న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు శుక్రవారం సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరు సమావేశం అయ్యారు. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం కేవీపీ మాట్లాడుతూ సీమాంధ్రుల అభిప్రాయాన్ని దిగ్విజయ్ సింగ్కు తెలియచేసినట్లు తెలిపారు. కాగా ఈ భేటీకి కేంద్రమంత్రి జేడీ శీలం హాజరై అనంతరం వెళ్లిపోయారు. కేవీపీ నిన్న కూడా దిగ్విజయ్తో సమావేశం అయ్యారు.
మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ. డిప్యూటీ స్పీకర్ దామోదర రాజనర్సింహ ఈరోజు ఉదయం హస్తిన చేరుకున్నారు. వారికి ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణ ప్రక్రియకు సహకరించాలని వారిని ప్రధానమంత్రి కోరనున్నారు. ఇక కాంగ్రెస్ సమన్వయ కమిటీ రేపు ఉదయం 10.30 గంటలకు ప్రధానమంత్రిని కలవనుంది.
దిగ్విజయ్తో సుదీర్ఘ మంతనాలు జరిపిన కేవీపీ
Published Fri, Nov 8 2013 2:58 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement