ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ను కలిసి ఉపయోగం ఏమీ లేదని, అందువల్ల ఆయన్ను కలవాలనుకోవడం లేదని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఇప్పటికే తాము చాలాసార్లు కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిశామని ఆయన తెలిపారు. గురువారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆంటోనీ కమిటీని కూడా కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరినా ఎలాంటి ఫలితం లేదని, అందువల్ల ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ను కలవాలని అనుకోవట్లేదని శైలజానాథ్ చెప్పారు.
దిగ్విజయ్ సింగ్ను కలవాలనుకోవట్లేదు: శైలజానాథ్
Published Thu, Dec 12 2013 6:00 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement