ యంగ్ కమిషన్‌కు అంబేద్కర్ ఇచ్చిన మహాజరు ఆధారంగానే రిజర్వు బ్యాంకు విధి విధానాలు రూపుదిద్దుకున్నా యి. భారతీయ ద్రవ్యం, ఆర్థిక సమస్య లపై ఏర్పడ్డ రాయల్ కమిషన్ అంబేద్కర్ రాసిన ‘రూపాయి సమస్యలు, పుట్టుక, పరిష్కారం’ అన్న గ్రంథంతో తీవ్రంగా ప్రభావితమైంది. 1934లో భారత రిజర్వు బ్యాంకు చట్టంవచ్చింది. 1942-46 మధ్య కాలంలో వైశ్రాయ్ మంత్రిమండలిలో ఆయన కార్మిక, నీటిపారుదల, విద్యుత్ శాఖమంత్రిగా పనిచేశారు. కేంద్ర జలవన రుల సంఘం, దేశంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన మౌలిక వనరులు సమకూర్చ టానికి ఉద్దేశించిన కేంద్ర సాంకేతిక విద్యు త్ బోర్డుకు కూడా ఆయనే ఆద్యుడు. అంబేద్కర్ జీవితాన్ని, కృషిని అధ్య యనం చేసిన వారికి కొన్ని విషయాలు స్పష్టంగా అర్థం అవుతాయి. ఆయన దృక్ప థం అందరికీ సమాన హక్కులు కోరు తోంది. రాజ్యాంగ పరిషత్ లో తన చివరి ప్రసంగంలో తన ఆలోచనను మరింత విఫులీకరించారు. ‘‘మనం సాధించిన రాజకీయ ప్రజా స్వామ్యాన్ని, సామాజిక ప్ర జాస్వామ్యంగా మార్చాల్సి న అవసరం ఉంది. పునాది లో సామాజిక ప్రజాస్వా మ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్య మనుగడ సాగించజా లదు’’ అన్నారు. ప్రథమ న్యాయశాఖ మంత్రిగా మహిళా హక్కులను చట్టబద్ధం చేయటానికి ఆయన ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి కాకముందే మహిళా ఉద్ధరణ కోసం పని ప్రారంభించారు. లోథియన్ కమిషన్ (1932) విచారణలోనూ 1933-34లో ఏ ర్పాటైన జాయింట్ సెలెక్ట్ కమిటీ ముం దూ మహిళల హక్కుల కోసం వాదించా రు. దాని ఫలితంగానే 1935 భారత ప్రభుత్వ చట్టంలో తొలిసారి మహిళలకు ఓట హక్కు దక్కింది. రాజ్యాంగ ముసా యిదాలో కూడా 14-16 అధికరణాల ద్వారా మహిళలకు పౌర హక్కులు దఖలు పర్చటంతో పాటు, కన్యాశుల్కా నికి స్వస్తి చెప్పటంలో ఆయనదే ప్రధాన పాత్ర. స్వాతంత్య్రానికి ముందే మంత్రివర్గం లో చేరమని డాక్టర్ అంబేద్కర్‌ను నెహ్రూ ఆహ్వానించారు. ఆ నాటికి హిందూ చట్టం గురించి ఉన్న వేర్వేరు వ్యాఖ్యానాలను క్రోడీకరించి ఒకే చట్టాన్ని దేశం ముందుం చే క్రమంలో డాక్టర్ అంబేద్కర్ హిందూ స్మృతిని ప్రతిపాదించారు. విప్లవాత్మకమైన ఈ చట్టం మహిళలకు సమాన హక్కులు కల్పించటంతో పాటు కుల పరమైన వ్యత్యాసాలకు తా వు లేకుండా చేసింది. బీఎన్ రావు కమిటీ ప్రతిపాదిం చిన ముసాయిదాను కూ లంకషంగా పరిశీలించిన ఆయన అనేక ముఖ్యమైన సవరణలతో హిందూ స్మృ తి బిల్లు ప్రతిపాదించారు. దీనితో మొదటిసారిగా వితంతువులు, కూతుళ్లు, కొడుకులతో పాటు తండ్రి ఆస్తిలో సమాన హక్కుదారు లయ్యారు. గృహహింస లేదా భర్తలు నిర్ల క్ష్యం చేయటం కారణంగా భార్యలకు విడా కులు తీసుకునే హక్కు దక్కింది. భర్త రెం డో భార్యను పెళ్లాడటాన్ని నిషేధించింది. వేర్వేరు కులాలకు చెందిన స్త్రీ పురుషులు హిందూ చట్టం కింద వివాహమాడే అవకా శం వచ్చింది. 1949లో అప్పటికే అఖిల భారత హిందూ స్మృతి వ్యతిరేక కమిటీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పని ప్రారంభించింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆరెస్సెస్ ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. 1950-51 మధ్య కాలంలో డాక్టర్ అంబే ద్కర్, నెహ్రూలు హిందూ స్మృతిని పార్ల మెంటులో ఆమోదింపచేయటం కోసం ప్రయత్నించారు. కానీ నిలువెత్తు ప్రతిఘ టనతో బిల్లును పక్కన పెట్టాల్సివచ్చింది. ఇందుకు నిరసనగానే అంబేద్కర్ మంత్రి మండలికి రాజీనామా చేశారు. బహుశా భారతదేశ చరిత్రలోనే మహిళలకు హక్కు లు కల్పించాలన్న డిమాండ్‌తో కేంద్రమం త్రి రాజీనామా చేయటం ఇదే తొలి సంఘటన. తొలి సార్వత్రిక ఎన్నికలలో ఘన విజ యం సాధించిన నెహ్రూ హిందూ స్మృతి ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. అయితే ఒకే చట్టంగా కాక హిం దూ వివాహ చట్టం, విడాకుల చట్టం, వార సత్వ చట్టం, దత్తత చట్టం పేర్లతో వివిధ భాగాలుగా ప్రవేశపెట్టారు. వీటిని మహి ళా సభ్యులతో పాటు విఎన్ గాడ్గిల్, పం డిట్ ఖుజ్రు వంటి సభ్యులు సమర్థించారు. తరువాత సంస్కరణవాదులు, మితవా దులు అనివార్యంగా బలపర్చాల్సిన పరి స్థితి వచ్చింది. ఈ బిల్లులు 1955-56లో చట్టాల రూ పం దాల్చాయి. అనంతరం కొంత కాలా నికి డాక్టర్ అంబేద్కర్ స్వర్గస్థులయ్యారు. ఆయనకు సంతాపం ప్రకటిస్తూ నెహ్రూ, ‘‘హిందూ సమాజంలోనే అన్ని రకాల అణ చివేతతో కూడిన లక్షణాలపై తిరుగుబాటు ప్రకటించిన వ్యక్తిగా అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోతారు. అంతేకాదు. హిందూ స్మృ తికి సంబంధించి ఆయన ప్రదర్శించిన ఆసక్తి, ఎదుర్కొన్న ఇబ్బందుల దృష్ట్యా కూడా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. ఆయన జీవించి ఉండగానే ఆయన ప్రతి పాదించిన సంస్కరణల్లో అనేకం ఆయన ప్రతిపాదించిన రూపంలో కాకపోయినా వివిధ భాగాలుగా చట్ట రూపం తీసుకో వటం సంతోషకరం’’ అని ప్రకటించారు. నెహ్రూ 125వ జయంతి సందర్భంగా భారతీయ సమాజ నిర్మాణంలో నెహ్రూ, బాబా సాహెబ్ అంబేద్కర్ల సంయుక్త కృషిని స్మరించుకోవటం ఇరువురికీ సమ ర్పించగలిగిన నివాళి. (వ్యాసకర్త ఏఐసీసీ ఎస్.సి.విభాగం అధ్యక్షులు) -
కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయండి
టీపీసీసీ ఎస్సీ సెల్ శిక్షణ శిబిరంలో పొన్నాల, కొప్పుల రాజు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అన్ని విభాగాలు కలసికట్టుగా కృషి చేయాలని ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ ఎస్సీ సెల్ శిక్షణ శిబిరంలో వారు మాట్లాడారు. పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు ఎస్సీ విభాగం కృషి చేయాలని, క్రియాశీలకంగా పనిచేసేవారితో మండల కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ఎ.కృష్ణ అధ్యక్షతన జరిగిన శిబిరానికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 238 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి మండలం నుంచి కనీసం 10 మంది నాయకులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో దళిత సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కనీసం 5వేల మందితో త్వరలో దళిత మహాసభను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. అనంతరం ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు విలేకరుల సమావేశంలో ఇవే అంశాలను వివరించారు. శిబిరానికి మాజీ ఎంపీ రాజయ్య, మాజీ మంత్రి చంద్రశేఖర్, అద్దంకి దయాకర్, గ జ్జల కాంతం తదితరులు హాజరయ్యారు. -
‘పేదల హృదయాల్లో కాంగ్రెస్ పదిలం’
నెల్లూరు: ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, పేదల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ పదిలంగా ఉంటుందని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను తెలుసుకునేందుకు సోమవారం ఆయన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలనాటికి తిరిగి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
తెలంగాణలో మెజారిటీ సీట్లు మావే
ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు ధీమా ఇతరుల మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పాలనలో విప్లవాత్మక మార్పులు {పైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని తీసుకొస్తాం హైదరాబాద్: తెలంగాణలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమని ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల అనంతరం ఇతర పార్టీల మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సుపరిపాలన, బీసీ, మైనారిటీ, మహిళా సాధికారత, యువత ఉపాధి, విద్యారంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. ఆదివారమిక్కడి గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మూడు తరాల ఎదురుచూపులు ఫలించాయి. తెలంగాణ అంతటా మేం పర్యటించి వచ్చాం. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో మంచి స్పందన కన్పిస్తోంది. నాయకుల మధ్య సమన్వయ లోపమున్నప్పటికీ ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ సమర్థవంతంగా ముందుకు వెళుతున్నారు’’ అని పేర్కొన్నారు. మాజీ మంత్రి శంకర్రావుకు టికెట్ నిరాకరణలో తన పాత్ర ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని రాజు కొట్టిపారేశారు. ‘‘ఆయనకు టికెట్ రాకపోవడానికి అనేక కారణాలున్నాయి. టికెట్ల కేటాయింపులో అసలు నా ప్రమేయం లేనేలేదు. నేను ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సభ్యుడిని కాదు. ప్రదేశ్ ఎన్నికల కమిటీలోనూ లేను. నాపై అలాంటి ఆరోపణలు చేయడం సరికాదు’’ అని చెప్పారు. జేఏసీ నాయకులు చేసిన సేవలకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధాన నిర్ణయం వల్లే ముగ్గురికి అవకాశం వచ్చిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకొస్తే ప్రధానంగా ఐదు అంశాల్లో మౌలిక మార్పులు తీసుకొస్తామని తెలిపారు. 1.ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తూ విప్లవాత్మక చట్టాన్ని తెస్తాం. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు లభించేలా చేస్తాం. అదే సమయంలో ఆయా సామాజిక వర్గాల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణా సంస్థలను ఏర్పాటు చేస్తాం. తద్వారా జిల్లాకో లక్ష ప్రైవేటు ఉద్యోగాలతో యువతకు ఉపాధి కల్పిస్తాం. 2.అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే కచ్చితంగా లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతాం. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిషన్‌ను నియమిస్తాం. దీనికితోడు ఎప్పటికప్పుడు వారిపై ప్రత్యేక నిఘా పెట్టి పారదర్శక పాలన సాగేలా చూస్తాం. 3. ప్రభుత్వ విద్యారంగంలో నాణ్యమైన విద్యను అందించేందుకు సమూలమైన మార్పులు చేసే విద్యా విధానాన్ని తీసుకొస్తాం. ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్, వృత్తి విద్యా కళాశాలలను ఏర్పాటు చేస్తాం. 4. బీసీ, మైనారిటీలకు ప్రత్యేక సబ్‌ప్లాన్ చట్టాన్ని తెస్తాం. పకడ్బందీగా అమలుచేసి ఆయా సామాజికవర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేస్తాం. 5.మహిళా సాధికారతను సాధించేందుకు స్వయం సహాయక సంఘాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. ఒక్కో సంఘానికి రూ.లక్ష గ్రాంట్ ఇవ్వడంతోపాటు విరివిగా బ్యాంకు రుణాలు అందేలా కృషి చేస్తాం. -
అణచివేతపై తిరుగుబాటు బావుటా!
అంటరానితనానికి, సామాజిక అణచివేతకు, శ్రమను, ఉత్పాదక వృత్తులను నీచంగా చూసే వర్ణ, కుల వ్యవస్థకు, వాటిపై నిలిచిన విలువలకు వ్యతిరేకంగా మొక్కవోని పోరాటం చేసిన అంబేద్కర్... తర తరాలుగా నోరులేని వాళ్లుగానే ఉన్న వారికి ధిక్కార స్వరాన్నిచ్చారు. ఆయన పేరు చెబితే చాలు కోట్లాది పీడిత జనం పిడికిలి బిగిస్తుంది, గడ్డిపోచ కూడా ఖడ్గమై లేస్తుంది . అన్యాయం, అసమానత, అణచివేతల మీద తిరుగుబాటు జెండా ఎగురవేస్తుంది. ఆయనే డాక్టర్ బాబా సాహెబ్ భీమ్రావు అంబేద్కర్. కోట్లాది దళిత, బహుజనుల కంటి కాంతి, ఆలోచనలోని విద్యుత్తు. అంటరానితనానికి, సామాజిక అణచివేతకు, శ్రమను, ఉత్పాదక వృత్తులను నీచంగా చూసే వర్ణ, కుల వ్యవస్థకు, వాటి విలువలకు వ్యతిరేకంగా మొక్కవోని పోరా టం చేసిన ఆయన... తర తరాలుగా నోరులేని వాళ్లుగానే ఉన్న వారికి ధిక్కార స్వరాన్నిచ్చారు. మహాత్మా జ్యోతిబాఫూలేను స్ఫూర్తిగా తీసుకొని ఆయన గొప్ప సామాజిక విప్లవం సాగించారు. కుల వ్యవస్థ కాల కూట విషమైన అంటరానితనాన్ని ప్రశ్నించిన ఆయన స్వాతంత్య్రోద్యమ నేతలు గాంధీ, నెహ్రూలకు భిన్నమైన బాటను చేపట్టారు. భారతీయ సమాజాన్ని అమానుషం చేస్తున్న కుల వ్యవస్థను రూపమాపవలసిన తక్షణ అవసరాన్ని గుర్తు చేశారు. లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలలో దీన్ని కీలక చర్చనీయాంశం చేశారు. గాంధీజీకి అప్రియమైనప్పటికీ షెడ్యూల్డ్ కులాలకు బ్రిటీష్ ప్రభుత్వం నుంచి కొన్ని రాయితీలను సాధించారు. అంబేద్కర్ పుట్టింది ‘అంటరాని’ మహర్ కులంలో. అయినా ప్రపంచలోని అత్యంత విద్యావంతులలో, ప్రతి భావంతులలో ఒకనిగా నిలిచారు. అంతర్జాతీయంగా పేరెన్నికగన్న విద్యాసంస్థలలో న్యాయ, తత్వ, ఆర్థిక శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేశారు. అమెరికాలోని కొలం బియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. బహు గ్ర ంథ కర్త అయిన ఆయన రచించిన ‘కుల నిర్మూలన’ అత్యంత శక్తివంతమైన రచన. ఆయన కలాన్ని కత్తిని చేసి అంటరానితనం, కుల వ్యవస్థల మూ లాలను ఛేదించి, వాటిలోని దుర్మార్గాన్ని ఎండగట్టారు. తొలి స్వతంత్ర భారత ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి పదవిని చేపట్టారు. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కమిటీ అధ్యక్షునిగా అనితర ప్రతిభతో ఆ చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించారు. అనేక క్లిష్ట సమస్యలకు, మీమాంసలకు విశాల మానవతావాద, సమ్మిళిత, ప్రజాస్వామిక దృష్టితో అంబేద్కర్ సమాధానాలు, వివరణలు సుప్రసిద్ధమైనవి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పరమాశయాలుగా ప్రాథమిక హక్కులతో కూడిన రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆదేశిక సూత్రాలతో ప్రభుత్వాల నైతిక బాధ్యతలను నిర్వచించి, సమున్నత సమాజ నిర్మాణం దిశను నిర్దేశించారు. మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కులలో చేర్చి మన దేశ లౌకితత్వం పునాదులను రాజ్యాంగబద్ధం చేశారు. బలమైన కేంద్రం, స్వతంత్ర రాష్ట్రాలు కలిసిన సమాఖ్య వ్యవస్థను నిర్వచించారు. దళితులు, ఆదివాసీలు ఇతర వెనుకబడిన తరగతులు, మత మైనారిటీలు, మహిళల తరపున దృఢంగా నిలబడ్డారు. వారిపట్ల సానుకూల వివక్షను, ధర్మపక్షపాతాన్ని చూపే అధికరణలను రాజ్యాం గంలో చేర్చేలా చేసిన ఘనత అంబేద్కర్‌దే. ఆర్టికల్ 17, ఆర్టికల్ 30, ఆర్టికల్ 46 ఆయన పీడిత జన పక్షపాతానికి నిదర్శనాలు. స్త్రీలను బానిసత్వం నుంచి విముక్తం చేయకుండా సమసమాజ నిర్మాణం సాధ్యం కాదని ఆయన భావించారు. అంబేద్కర్ రాజ్యాంగంలో చేర్చిన పలు ప్రత్యేక అధికరణల మూలంగానే పార్లమెంటు పలు విప్లవాత్మక, ప్రజాస్వామిక చట్టాలను చేయగలిగింది. న్యాయశాఖ మంత్రిగా ఆయన హిందువులలో బహు భార్యత్వాన్ని నిషేధించి, మహిళలకు ఆస్తి హక్కు, విడాకుల హక్కు తదితర స్వేచ్ఛలను కల్పించడం కోసం హిందూ స్మృతి బిల్లును రూపొందించారు. దానిని అడ్డుకున్నందుకు న్యాయశాఖ మంత్రి పదవి నుంచి వైదొలిగారు. పునాదులలో సామాజిక ప్రజాస్వామ్యం నెలకొంటే గాని రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడ సాగించజాలదు అని అంబేద్కర్ స్పష్టపరిచారు. అందుకే అంబేద్కర్ బౌద్ధమత పునరుద్ధరణకు అవిరళ కృషి చేసినవాడు. ఆయనను ఆదర్శంగా చేసుకునే కాంగ్రెస్ ప్రభుత్వాలు నాటి నుంచి నేటి వరకు సామాజిక న్యాయ సాధనకు అగ్రతర ప్రాధాన్యమిచ్చి కృషి చేస్తున్నాయి. ఆయన మహోన్నత, మానవీయ ఆశయాలను ఆచరణలో పెట్టడానికి నడుం బిగించడమే ఆయనకు మనం ఇవ్వగల సరైన నివాళి. ( వ్యాసకర్త చైర్మన్, ఏఐసీసీ, షెడ్యూల్డ్ కులాల శాఖ) రేపు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి కొప్పుల రాజు -
మైనారిటీ అలర్ట్!
* 17 స్థానాల్లో 21 మంది కాంగ్రెస్ ముస్లిం తిరుగుబాటు అభ్యర్థులు * ఆందోళనలో హైకమాండ్ * నామినేషన్ల ఉపసంహరణకు జైరాం, రాజుల యత్నాలు * మతపెద్దలతో సమావేశమైన పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ * మైనార్టీ నేతలకు నామినేటెడ్ పదవుల ఎర.. హామీల జల్లు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీకి మైనారిటీ ఓట్ల భయం పట్టుకుంది. ఎన్నికల్లో ముస్లింలకు కాంగ్రెస్ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని పేర్కొంటూ 17 నియోజకవర్గాల్లో 21 మంది మైనారిటీ నాయకులు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. ఆ ప్రభావం తమ పార్టీపై తీవ్రంగానే ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ముస్లింల ఓట్లు ప్రభావం చూపే నల్లగొండ, మిర్యాలగూడ, జనగాం, ఖమ్మం, రాజేంద్రనగర్, మహేశ్వరం, మలక్‌పేట, పటాన్చెరు, ఆదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ వంటి నియోజకవర్గాల్లో మైనారిటీలు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ వేయడాన్ని పార్టీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు గురువారం ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో సమావేశమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రెబెల్ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేయాలని ఆదేశించారు. అంతేకాక వారిద్దరు స్వయంగా రెబెల్ అభ్యర్థులతో మాట్లాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పర్యటనకు వెళ్లిన జైరాం, రాజులు జిల్లాలో తిరుగుబాటు అభ్యర్థులను పిలిపించుకుని బుజ్జగించారు. అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులతోపాటు ఇతరత్రా పదవుల్లో తగిన గుర్తింపు ఇస్తామని గట్టిగా హామీ ఇచ్చారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సైతం తిరుగుబాటు అభ్యర్థులకు ఫోన్ చేసి బుజ్జగిస్తున్నారు. మరోవైపు, హైకమాండ్ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ కో-చైర్మన్ షబ్బీర్‌అలీలు రంగంలోకి దిగి మైనారిటీ నేతలను సముదాయిస్తున్నారు. గురువారం నగరంలోని మదీనా ఎడ్యుకేషన్ సెంటర్లో జమైతే ఉలే-మా మత పెద్దలతో సమావేశమయ్యారు. కొన్ని అనివార్య కారణాలవల్ల మైనారిటీలకు టికెట్ల విషయంలో న్యాయం చేయలేకపోయామని పేర్కొంటూ రాబోయే కాలంలో తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వాలని కోరారు. మత పెద్దలు ప్రతిపాదించిన అంశాలన్నింటినీ కచ్చితంగా అమలు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశానంతరం పొన్నాల మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని జమైతే ఉలే-మా పెద్దలను కోరామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే ముస్లింలకు అనేక కార్యక్రమాలు చేపడతామని హామీలు గుప్పించారు. వాటిలో ముఖ్యమైనవి.. * తెలంగాణలో 12.5 శాతం ముస్లిం జనాభా ఉన్నందున రిజర్వేషన్లను పెంచేందుకు ఓ కమిటీ నియామకం. * ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున కొత్త ప్రభుత్వాన్ని అందులో ఇంప్లీడ్ చేయడం. * జనాభా ప్రాతిపదికన ముస్లింలకు నామినేటెడ్ పదవులు. * అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే మైనారిటీలకు సబ్‌ప్లాన్ అమలు. * కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న మైనారిటీలను రోస్టర్, ఖాళీల ఆధారంగా క్రమబద్దీకరణ. * గ్రామప్రాంతాల్లో మైనారిటీలకు ఇళ్ల స్థలాలు, పట్టణాల్లో అర్హులైన మైనారిటీలందరికీ ఇళ్ల నిర్మాణం. * మైనారిటీల సమస్యలపై ప్రతి 3 నెలలకోసారి సమీక్ష. ఎన్నికల సమయంలో భేటీయా?: సిరాజుద్దీన్ ఇదిలా ఉండగా, ఎన్నికల సమయంలో ముస్లిం మత పెద్దలతో కాంగ్రెస్ నేతలు సమావేశం కావడంపట్ల పీసీసీ మైనారిటీ విభాగం చైర్మన్ సిరాజుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామన్నారు. స్థానిక, మున్సిపల్సహా సాధారణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో ముస్లింలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. పార్టీ పెద్దలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారిని కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. పార్టీ పదవుల్లో, మార్కెట్ కమిటీల్లో, జిల్లా పరిషత్ పదవుల్లో ముస్లింలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మెదక్ బరినుంచి తప్పుకున్న శశిధర్‌రెడ్డి మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పి.శశిధర్‌రెడ్డి పోటీనుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. గురువారం టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శశిధర్‌రెడ్డితో భేటీ అయి పోటీనుంచి తప్పుకోవాలని నచ్చజెప్పారు. టీఆర్ఎస్తో విభేదించి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతికి అనివార్య పరిస్థితుల్లో మెదక్ అసెంబ్లీ సీటు ఇవ్వాల్సి వచ్చిందని పొన్నాల చెప్పారు. పార్టీ అధికారంలోకొస్తే సముచిత స్థానం కల్పిస్తామని, వెంటనే నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశానంతరం పొన్నాలతో కలిసి శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో తమ కుటుంబానికి 44 ఏళ్ల అనుబంధం ఉన్నప్పటికీ టికెట్ రాలేదనే బాధతోనే నామినేషన్ వేశానన్నారు. దిగ్విజయ్‌సింగ్‌తోపాటు పార్టీ పెద్దలు కూడా తనకు ఫోన్ చేసి సముచిత న్యాయం చేస్తానని హామీ ఇచ్చినందున నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు. -
టీఆర్ఎస్ కుటుంబ పార్టీ
* కేంద్ర మంత్రి జైరాం రమేష్ * తెలంగాణలో 4వేల మెగావాట్ల విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేస్తాం * టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందే తెలంగాణ ఇస్తామని చెప్పాం సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ పార్టీగా మారిందని, ఆయన తన నలుగురు కుటుంబ సభ్యులకు టికెట్లు ఇచ్చుకున్నారని కేంద్రమంత్రి జైరాం రమేష్ విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ముందే కాంగ్రెస్, తెలంగాణ ఏర్పాటు దిశగా కార్యాచరణ ప్రారంభించిందని గుర్తుచేశారు. గురువారం నిర్మల్‌లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన అంతకుముందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం టీఆర్ఎస్ పార్లమెంట్లో ఏనాడూ ఉద్యమించలేదన్నారు. కాంగ్రెస్ ఎంపీలే శాంతియుతంగా ఉద్యమించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ పైనా విమర్శలు చేశారు. తెలంగాణ బిల్లుకు లోక్‌సభలో మద్దతిచ్చిన బీజేపీ, రాజ్యసభలో ఆ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. సీమాంధ్ర నాయకుల కనుసన్నల్లోనే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక జరిగిందనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ సీమాంధ్ర, తెలంగాణలు ఇండియా పాకిస్థాన్‌లు కావని వ్యాఖ్యానించారు. 20 జిల్లాలు చేస్తాం.. ఈ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇక్కడ ప్రస్తుతమున్న పది జిల్లాలను 20కి పెంచుతామని అన్నారు. తెలంగాణలో 4వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడి మారుమూల ప్రాంతాలను కూడా హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేస్తామన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించిన వారికి పదేళ్ల పాటు పన్ను మినహాయింపులు ఇస్తామని చెప్పారు. సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డును ఏర్పాటు చేసి, వివాదాలు తలెత్తకుండా చూస్తామన్నారు. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, నిర్మాణానికి 90 శాతం నిధులను కేంద్రం నుంచి మంజూరు చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏయిర్‌పోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పారు. అసంతృప్తి సర్దుకుంటుంది టికెట్ల కేటాయింపులో భాగంగా పార్టీలో తలెత్తిన అసంతృప్తి సర్దుకుంటుందని, తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగిన నాయకులు తమ నామినేషన్ల ఉపసంహరించుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అసంతృప్తులతో మాట్లాడుతామని అన్నారు. విలేకరుల సమావేశంలో ఏఐసీసీ ఎస్సీసెల్ విభాగం అధ్యక్షుడు కొప్పుల రాజు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి జి.వివేక్, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి నరేష్ జాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రేమ్‌సాగర్‌రావు, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆత్రం సక్కు, భార్గవ్‌దేశ్‌పాండే, అనిల్ జాదవ్, విఠల్‌రెడ్డి, గడ్డం అరవింద్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రావు, పీసీసీ మాజీ చీఫ్ నర్సారెడ్డి పాల్గొన్నారు. -
అమలాపురం నుంచి కొప్పుల రాజు!
సాక్షి, హైదరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారి, ఏఐసీసీ ఎస్సీసెల్ ఛైర్మన్ కొప్పుల రాజు అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారా? ఇప్పుడు ఇదే అంశంపై ప్రచారం ఉంది. రాజును బరిలోకి దింపే అంశంపై పీసీసీ నాయకులతో ఏఐసీసీ ముఖ్యనేతలు ఇటీవల చర్చించినట్లు సమాచారం. అమలాపురం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన హర్షకుమార్ రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం నోటీసు ఇచ్చినందుకు బహిష్కృతులైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటుచేసిన జైసమైక్యాంధ్ర పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ కోటరీలో ముఖ్యపాత్ర పోషిస్తున్న కొప్పుల రాజు పేరును పీసీసీకి చెందిన కొందరు నేతలు అధిష్టానం వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. రాజు రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిగా కీలకమైన అనేక విభాగాల్లో సుదీర్ఘకాలం పనిచేసి మంచిపేరు సంపాదించి ఉన్నారని, కోస్తాంధ్ర జిల్లాలకు చెందిన వ్యక్తి అయినందున అమలాపురం నుంచి ఎంపీగా గట్టి పోటీ ఇవ్వగలుగుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. రాజు పోటీకి సుముఖత చూపని పక్షంలో ప్రత్యామ్నాయంగా మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావు పేరును పరిశీలనలోకి తీసుకోవచ్చని పార్టీవర్గాలు చెబుతున్నాయి. -
ఆయనొక సామాజిక విప్లవ యోధుడు
కొప్పుల రాజు ఐదు దశాబ్దాల పార్లమెంటరీ చరిత్ర గలిగిన విశిష్ట నేత బాబూ జగ్జీవన్‌రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం యావత్ జీవితాన్ని అంకితం చేశారు. ఆయన స్మృతి అజరామరం. ఆయన కృషిని కొనసాగించడానికి కంకణబద్ధులం కావడమే ఆయనకు అర్పించగల నివాళి. దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని సమరం సాగించిన సామాజిక విప్లవ యోధుడు జగ్జీవన్‌రామ్. ప్రేమగా అంతా ఆయనను ‘బాబూజీ’ అనే వారు. పీడితులు, దళితులు, బహుజనులు తదితర అణగారిన వర్గాల ఆత్మబంధువుగా, పరిపాలనా దక్షునిగా దేశ చరిత్రలో ఆయనది విశిష్ట స్థానం. బీహార్ రాష్ట్రం షహబాద్ (నేటి భోజ్‌పూర్) జిల్లాలోని చాంద్వా అనే చిన్న గ్రామంలో 1908, ఏప్రిల్ 5న ఆయన ఒక దళిత కుటుంబంలో జన్మించారు. తండ్రి చిన్ననాటనే మరణించి కుటుంబం కష్టాలపాలైనా చదువులో ఆయన అసాధారణ ప్రతిభను కన బరచారు. భోజ్‌పూరి, హిందీ, ఆంగ్లం, బెంగాలీ, సంస్కృత భాషలలో విస్తృతంగా పుస్తక పఠనం సాగించారు. 1920లో అర్రా పట్టణ మాధ్యమిక పాఠశాలలో చేరి ఎస్సీ స్కాలర్షిప్ను నిరాకరిం చారు. జనరల్ కేటగిరి విద్యార్థులకు దీటైన ప్రతిభను కనబరచి మెరిట్ స్కాలర్షిప్ను సాధించారు. పాఠశాలలోని వెలికి, వివక్షకు వ్యతిరేకంగా పోరాడి అందరికీ ఒకే మంచి నీటి కుండను ఏర్పాటు చేయించారు. జగ్జీవన్లోని తెలివి తేటలను, జ్ఞాన తృష్ణను గమనించిన పండిట్ మదన్మోహన్ మాల వీయ ప్రోత్సాహం కారణంగా ఆయనకు కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకునే అవకాశం కలిగింది. ఆ తదుపరి కలకత్తా విశ్వవిద్యాల యం నుంచి బి.ఎస్.సి.లో డిస్టింక్షన్ సాధిం చారు. అక్కడ చదువుతుండగానే 35 వేల మంది కార్మికులతో బహిరంగ సభను నిర్వహించి బోస్‌బాబు వంటి వారి దృష్టిని ఆకర్షించారు. మార్క్స్ రచనలను చదివి వర్గ రహిత, కుల రహిత సమాజంపై సమగ్ర అవగాహనను ఏర్పరచుకున్నారు. 1934 బీహార్ భూకంప బాధితుల సేవలో నిర్విరామంగా శ్రమించారు. అప్పుడే గాంధీజీని చూసి ప్రభావితులయ్యారు. 1935లో ఇంద్రాణీదేవిని వివాహం చేసుకున్న జగ్జీవన్ 1936లో బీహార్ శాసన మండలిలో నామినేటెడ్ సభ్యులయ్యారు. 1937లో ఆయన స్థాపించిన డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ బీహార్ శాసనసభలోని మొత్తం 14 రిజర్వుడ్ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. బ్రిటిష్ పాలకులు ఎర చూపిన డబ్బు, మంత్రి పదవులను తిరస్కరించారు. ‘‘జగ్జీవన్‌రామ్ పుటం పెట్టిన బంగారాన్ని తలపిస్తున్నారు’’ అని గాంధీజీ ప్రశంసించా రు. బ్రిటిష్ పాలకులు భారత్‌ను రెండవ ప్రపంచ యుద్ధంలోకి లాగినందుకు నిరసనగా, మొత్తం మంత్రివర్గంతో పాటూ ఆయన రాజీనామా చేశారు. 1940 నాటి శాసనోల్లంఘన ఉద్యమంలోనూ, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలోనూ జగ్జీవన్ కారాగారవాసం అనుభవించారు. 1946లో ఈస్ట్ సెంట్రల్ షహబాద్ (రూరల్) నుంచి ఏకగ్రీవంగా గెలిచి కేంద్ర కార్మిక మంత్రి అయ్యారు. 1952 తొలి సార్వత్రిక ఎన్నికల్లో సాసారాం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1986లో కన్ను మూసేవరకు ఆయన అదే నియోజక వర్గం నుంచి అవిచ్ఛిన్నంగా పార్లమెంటు సభ్యులుగా కొనసాగారు. 1952-56 మధ్య కమ్యూనికేషన్ల మంత్రిగానూ, ఆ తర్వాత 1957-62 మధ్య రైల్వే మంత్రిగానూ పనిచేశారు. 1962-70 మధ్య రవాణా, కమ్యూనికేషన్ మంత్రిగా, కార్మిక, పునరావాస మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా సేవలందించారు. వ్యవసాయ మంత్రిగా సస్య విప్లవ సారథి అయ్యారు. 1969లో కాంగ్రెస్ చీలిపోయినప్పుడు ఆయన ఇందిరాగాంధీకి దన్నుగా నిలిచారు. 1971లో రక్షణ మంత్రిగా బంగ్లాదేశ్ విమోచనలో కీలక పాత్రను పోషించారు. అద్వితీయ దీక్షాదక్షతలతో ప్రతి శాఖపైనా ఆయన తనదైన సొంత ముద్రను వేయగలిగారు. 1975లో ఇందిర విధించిన అత్యవసరసర పరిస్థితికి నిరసనగా 1977లో జగ్జీవన్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీని ఏర్పాటు చేశారు. తదుపరి దా న్ని జనతా పార్టీలో విలీనం చేసి రక్షణశాఖ ను చేపట్టారు. 1979లో ఉప ప్రధాని పదవిని స్వీకరించారు. జనతా ప్రభుత్వ పతనం తదుపరి ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఐదు దశాబ్దాల పార్లమెంటరీ చరిత్ర గలిగిన విశిష్ట నేతగా చిరస్మరణీయులైన జగ్జీవన్ 1986 జూలై 6న 78వ ఏట తుది శ్వాస విడిచారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన బాబూజీ స్మృతి అజరామరం, ఆయన కృషిని కొనసాగించడానికి కంకణబద్ధులం కావడమే ఆయనకు అర్పించగల నివాళి. (వ్యాసకర్త ఏఐసీసీ,ఎస్సీ విభాగం చైర్మన్ ఏప్రిల్ 5 బాబూ జగ్జీవన్‌రామ్,106వ జయంతి -
రాజ్యసభ తెరపైకి రత్నాబాయి పేరు
న్యూఢిల్లీ : రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ సభ్యులుగా కేవీపీ రామచంద్రరావు, కొప్పుల రాజు, ఎంఏ ఖాన్ల ఎంపిక ఖరారు అయినా చివరి నిమిషంలో సస్పెన్స్ కొనసాగుతుంది. కొప్పుల రాజు అభ్యర్థిత్వంపై ఏఐసీసీ వర్గాలు విముఖత చూపటంతో మళ్లీ రత్నాబాయి పేరు తెరమీదకు వచ్చింది. కేవీపీ, ఖాన్ల పేర్లు దాదాపు ఖరారు అయినా...మూడో అభ్యర్థిత్వంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో రంపచోడవరం ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యురాలిగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న టి. రత్నాబాయి.. కాంగ్రెస్ రాజకీయాల్లో చాలా సీనియర్. దానికి తోడు ఎస్టీ కూడా కావడంతో ఆ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. -
కేవీపీ, ఎంఏఖాన్, కొప్పులకు చోటు!
-
కేవీపీ, ఎంఏఖాన్, కొప్పులకు చోటు!
న్యూఢిల్లీ : రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపిక కావాల్సిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు ఖరారు చేసినట్లు సమాచారం. ఈసారి మూడు సీట్లకే కాంగ్రెస్ పోటీ చేయాలని నిర్ణయించింది. రాజ్యసభ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థులుగా కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్, కొప్పుల రాజులను ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపినకు ఈరోజు మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్న నేతలను కాంగ్రెస్ బుజ్జగించే పనిలో పడింది. కాగా ఫిబ్రవరి 7న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇక రాజ్యసభ టికెట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ కాంగ్రెస్‌కు తలనొప్పి వ్యవహారంగా మారింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు పార్టీ ఎంపిక చేసే అభ్యర్థులను ఓడిస్తామని చెబుతుండటం, సమైక్యవాదాన్ని విన్పిస్తున్న నేతలను స్వతంత్రులుగా బరిలో దింపేందుకు ప్రయత్నిస్తుండటంతో అధిష్టానం పెద్దలకు అభ్యర్థుల ఎంపిక చిక్కుముడిగా మారింది. ఇలాంటప్పుడు కొత్తవారిని ఎంపిక చేయడం లేనిపోని ఇబ్బందులకు దారి తీయొచ్చన్న ఆందోళన కూడా నేతల్లో ఉన్నట్టు తెలుస్తోంది. సిట్టింగులనే మళ్లీ బరిలో దించితేనే మేలన్న ఆలోచన అధిష్టానం ఉంది. -
కొప్పుల రాజుపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫైర్
విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజుపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానాన్ని కొప్పుల రాజు తప్పుదారి పట్టించాడని వారు ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్న కొప్పుల రాజును ఓడించేందుకు ఇప్పటికే సిద్ధమైనట్లు తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చే కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనేతలను రాజ్యసభ బరిలోకి దింపేందుకు తామ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు వివరించారు. దీని ద్వారా విభజనపై దూసుకు వెళ్తున్న కాంగ్రెస్‌కు షాక్ ఇస్తామన్నారు. రాజ్యసభ సభ్యులుగా హై కమాండ్ ప్రతిపాదించిన అభ్యర్థులు తప్ప ఎవరు పోటీ చేసిన తాము సంపూర్ణ మద్దతిస్తామని స్పష్టం చేశారు. రాజ్యసభకు కొప్పుల రాజును ఎన్నిక చేసేందుకు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దాంతో సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొప్పుల రాజులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. -
దళిత ఎంపిలను రెట్టింపు చేయడమే లక్ష్యం:ఏఐసీసీ ఎస్సి సెల్
హైదరాబాద్: దళిత ఎంపీల సంఖ్యను రెట్టింపు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం అని ఏఐసీసీ ఎస్సి సెల్ చైర్మన్ కొప్పుల రాజు చెప్పారు. ప్రధాన మేనిఫెస్టోకి అనుబంధంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం సబ్ మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు. ఆర్టీఐ, లోక్‌పాల్ బిల్లులు మాదిరిగా అవినీతిని నిర్మూలించేందుకు మరో మూడు బిల్లులను ఫిబ్రవరి పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సేవలు, ఫిర్యాదుల పరిష్కారం, న్యాయ జవాబుదారీతనం అంశాలపై కూడా బిల్లులను రూపొందిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్‌లో దళితులకు ఇక నుంచి అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఎస్సీ కమిటీలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతోన్న ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ను జాతీయ స్థాయిలోనూ తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. దళితులను నమ్మించలేకపోవడం వల్లే యూపీలో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. అప్పడు బీఎస్పీని నమ్మిన ప్రజలు ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించారని, అందుకే బీఎస్పీ ఓటు బ్యాంకు తగ్గిందని చెప్పారు. మంద కృష్ణ మాదిగ రాష్ట్రంలో కొత్తగా పెట్టిన పార్టీతో కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం ఉండదన్నారు.