కలిసి ఉంటేనే తెలుగు జాతి అభివృద్ధి సాధ్యం: కేవీపీ
న్యూఢిల్లీ : బాధ్యత గల పౌరుడిగా, తెలుగు జాతి ప్రతినిధిగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ఆయన మంగళవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కేవీపీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం కలిసి ఉంటేనే తెలుగు జాతి అభివృద్ధి సాధ్యమన్నారు.
రాష్ట్ర విభజన నిర్ణయం సరికాదని కేవీపీ వ్యాఖ్యానించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటే వచ్చే లాభాలను తెలుగు సోదరులకు తెలియ చేయాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. మరోవైపు కేంద్ర మంత్రి జేడీ శీలం కూడా దిగ్విజయ్ను కలిసినవారిలో ఉన్నారు.