రాహుల్‌ రాజకీయ కార్యదర్శిగా కొప్పుల? | koppula raju to appoint rahul gandhi political secretary | Sakshi
Sakshi News home page

రాహుల్‌ రాజకీయ కార్యదర్శిగా కొప్పుల?

Published Sun, Sep 27 2015 1:02 PM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

రాహుల్‌ రాజకీయ కార్యదర్శిగా కొప్పుల?

రాహుల్‌ రాజకీయ కార్యదర్శిగా కొప్పుల?

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా ఉన్న కొప్పుల రాజు త్వరలో రాహుల్ గాంధీ రాజకీయ కార్యదర్శిగా నియమితులవబోతున్నారని సమాచారం. బిహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏఐసీసీ కార్యవర్గాన్ని బలోపేతం చేసే దిశగా కసరత్తు చేస్తున్న పార్టీ.. కొప్పుల రాజుకు ఈ పదవిని కట్టబెట్టనున్నట్టు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

గతంలో పేద, వెనకబడిన వర్గాల సంక్షేమ పథకాల రచనలో కీలక పాత్ర పోషించిన ఈయన రాహుల్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నారు. రాహుల్ ముఖ్య ప్రసంగాల కూర్పు నుంచి పార్టీ విధానాల రూపకల్పన వరకూ కొప్పుల క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న నేతగా స్వల్ప కాలంలోనే పేరు తెచ్చుకున్నారు. పార్టీలో ఎస్సీల పాత్ర పెరగడానికి అనుగుణంగా ఆయన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement