KVP Rama Chandra Rao
-
జీఎస్టీతోనే రైల్వే పనుల్లో జాప్యం
కేంద్ర రైల్వేమంత్రికి ఎంపీ కేవీపీ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ వల్ల రైల్వే పనులకు చెందిన కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిందిగా కేంద్ర రైల్వేమంత్రి పీయూష్ గోయల్‌ను రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఇటీవలే పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా దక్షిణ మధ్య రైల్వేలోని వివిధ డివిజన్లలో ప్రయాణికుల భద్రతకు సంబంధించిన (బ్రిడ్జిల మరమ్మతులు, ట్రాక్‌ల నిర్వహణ) రూ.585 కోట్ల విలువైన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. -
మీ ‘వైస్రాయ్’ నాటకాలు గుర్తుకొస్తున్నాయి
సీఎం చంద్రబాబుకు ఎంపీ కేవీపీ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: కమీషన్లు దండుకునేందుకే కేంద్రం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి.. పోలవరం పనుల బాధ్యత తీసుకున్నారంటూ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రారావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే కేంద్రం షరతులపైనా నోరు మెదపడం లేదని మండిపడ్డారు. కాఫర్ డ్యాంను ప్రధాన డ్యాంగా చూపుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు వైస్రాయ్ నాటకాలు గుర్తుకొస్తున్నాయని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును తాను అడ్డుకుంటున్నట్టు నిరూపిస్తే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. వైదొలుగుతానని సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు గురించి సీఎం చంద్రబాబుకు కేవీపీ బహిరంగ లేఖ రాశారు. దీనిని ఆదివారం ఆయన మీడియాకు విడుదల చేశారు. ‘నేను ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నానని నిరూపిస్తే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. వైదొలుగుతా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్ర జలవనరుల శాఖ అనుమతించిన డిజైన్ల స్థాయికి పూర్తిగా ప్రాజెక్టును నిర్మించి.. గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ కాలువలకు 2019కల్లా నీళ్లు ఇవ్వగలిగితే.. నా శేష జీవితాన్ని మీకు భారతరత్న ఇప్పించేందుకు కృషి చేస్తాను..’ అని కేవీపీ పేర్కొన్నారు. -
గంజాయికి, డ్రగ్స్‌కు రాజధానిగా విశాఖ!
న్యూఢిల్లీ: చదువుల కేంద్రమైన విశాఖ నగరాన్ని మాదక ద్రవ్యాల బారి నుంచి కాపాడాలని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత కేవీపీ రాంచంద్రరావు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక లేఖ రాశారు. ఈ అంశాన్ని ఇటీవల రాజ్యసభలో లేవనెత్తానని, అయితే కేంద్రం నుంచి తగిన స్పందన రాలేదన్నారు. విశాఖపట్నం గంజాయికి, డ్రగ్స్‌కు రాజధానిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో గంజాయి తదితర మాదకద్రవ్యాలకు సంబంధించిన పంటలు విస్తృతంగా సాగవుతున్నాయని, దీనిపై కేంద్ర హోం శాఖ దృష్టి పెట్టాలని కోరారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అరకు, పాడేరు, నర్సీపట్నం, చింతపల్లిలో గంజాయి విస్తారంగా సాగవుతోందని వివరించారు. అనకాపల్లి నుంచి రైళ్ల ద్వారా వీటిని స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పారు. ధనికులు, నిరుపేదలు అన్న తేడా లేకుండా అనేకమంది వీటికి బలవుతున్నారని పేర్కొన్నారు. గంజాయి సాగును ఏపీ సర్కారు అరికట్టలేకపోయిందన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ విభాగంలో తగిన సిబ్బంది లేరని, ఉన్న వారికి అవసరమైన ఆయుధాలు, రవాణా సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. దీంతో వారు స్మగ్లర్లను ఎదుర్కోలేకపోతున్నారని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కూడా ఈ తరహా మాదక ద్రవ్యాల సాగు నడుస్తోందని, దీన్ని అరికట్టేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. -
నోట్ల కష్టాలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు
న్యూఢిల్లీ : ప్రజల కష్టార్జితాన్ని అవసరాలకు సకాలంలో వినియోగించనివ్వకుండా నోట్ల రద్దుతో రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడిచారంటూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్చార్సీ)లో సోమవారం ఫిర్యాదు చేశారు. నోట్ల రద్దుతో సమస్యలు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల కష్టాలను తీర్చేందుకు వీలుగా ఆర్థిక శాఖకు తగు మార్గదర్శకాలు జారీ చేయాలని కేవీపీ కోరారు. -
హోదాపై ప్రజా బ్యాలెట్: రఘువీరా
సాక్షి, హైదరాబాద్: ఐదు కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు మంగళం పాడి.. ఓ బోగస్ ప్యాకేజీని సీఎం చంద్రబాబు స్వాగతించారంటూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు, శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య తదితరులతో కలసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని అంశాల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసాన్ని బయట పెట్టేందుకు ప్రజా బ్యాలెట్‌ను నిర్వహించన్నుట్లు చెప్పారు. -
‘హోదా’ ఇచ్చే చాన్సే లేదు: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటుకు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించకున్నా విభజన లో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని, ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సరిదిద్దుతామన్నారు. తమ చిత్తశుద్ధిని శంకిం చాల్సిన పనిలేదని, రాష్ట్రాభివృద్ధికోసం ఎన్ని విమర్శలైనా భరిస్తానన్నారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ‘హోదా’వల్ల కొన్ని అదనపు ప్రయోజనాలొచ్చే అవకాశమున్నా అదే సర్వస్వం కాదన్నారు. హోదాపై తనను విమర్శిస్తున్న వారిని రాష్ట్ర విభజనప్పుడు ఏమి చేశారంటూ ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ఒక్కరే సమైక్యాంధ్రకోసం తుదికంటా కట్టుబడి ఉన్నారన్నారు. కేంద్రం నిరంతర చేయూత లేకుండా రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వలేకపోతున్నందున రాష్ట్ర అభివృద్ధికి విదేశీ రుణం తీసుకొచ్చి ఇస్తామని, ఆ అప్పును కేంద్రం తీరుస్తుందన్నారు. కేంద్రం మామూలుగా రాష్ట్రాలకిచ్చే నిధులకిది అదనమన్నారు. ‘పోలవరం’ను కేంద్రమే నిర్మిస్తుందన్నారు. 14వ ఆర్థికసంఘం తేల్చిన రూ.22వేల కోట్లకుపైగా లోటును కేంద్రం భర్తీ చేస్తుందన్నారు. ప్రత్యేక దృష్టి, ప్రత్యేకసాయం, ప్రత్యేకశ్రద్ధతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామన్నారు. రాష్ట్రానికివ్వాల్సిన వాటిల్లో మిగి లింది గిరిజన వర్సిటీయేనన్నారు. మొత్తంగా రూ.2.25 లక్షల కోట్లు రాష్ట్రానికొస్తాయన్నారు. అమరావతిని ఆకర్షణీయ నగరాల జాబితాలో చేరుస్తామన్నారు. డబ్బు ఎప్పుడూ పాచిపోలేదు.. ఈ దేశంలో డబ్బు ఎప్పుడూ పాచిపోలేదని సినీనటుడు పవన్కల్యాణ్నుద్దేశించి వెంకయ్యనాయుడు అన్నారు. తనవి, ప్రధానమంత్రివి దిష్టిబొమ్మలు దహనం చేయడాన్ని ఆక్షేపించారు. -
మీ బిల్లు మరికొంత కాలం సజీవం
కేవీపీ, వెంకయ్యల మధ్య ఆసక్తికర సంభాషణ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంపై డిమాండ్లు ప్రతిధ్వనిస్తున్న నేపథ్యంలో బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలను ప్రతిపాదిస్తూ రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును కేవీపీ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై గత శుక్రవారం చర్చ జరిగింది. ఈ నెల 13న మరోదఫా బిల్లు చర్చకు రానుంది. అయితే వివిధ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నందున పార్లమెంట్ సమావేశాలను ముందుగా ముగించాలనే ప్రతిపాదన వచ్చింది. దీంతో 13వ తేదీ వరకూ సమావేశాలు కొనసాగుతాయా అని వెంకయ్యనాయుడు వద్ద కేవీపీ వాకబు చేశారు. దీనికి స్పందించిన వెంకయ్య.. సమావేశాల వాయిదాపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మీ బిల్లు మరికొంత కాలం సజీవంగా ఉండే అవకాశాలు ఉన్నాయని జవాబిచ్చారు. ‘ ఏపీకి ప్రత్యేక హోదాపై అధికారంలో ఉన్నప్పుడు కేవీపీకి విల్ లేదని, ఇప్పుడు ప్రతిపక్షంలో బిల్ ప్రవేశ పెట్టారని’ వెంకయ్యనాయుడు తన సహజ ధోరణిలో వ్యాఖ్యానించారు. -
‘అమరావతి’పై జోక్యం చేసుకోండి
♦ యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనలు ♦ ఆహారభద్రతకు, నిపుణుల సూచనలకు, రైతుల హక్కులకు వ్యతిరేకం ♦ ప్రధానమంత్రికి లేఖ రాసిన కాంగ్రెస్ ఎంపీ కేవీపీ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో చట్టాల అతిక్రమణ, నిబంధనల ఉల్లంఘనలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని రాజ్యసభ కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ పంపారు. ప్రతిపాదిత రాజధాని పర్యావరణానికి, ఆహారభద్రతకు, కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సులకు, రైతుల హక్కులకు వ్యతిరేకంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం తక్ష ణం 33వేల ఎకరాలు, భవిష్యత్‌లో 20 లక్షల ఎకరాల సాగుపై ప్రభావం చూపనుండడం ఆహారభద్రతకు, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైన చర్యగా పేర్కొన్నారు. అమరావతి ప్రాంతం మొత్తం వరద ప్రభావిత క్షేత్రమని, పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 మేరకు కేంద్ర అడవులు, పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి సరైన అనుమతులు తీసుకోలేదని లేఖలో వివరించారు. ఢిల్లీలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ కేవీపీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ► సీఎంను విమర్శించడానికి మాట్లాడటంలేదు. భవిష్యత్‌లో ఇబ్బందుల్లేకుండా సరైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. ► రాజధాని నిర్మాణం విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీలోని సభ్యులకు అర్హత, నైపుణ్యం, సాధికారికత ఉందనడానికి ఆధారాలు ఉన్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్‌గా ఉన్న నారాయణకు నైపుణ్యాలేమిటి? కమిటీలోని సభ్యులుగా ఉన్న వ్యాపారవేత్తలు రాజధాని నిర్మాణానికి ఎలాంటి సలహాలు ఇవ్వగలరు? వీరికి ఉన్న అర్హతలేమిటి? అవగాహన ఏమిటి? ఏ అథారిటీతో మాట్లాడి సురక్షిత రాజధాని ఇవ్వగలరు.. అనే అనుమానాలు ఉన్నాయి. ► కొండవీటి వాగు వరదతో 13వేల ఎకరాలు ముంపునకు గురయ్యే ప్రాంతంపై జాగ్రత్తలు తీసుకోవాలని సీఆర్డీఏ ఇచ్చిన నివేదికలో ఉంది. ళీ రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందడంలో 15లక్షల ఎకరాల పంటభూములు నిరుపయోగంగా మారుతాయని చెప్పడం జరిగింది. ► ఇంత విస్తీర్ణంలోని రాజధాని ప్రపంచంలో ఎక్కడా లేదు. పెద్ద రాజధాని వస్తుందని గర్వించాలా? లేక ఈ ప్రయత్నాల్లో ఏపీ ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి చివరికి అయోమయపరిస్థితిలో కొట్టుకుపోతారా అనేది అర్థంకాని పరిస్థితి. ► సింగపూర్ కంపెనీ.. పూర్వం ఈస్ట్ఇండియా కంపెనీ తరహాలో చాలా షరతులు విధిస్తోంది. వీటితో అతి చిన్న దేశం సింగపూర్‌కు రాజధాని కాలనీగా మారబోతుందనే భయం వేస్తోంది. ► సీఎం చంద్రబాబు ఊహాలోకం నుంచి బయటకు వచ్చి వాస్తవం తెలుసుకోవడం అవసరం. బాబుకు అల్జీమర్స్ అనే వ్యాధి ఆరంభదశలో ఉన్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. దీనివల్ల ప్రాణాలకు ముప్పు ఉండదు కాని, జ్ఞాపకశక్తిలో తేడా వస్తుంది. దీని వల్ల ఏపీ ప్రజల భవిష్యత్ దెబ్బతినకుండా వైద్యులు చెప్పిన జాగ్రత్తలు పాటించాలి. ► పర్యావరణానికి కనీస ప్రాధాన్యమివ్వడనడానికి బాబు ఉంటున్న ఇల్లే ఉదాహరణ. పర్యావరణ, ప్రజాభద్రతకు భంగంగా ఉన్న క్యాంపు, నివాసాన్ని కూల్చడానికి నోటీసులు ఇచ్చి నా,అందులోనే ఉండడం పర్యావరణ, చట్టాలు అవసరంలేదనే సంకేతాన్ని పంపుతున్నారు. -
సీమాంధ్రకు కేకే,తెలంగాణకు కేవీపీ
రాజ్యసభ సభ్యుల లాటరీలో విడ్డూరం సాక్షి, న్యూఢిల్లీ: లాటరీ ద్వారా రాజ్యసభ సభ్యులను శుక్రవారం ఇరురాష్ట్రాలకు కేటాయించారు. ఇక్కడే విచిత్రం జరిగింది. సీమాంధ్రకు చెందిన సభ్యులు కేవీపీ రామచంద్రరావు, సి.ఎం.రమేశ్‌లు తెలంగాణకు వెళ్లారు. తెలంగాణకు చెందిన కె.కేశవరావు(కేకే), ఎం.ఎ.ఖాన్, దేవేందర్‌గౌడ్, రేణుకాచౌదరి సీమాంధ్ర ఖాతాలోకి వచ్చారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి 18మంది రాజ్యసభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన ప్రకారం ఈ సభ్యులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 7ః11 నిష్పత్తిలో కేటాయించాలి. ఈ చట్టం మొదటి షెడ్యూల్లోని 13వ సెక్షన్ ప్రకారం సభ్యుల ను పదవీకాలం ముగిసే సమయం ప్రాతిపదికన మూడుగా విభజించి, ఆయా బృందాల్లోని సభ్యులను ఇరు రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉంది. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం పార్లమెంటులో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సమక్షంలో లాటరీ ద్వారా సభ్యులను కేటాయించారు. 2016లో పదవీవిరమణ పొందే వారిలో.. ముందుగా 2016 జూన్ 21న పదవీ కాలం ముగిసే ఆరుగురు సభ్యుల్లో ఇద్దరిని తెలంగాణకు కేటాయిం చాల్సి ఉంది. డ్రా ద్వారా గుండు సుధారాణి, వి.హనుమంతరావును తెలంగాణకు కేటాయించారు. జేడీ శీలం, జైరాం రమేశ్, వై.ఎస్.చౌదరి ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తారు. వీరితో పాటు ఎన్.జనార్దన్‌రెడ్డి (ఈయన మరణించడంతో ప్రస్తుతం సీటు ఖాళీగా ఉంది) ప్రాతినిథ్యం వహించిన సీటు ఆంధ్రప్రదేశ్‌కే ఉంటుంది. ఈ సీటుకు త్వరలో ఎన్నిక జరగనుంది. 2018లో పదవీ కాలం ముగిసే సభ్యులు.. 2018 ఏప్రిల్ 2న పదవీ కాలం ముగిసే సభ్యుల్లో ముగ్గురిని తెలంగాణ కేటాయించాల్సి ఉంది. వీరిలో లాటరీ ద్వారా రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, సి.ఎం. రమేశ్‌లను తెలంగాణకు కేటాయించారు. మిగిలిన వారిలో చిరంజీవి, రేణుకాచౌదరి, దేవేందర్‌గౌడ్‌లను సీమాంధ్రకు కేటాయించినట్టుగా పరిగణించాల్సి ఉంటుంది. అంటే తెలంగాణకు చెందిన దేవేందర్‌గౌడ్, రేణుకాచౌదరి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. సీమాంధ్రకు చెందిన సి.ఎం.రమేశ్ తెలంగాణకు వచ్చారు. ఈ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహించనున్న దేవేందర్‌గౌడ్, రేణుకాచౌదరిల పదవీకాలం ముగిశాక.. వారి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణకు ప్రాతినిథ్యం వహించనున్న సి.ఎం.రమేశ్ పదవీకాలం ముగి శాక తెలంగాణ వారిని సభ్యుడిగా ఎన్నుకొంటారు. 2020లో..:2020 ఏప్రిల్ 2న పదవీకాలం ముగిసే సభ్యుల నుంచి ఇద్దరిని తెలంగాణకు కేటాయించాల్సి ఉంది. ఇందులో లాటరీ ద్వారా కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్‌రావులను తెలంగాణకు కేటాయిం చారు. మిగిలిన సభ్యులైన టి.సుబ్బిరామిరెడ్డి, ఎం.ఎ. ఖాన్, కె.కేశవరావు, తోట సీతారామలక్ష్మిలను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినట్టుగా పరిగణించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేవీపీ తెలంగాణకు రాగా, తెలంగాణకు చెందిన కె.కేశవరావు, ఎం.ఎ.ఖాన్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి వస్తోంది. ఇక్కడ కూడా సభ్యుల పదవీ కాలం ముగిశాక సొంత రాష్ట్రాల నుంచి సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కేంద్రం పరిష్కారం! సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుల లాటరీ చిక్కులకు పరిష్కారం లభించేలా ఉంది! సభ్యుల పరస్పర అంగీకారంతో ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రానికి సంబంధించిన నిధులను ఖర్చు చేసుకునే వెసులుబాటును కల్పించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దీనికితోడు ఎంపీగా వారికి సంక్రమించే అన్ని అధికారాలు, ప్రోటోకాల్‌ను కూడా సొంత రాష్ట్రానికి వినియోగించుకునే విషయంలో సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్రం త్వరలో ఉత్తర్వులు జారీ చేసేందుకు అంగీకరించింది. అయితే లాటరీ ద్వారా తెలంగాణకు చెందిన నలుగురు ఎంపీలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించగా, సీమాంధ్రకు చెందిన ఇద్దరు ఎంపీలను మాత్రమే తెలంగాణకు కేటాయించడంతో పరస్పర అంగీకారం ఎలా సాధ్యమనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ నలుగురి మధ్య అంగీకారం కుది రినా మరో ఇద్దరు తెలంగాణ ఎంపీల పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. సాంకేతికంగా పొరుగు రాష్ట్రానికి కేటాయించినప్పటికీ ఎంపీ లాడ్స్ నిధులను తెలంగాణలోనే ఖర్చు చేసుకునేందుకు, ఇతరత్రా అధికారాలను వినియోగించుకునేందుకు అనుమతినిస్తూ కేంద్రం అంగీకరించినట్లు సమాచారం. -
కేవీపీపై రెడ్ కార్నర్ నోటిస్ అందింది: డీజీపీ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావుపై రెడ్‌కార్నర్ నోటీసు అందిందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. తమకు అందిన రెడ్ కార్నర్ నోటిస్ పై సీబీఐతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రసాదరావు అన్నారు. కేవీపీ ఎంపీ కనుక ప్రత్యేక పర్యవేక్షణ అవసరం లేదని ఓ ప్రశ్నకు సమాధానం తెలిపారు. టైటానియం ఖనిజం తవ్వకాల వ్యవహారంలో ఇంటర్‌పోల్ కేవీపీకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. కేవీపీపై ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు శుక్రవారం సీఐడీ అధికారులకు అందిన సంగతి తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పారిపోకుండా అతడి అప్పగింత ప్రక్రియ పూర్తయ్యే వరకు అదుపులో ఉంచుకోమని కోరిన ప్రొవిజినల్ అరెస్టుపై సీబీఐకి ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపామని, సీబీఐ జవాబు కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. -
నోటీసులపై హైకోర్టులో కేవీపీ పిటిషన్
అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వండి.. సోమవారంనాడు విచారణ! హైదరాబాద్: టైటానియం ఖనిజం తవ్వకాల వ్యవహారంలో ఇంటర్‌పోల్ తనకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడాన్ని కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నోటీసు ఆధారంగా తనపై అరెస్టు సహా ఎటువంటి చర్యలు తీసుకోకుండా సీఐడీ అధికారులను ఆదేశించాలని కోరుతూ లంచ్ మోషన్ రూపంలో ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణ ప్రసాద్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ వ్యవహారం అంతర్జాతీయ చట్టాలకు సంబంధించిందని, దీనిపై లోతుగా వాదనలు వినాల్సింది ఉందని, ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేనని జస్టిస్ నూతి రామ్మోహనరావు స్పష్టంచేశారు. లంచ్ మోషన్ కాకుండా రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు. దీంతో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీలను ప్రతివాదులుగా పేర్కొంటూ కేవీపీ రెగ్యులర్ పిటిషన్ వేశారు. ఇది సోమవారం విచారణకు రానుంది. నాకెలాంటి సంబంధం లేదు...‘‘టైటానియం తవ్వకాల వ్యవహారంతో నాకెలాంటి సంబంధం లేదు. మీడియా ద్వారానే నాకీ విషయం తెలిసింది. అమెరికా ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్టు కూడా కథనాలొస్తున్నాయి. అమెరికా కోర్టు మోపిన అభియోగాలకూ, నాకూ సంబంధం లేదు. ఎన్నికల నేపథ్యంలో కొన్ని శక్తులు నాకు వ్యతిరేకంగా పనిచేస్తూ నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నాయి. నాపై వస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదు. 2006కు సంబంధించిన వ్యవహారంగా పత్రికా కథనాల్లో వస్తోంది. మరి ఇప్పటికిప్పుడు అరెస్టు చేయాల్సిన అవసరమేంటి? అమెరికా చట్టాలు ఇక్కడ నాకు వర్తించవు. ఇంటర్‌పోల్ నోటీసు ఆధారంగా సీఐడీ అధికారులు చర్యలు తీసుకుంటే నా ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించినట్లే. 1977 నాటి భారత్-అమెరికా ఒప్పందం ప్రకారం ఇక్కడి అధికారులు చట్ట ప్రకారం అనుసరించాల్సిన విధి విధానాలను పూర్తి చేసి, బాధితుడి వాదనలు విన్నాకే నోటీసు జారీ చేయాలి. అవేవీ లేకుండానే ఇంటర్‌పోల్ నోటీసులిచ్చింది కనక వీటి ప్రకారం సీఐడీ అధికారులు చర్యలు తీసుకోవటానికి వీల్లేదు. ఈ మేరకు సీఐడీని ఆదేశించండి’’ అని పిటిషన్లో కేవీపీ అభ్యర్థించారు. కేవీపీపై సీఐడీకి అందిన ఇంటర్‌పోల్ నోటీసు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుపై ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు శుక్రవారం సీఐడీ అధికారులకు అందింది. ఆయనపై ఈ నోటీసుల్ని ఇంటర్‌పోల్ ద్వారా అమెరికా జాతీయ క్రైమ్ బ్యూరో పంపిన లేఖ (నం. ఏ-2828/4-2014) బుధవారం సీబీఐకి అందిన విషయం విదితమే. దీని ద్వారా రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీ సీఐడీకి శుక్రవారం చేరింది. ఈ నోటీసుల్లో ఎక్కడా ప్రొవిజినల్ అరెస్టుకు సంబంధించిన వారెంట్ లేదని సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పారిపోకుండా అతడి అప్పగింత ప్రక్రియ పూర్తయ్యే వరకు అదుపులో ఉంచుకోమని విదేశాన్ని కోరడాన్నే ప్రొవిజినల్ అరెస్టు అంటారు. ఈ అంశం ఎక్కడా రెడ్‌కార్నర్ నోటీసుల్లో ప్రస్తావించలేదని, దీనిపైనే సీబీఐకి ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపామని కృష్ణప్రసాద్ మీడియాకు వెల్లడించారు. వారి జవాబు కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. -
హైకోర్టును ఆశ్రయించిన కేవీపీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో టైటానియం కేసులో ఇంటర్ పోల్ ద్వారా అమెరికా జాతీయ క్రైం బ్యూర్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటిస్ అంశంపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు హైకోర్టును ఆశ్రయించారు. రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా తన అరెస్ట్‌ను ఆపాలంటూ కేవీపీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. కేవీపీపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ పోలీసులకు సీబీఐ లేఖ పంపినట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
పెద్దల సభలో వాయిదాల పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజ్యసభలో ఆందోళన కొనసాగుతోంది. బిల్లు రాబోతోందని సభా వ్యవవహారాల సప్లిమెంటరీ ఎజెండాలో ఉండటంతో రోజంతా ఉత్కంఠతో సాగింది. ఉదయం 11 గంటలకు తొలుత రాజ్యసభ ప్రారంభం కాగానే.. చైర్మన్ హమీద్ అన్సారీ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అప్పటికే సీమాంధ్ర సభ్యులు కె.వి.పి.రామచంద్రరావు, సుజనాచౌదరి, సి.ఎం.రమేశ్‌లు వెల్‌లో ఆందోళనకు దిగారు. బుధవారం లోక్‌సభలో జరిగిన తీరును ఖండిస్తున్నామంటూ ఎస్పీ సభ్యుడు ప్రస్తావించగా.. మరో సభ గురించి ఇక్కడ ప్రస్తావన తేవద్దంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ దశలో సభ అదుపు తప్పటంతో వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. తిరిగి సమావేశం కాగానే.. టీడీపీ ఎంపీ సి.ఎం.రమేశ్ చైర్లో ఉన్న డిప్యూటీ చైర్మన్ కురియన్ వద్ద నుంచి కాగితాలు లాక్కునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో మంత్రులు పలు నివేదికలు ప్రవేశపెట్టారు. కొద్దిసేపటికి ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఈనెల 18న ఆమోదం తెలిపింది. దాన్ని సభ ముందుంచుతున్నాను..’ అని రాజ్యసభ సెక్రటరీ జనరల్.. లోక్‌సభ నుంచి వచ్చిన సందేశాన్ని చదివి వినిపించారు. ఆ సమయంలో సి.ఎం.రమేశ్ సెక్రటరీ జనరల్ నుంచి కాగితాలు లాగి చింపేయటానికి ప్రయత్నించారు. వెంటనే డిప్యూటీ చైర్మన్ ‘సిబ్బందిపై దాడిచేయబోవడం సరికాదు.. ఇది దురదృష్టకరం..’ అంటూ తీవ్రంగా ఆక్షేపించారు. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక.. ‘సభ్యుడు రమేశ్ వ్యవహరించిన తీరు అభ్యంతరకరం.. ’ అంటూ ఆయనపై చర్య తీసుకోబోతున్నట్లు డిప్యూటీ చైర్మన్ చెప్పబోయారు. అయితే విపక్షాలు అభ్యంతరం చెప్తూ రమేశ్‌కు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరాయి. దీంతో రమేశ్ లేచి సభకు క్షమాపణలు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా పేపర్లు గుంజుకోలేదని, భావోద్వేగంతోనే అలా జరిగిందన్నారు. దీంతో ఆయనపై చర్య తీసుకోవటం లేదని కురియన్ ప్రకటించారు. అనంతరం సి.ఎం.రమేశ్, సుజనాచౌదరి, కేవీపీలు వెల్‌లో ఆందోళన కొనసాగించారు. వారికి మద్దతుగా కేంద్రమంత్రి చిరంజీవి కూడా తన స్థానంలో లేచి నిల్చున్నారు. సెక్రటరీ జనరల్‌ను తోయలేదు: రమేశ్ రాజ్యసభలో బిల్లును టేబుల్ చేసే సమయంలో చించేశానని.. అంతేకానీ, సెక్రటరీ జనరల్‌ను తాకడం, తోయడం లాంటి ఘటనలేవీ జరగలేదని రమే్‌శ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనను సస్పెండ్ చేయడానికి కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. రాజ్యసభ సజావుగా నడిచి సీమాంధ్రుల సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో కూడా టీవీ ప్రసారాలు నిలిపేసి బిల్లును ఆమోదించాలనే ప్రయత్నాలను మానుకోవాలని చైర్మన్‌కు చెప్పామన్నారు. -
కాంగ్రెస్‌లోనే మరణిస్తానన్న కేవీపీ
వైఎస్ పాదయాత్ర వల్లే కాంగ్రెస్ నేటికీ పరిపుష్టిగా ఉందని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ‘నన్ను గాంధీభవన్‌లోకి రానీయొద్దని కొందరు ప్రయత్నించారు. కానీ నాకు గాంధీభవనే దేవాలయం. కాంగ్రెస్‌లోనే చివరి వరకూ ఉండి మరణిస్తా’ అని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. ‘‘నేను కాంగ్రెస్‌లో కొనసాగుతానో, లేదోనంటూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. 1964 నుంచి ఇప్పటివరకు నాకు కాంగ్రెస్‌తో అనుబంధముంది. కష్టసుఖాలు అనుభవించాను. ప్రతిష్ట, అప్రతిష్టలూ మూటగట్టుకున్నాను. అనేకమంది సీనియర్లతో కలసి పనిచేశాను. పార్టీ కోసం కష్టపడి పని చేశాను. అయినా నన్ను చెడ్డవాడిగానే ప్రచారం చేశారు’’ అంటూ గతాన్ని నెమరేసుకున్నారు. కేవీపీతో పాటు టి.సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికవడం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీ భావోద్వేగంతో మాట్లాడారు. తాను ఏనాడూ పార్టీకి వ్యతిరేకంగా నడవలేదని, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రోజుల్లో తాను ఇందిర వెంటే నడిచానని అన్నారు. ‘‘పీవీ నర్సింహారావు, కాసు బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, అంజయ్య వంటి మహామహులకే గాకుండా ఇప్పుడున్న ఎందరో నేతలకు బీ ఫారాలు అందించే అదృష్టం నాకు కలిగింది. పీసీసీ అధ్యక్షుడిగా వైఎస్ 1983లో బాధ్యతలు స్వీకరించాకే అప్పటిదాకా ఎవరూ పట్టించుకోని గాంధీభవన్‌ను అభివృద్ధి చేశారు. 1983లో వైఎస్ పీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచీ ఆయన వెన్నంటే నడిచాను. కాంగ్రెస్ నేటికీ పరిపుష్టంగా ఉందంటే అందుకు వైఎస్ పాదయాత్ర కూడా కారణం. ఆ పాదయాత్ర చెడ్డ పని అన్నట్టుగా అడ్డంకులు సృష్టించారు. కానీ నాటి పీసీసీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు ఎంతో సహకరించారు. బొత్స, ఆనం రామనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్‌తో సహ పలువురిని విద్యార్థి యువజన దశ నుంచే ప్రోత్సహించాను. వారు రాజకీయాల్లో ఉన్నతంగా ఎదగడంలో నా పాత్ర ఉంది. మంత్రి శ్రీధర్‌బాబును మేనల్లుడిలా చూసుకున్నా. వి.హన్మంతరావు, చిన్నారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వంటి వారు పెద్ద స్థాయిలోకి రావడానికి తోడ్పడ్డాను.దానం నాగేందర్ పార్టీని వీడినా, పొన్నం ప్రభాకర్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసి సస్పెండైనా వారిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చి మంత్రులుగా, ఎంపీలుగా చేశాం. 1996 నుంచీ రాజ్యసభ సభ్యత్వం కోసం ప్రయత్నించాను. ఫలించకపోయినా నిరాశా నిస్పృహలకు లోనవలేదు. 1989 నుంచి 1995 వరకు మా నిర్ణయాల వల్ల పార్టీకి కొన్ని నష్టాలు జరగడం నిజమే గానీ అందుకు కారణంగా మాకు తెలియకుండా జరిగిన తప్పులే. 2009లో కాంగ్రెస్‌కు రాష్ట్రంలో 10 లోక్‌సభ స్థానాలు కూడా రావని అధిష్టానం భావిస్తే మేం 33 స్థానాలు తీసుకురాగలిగాం. వైఎస్ హఠాన్మరణం తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. కాంగ్రెస్‌ను స్తబ్ధత, నిరాశ ఆవ రించాయి’’ అని గుర్తు చేసుకున్నారు. ‘ఇంత కష్టపడ్డా నాకు రెండోసారి రాజ్యసభ సీటు రాకుండా చేసేందుకు కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి’ అంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గురించి ఏదో చెప్పబోతూ ఆగిపోయారు. అంతలోనే, ‘ఈ సమయంలో వ్యతిరేక భావాలెందుకు? అన్నీ మంచి విషయాలే మాట్లాడతాను. సీఎం కిరణ్ కూడా నాకు మనస్ఫూర్తిగా సహకరించారు’ అని పేర్కొన్నారు. వైఎస్ చివరి కోరిక ప్రకారం రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యేలా సహకరిస్తానన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తిరస్కరణ ఓటు వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గురించి అధిష్టానానికి చెప్పామని, వారే చర్య తీసుకుంటారని బొత్స అన్నారు. -
రాజ్యసభకు ఆ ఆరుగురు..
కేవీపీ, టీఎస్సార్, ఎంఏ ఖాన్ (కాంగ్రెస్), గరికపాటి, సీతారామలక్ష్మి (టీడీపీ), కేకే (టీఆర్ఎస్)లు ఎన్నిక సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి రంగం నుంచి తప్పుకోవడంతో రాజ్యసభ ఎన్నికల్లో ఆరు స్థానాలకు అభ్యర్థుల ఎన్నిక శుక్రవారం లాంఛ నంగా ముగిసింది. కాంగ్రెస్ నుంచి కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్, టీడీ పీ నుంచి గరికపాటి మోహన్‌రావు, తోట సీతారామలక్ష్మి, టీఆర్ఎస్ నుంచి కె.కేశవరావు (కేకే) ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజసదారాం శుక్రవారం రాత్రి విజేతలకు ధ్రువపత్రాలు అందించారు. అసెంబ్లీ కమిటీ హాల్-1లో శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. అసెంబ్లీలోని 294 స్థానాలకు గాను 15 ఖాళీగా ఉన్నాయి. ముగ్గురికి (సుమన్‌రాధోడ్, జనార్దన్ థాట్రాజ్, చెన్నమనేని రమేష్) ఓటు హక్కు లేదు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన 17 మందితో పాటు ఆపార్టీకి మద్దతిస్తున్న ఆరుగురు ఎమ్మెల్యేలు (ఆదినారాయణరెడ్డి, రాజన్నదొర, పినిపె విశ్వరూప్, మోపిదేవి వెంకటరమణ, కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి, కాటసాని రామిరెడ్డి), బీజేపీ, దాని అనుబంధ ఎమ్మెల్యేలు (కిషన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎన్నం శ్రీనివాసరెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి), సీపీఎంకు చెందిన జూలకంటి రంగారెడ్డి ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మిగతా 248 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రథమ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఎంఏ ఖాన్‌కు 49, కేవీపీ రామచంద్రరావుకు 46, టి.సుబ్బిరామిరె డ్డికి 46, గరికపాటి మోహన్‌రావుకు 38, తోట సీతారామలక్ష్మికి 38, కేశవరావుకు 26 ఓట్లు వచ్చాయి. గురువారం రంగం నుంచి తప్పుకున్న తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి ఒక్క ఓటు కూడా రాలేదు. దీంతో తప్పింపు పద్ధతిలో ప్రథమ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనే ఆదాల ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పెద్దల సూచన మేరకు ఆయన తన మొదటి ప్రాధాన్య ఓటును సుబ్బిరామిరెడ్డికి వేశారు. రెండో ప్రాధాన్య ఓటును కేవీపీకి వేయాలని ఆదాలకు సూచించినప్పటికీ, ఆయన ఆ ఓటును వినియోగించుకోలేదు. ఆరు స్థానాలకు ఆరుగురే బరిలో ఉండటంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సిన అవసరం లేకుండాపోయింది. ఎవరికెన్ని ప్రథమ ప్రాధాన్య ఓట్లు వచ్చాయో లెక్కించిన తర్వాత అధికారులు విజేతలను అధికారికంగా ప్రకటించారు. ఓట్లు వేసినప్పుడు తప్పితే మిగతా సమయంలో ఎమ్మెల్యేలను సైతం పోలింగ్ కేంద్రం, అసెంబ్లీ లాబీల్లోకి కూడా అనుమతించలేదు. తొలి ఓటు స్పీకర్‌దే ముందుగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీనియర్ మంత్రులు ఓట్లు వేశారు. అనారోగ్యంతో ఉన్న మణెమ్మకు సహాయకారిగా ఆమె కుమార్తె, పి.శంకర్రావుకు సహాయంగా సీఎల్పీ ఇన్చార్జి శ్రీకాంత్‌లు వారి సూచనల మేరకు ఓటు వేశారు. చిట్టచివరగా జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఓటు వేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ద్వితీయ ప్రాధాన్య ఓటును కె.కేశవరావుకు వేయగా, కొందరు తృతీయ ప్రాధాన్య ఓటును కేవీపీ రామచంద్రరావుకు వేశారు. గ్రూపులతో హడావుడి.. ఓటింగ్‌లో అందరూ ఒక్కటై రాజ్యసభ ఎన్నికల పొలింగ్‌కు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రూపులుగా విడిపోయి కొద్దిసేపు హడావుడి చేశారు. అయితే, ఓటింగ్‌కు వచ్చేసరికి అందరూ పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకున్నారు. ఎవరు ఎవరికి ప్రథమ, ద్వితీయ ప్రాధాన్య ఓట్లు వేయాలో పార్టీ నేతలు స్పష్టంగా నిర్దేశించారు. అనుబంధ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌తో కలుపుకొని కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యేలు 50 మంది ఉన్నారు. వీరిలో 46 మంది ఎం.ఎ.ఖాన్‌కు ప్రథమ ప్రాధాన్య ఓటు వేయాలని నిర్ణయించారు. దానం నాగేందర్, జయసుధలను కేవీపీ రామచంద్రరావుకు, కూన శ్రీశైలం గౌడ్, సుధీర్‌రెడ్డిలను టి.సుబ్బిరామిరెడ్డికి కేటాయించారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలతో కేవీపీ, సుబ్బిరామిరెడ్డిలకు ప్రథమ, ద్వితీయ ప్రాధాన్య ఓట్లు వేయించారు. ఓట్ల కేటాయింపునకు సీఎం శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు జూబ్లీహాల్లో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలెవరూ ఈ విందుకు హాజరుకాలేదు. దీంతో సీఎం సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఓట్లు ఎవరికి ఎలా వేయాలో సూచనలు చేశారు. మరోవైపు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు గోల్కొండ హోటల్లో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాంతానికే చెందిన రాజ్యసభ అభ్యర్థులకే ఓటు వేయాలని నిర్ణయించారు. పార్టీ అభ్యర్థి విజయానికి పోగా మిగిలిన ఓట్లను టీఆర్ఎస్ అభ్యర్థికి వేయాలని నిర్ణయించారు. ఈ విషయం తెలిసి పీసీసీ అధ్యక్షుడు బొత్స అక్కడికి వచ్చారు. పార్టీ అభ్యర్థులకు మాత్రమే మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని, రెండో ప్రాధాన్య ఓటు ఎవరికీ వేయొద్దని సూచించారు. బొత్స వెళ్లిపోగానే టీఆర్ఎస్ అభ్యర్థి కె.కేశవరావు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు అక్కడికి వచ్చారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, జానారెడ్డి తదితరులతో చర్చించారు. కనీసం ఏడు లేదా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేశవరావుకు మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని నిర్ణయించారు. తీరా ఓటింగ్‌కు వచ్చేసరికి ఒక్కరు మినహా టీ ఎమ్మెల్యేలందరూ మొదటి ప్రాధాన్య ఓటును పార్టీ సూచించిన అభ్యర్థులకే వేశారు. మేయర్ పదవితో ఎంఐఎం ఓట్లు పోలింగ్ జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ఆవరణకు వచ్చిన ఎంఐఎం ఎమ్మెల్యేలు ఓట్లు వేయకుండా తమ కార్యాలయంలోనే కూర్చున్నారు. దీంతో మంత్రులు జానారెడ్డి, సారయ్య, కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎ ఖాన్లు వారితో చర్చించారు. హైదరాబాద్ మేయర్ పదవిని పూర్తి కాలం ఎంఐఎంకే వదిలిపెడతామని, తమకు ఓటు వేయాలని కోరారు. చివరకు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. జేపీ, చిన్నం రామకోటయ్య ఓటు టీడీపీకే టీడీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను మినహాయిస్తే అసెంబ్లీలో టీడీపీ బలం 75 మాత్రమే. అందులో సుమన్ రాథోడ్‌పై కోర్టు కేసు కారణంగా ఆమెకు ఓటు హక్కు లేకుండా పోయింది. మిగిలిన 74 మందికిగాను ఆ పార్టీ ఇద్దరు అభ్యర్థులకు 76 ఓట్లు వచ్చాయి. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య టీడీపీ అధికారిక అభ్యర్థికే ఓటు వేశారు. లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ కూడా టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో గరికపాటి, తోట సీతారామలక్ష్మిలకు చెరో 38 ఓట్లు వచ్చాయి. రాజ్యసభ సీటు ఇవ్వలేదని అలకబూనిన మోత్కుపల్లి నర్సింహులుకు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పట్నం మహేందర్‌రెడ్డిలు నచ్చజెప్పడంతో ఆయన ఆఖరి నిమిషంలో వచ్చి ఓటు వేశారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోలేదని, సీనియర్లకు న్యాయం చేయలేదని మోత్కుపల్లి విమర్శించారు. కేకేకు మొదటి ఓటేసిన ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల నుంచి ఎన్నో కొన్ని మొదటి ప్రాధాన్యత ఓట్లు ఆశించిన టీఆర్ఎస్ అభ్యర్థి కేకేకు ఆ ఆశ నెరవేరలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కరు మాత్రమే ప్రథమ ప్రాధాన్య ఓటు వేశారు. టీఆర్ఎస్ 16 (17లో చెన్నమనేనికి ఓటు హక్కు లేదు), సీపీఐ 4, ఆ పార్టీకి మద్దతిస్తున్న మరో నలుగురు టీడీపీ అసంతృప్తులు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కలిపి కేకేకు 26 మాత్రమే మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. మెదక్ జిల్లా గద్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నరసారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేశారని ప్రచారం ఉంది. 42మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేకేకు రెండో ప్రాధాన్య ఓటు వేశారు. సీపీఐ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదటి ప్రాధాన్య ఓటు మాత్రమే వినియోగించుకున్నారు. మీ సబ్‌కాంట్రాక్టర్ ఆదాల పోలింగ్ జరుగుతున్న సమయంలో టి.సుబ్బిరామిరెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఎదురుపడ్డారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా తనకే ఓటు వేశారని సుబ్బిరామిరెడ్డి గొప్పగా చెప్పబోతుండగా.. ‘‘చాల్లెండి. ఆయన మీ సబ్‌కాంట్రాక్టర్‌గా అనేక పనులు చేస్తున్నాడు. మీకు కాకుండా వేరే వాళ్లకు వేస్తాడా’’ అని వివేకానందరెడ్డి అనడంతో సుబ్బిరామిరెడ్డి మారు మాట్లాడలేదు. చెల్లని ఓట్లు ఎవరివి? కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరస్కరణ ఓటు వేశారు. నాలుగు ఓట్లు చెల్లలేదు. ఈ నాలుగూ ఎవరిదన్న విషయంపై పెద్ద చర్చే జరిగింది. గంగుల కమలాకర్‌రెడ్డి, హనుమంత్ షిండేలు టీఆర్ఎస్కు ఓటు వేయడంతో వారి ఓట్లను పరిగణనలోకి తీసుకోరాదని టీడీపీ ఎన్నికల అధికారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. అలాగే విద్యాసాగర్‌రావు, జేసీ దివాకర్‌రెడ్డిలు బ్యాలెట్ పత్రాలను అందరికీ చూపించినందుకు వారి ఓట్లను చెల్లనివిగా ప్రకటించాలన్న డిమాండ్ వచ్చింది. అయితే ఎన్నికల అధికారులు టీడీపీ ఫిర్యాదుతోపాటు జేసీ, విద్యాసాగర్రావులపై వచ్చిన డిమాండ్లను తోసిపుచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాండ్రు కమల తొట్రుపాటు పడి ప్రాధాన్య ఓటును గుర్తించకుండానే వట్టి బ్యాలెట్ పత్రాన్ని బాక్సులో వేశారు. మరో ఎమ్మెల్యే నీరజారెడ్డి కూడా ఓటు వేయకుండా బ్యాలెట్ పత్రాన్ని బాక్సులో వేసినట్లు ప్రచార ం జరిగింది. బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ, ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్లు ప్రాధాన్య ఓటు కింద అంకెలు వేయకుండా టిక్కులు పెట్టడంతో వారి ఓట్లు చెల్లలేదు. -
చివరి నిమిషంలో జేసీ విత్ డ్రా
హైదరాబాద్ : అధిష్టానాన్ని ధిక్కరించి అయినా రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధపడ్డ మాజీమంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అధిష్టానం తనను ఎంపిక చేయకపోయినా పోటీ చేసి తీరాతానంటూ హంగామా చేసిన జేసీ హఠాత్తుగా తన నిర్ణయం మార్చుకున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని తనకు రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించిన టి సుబ్బరామిరెడ్డి, కెవిపి రామచంద్రరావు ఫోన్ చేసినట్లు జేసీ పేర్కొనటం విశేషం. కాగా కోస్తా ఆంధ్రా ప్రాంతం నుంచి ఎమ్మెల్సీ చైతన్యరాజు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన మంగళవారం ఉదయం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. చైతన్యరాజుకు జేసీ దివాకర్ రెడ్డి మద్దతు పలికారు. కాగా రెబల్‌గా పోటీలోకి దిగేందుకు చైతన్యరాజు, విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే రాయలసీమ నుంచి జేసీ దివాకరరెడ్డి పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ సీమాంధ్ర నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు చైతన్యరాజు వైపు మొగ్గు చూపారు. మరోవైపు టీఆర్ఎస్ తరపున కేశవరావు నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్కు సీపీఐ మద్దతు ఇచ్చింది. కాగా కేవీపీ రామచంద్రరావు, టీ సుబ్బరామిరెడ్డి, ఎంఏ ఖాన్లకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈరోజు గాంధీభవన్‌లో బీఫారమ్‌లు అందించారు. పార్టీకి చేసిన సేవకు గుర్తింపుగానే సోనియా ముగ్గురికి టిక్కెట్లు ఇచ్చిందని బొత్స తెలిపారు. ఇక టీడీపీ తరపున పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట సీతామహాలక్ష్మి, గరికపాటి మోహన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు వారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. -
కాంగ్రెస్ పెద్దలు ముగ్గురే
కేవీపీ, సుబ్బరామిరెడ్డి, ఎం.ఎ.ఖాన్లకు మళ్లీ రాజ్యసభ చాన్స్ నంది ఎల్లయ్య, రత్నాబారుుకి దక్కని అవకాశం నాలుగో సీటుకు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు! సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా రాష్ట్రం నుంచి కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, ఎం.ఎ.ఖాన్‌లను ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ ముగ్గురూ రాజ్యసభ సిట్టింగ్ సభ్యులే కావడం విశేషం. మరో ఇద్దరు సిట్టింగ్ సభ్యులు నంది ఎల్లయ్య, రత్నాబారుులకు ఈసారి అవకాశం కల్పించలేదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ‘సమైక్య’ అభ్యర్థిని రంగంలోకి దింపుతామని పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు బహిరంగ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో.. బలమైన అభ్యర్థులుగా భావించి సీమాంధ్ర ప్రాంతం నుంచి టి.సుబ్బరామిరెడ్డి, కేవీపీలను కాంగ్రెస్ బరిలోకి దింపినట్లు చెబుతున్నారు. ఇక తెలంగాణ నుంచి ఎం.ఎ.ఖాన్‌ను ఎంపికచేశారు. సుబ్బరామిరెడ్డి ఇప్పటికే రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారంపై సోమవారం సాయంత్రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌లు పార్టీ అధ్యక్షురాలితో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాత్రి 7.20 ప్రాంతంలో మొత్తం 9 రాష్ట్రాలకు సంబంధించిన 12 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన మొత్తం ఐదు స్థానాలు ఖాళీ అవుతుండగా వీటిలో ప్రస్తుతం మూడుస్థానాలు గెలుచుకునేందుకే పూర్తి బలం ఉంది. ఇత ర పార్టీలు సహకరిస్తే మరోస్థానం గెలుచుకునే అవకాశం ఉంది. అయితే టీఆర్ఎస్ తరఫున కె.కేశవరావు బరిలోకి దిగుతుండడంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆ పార్టీకి అవకాశం ఇస్తూ.. నాలుగోస్థానాన్ని వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధమైనట్టు అభ్యర్థుల జాబితాను బట్టి అర్థమవుతోంది. దిగ్విజయ్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో నిలుస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఆంధ్రప్రదేశ్: టి.సుబ్బరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎం.ఎ.ఖాన్ ఛత్తీస్‌గఢ్: మోతీలాల్ వోరా గుజరాత్: మధుసూదన్ మిస్త్రీ హిమాచల్‌ప్రదేశ్: విప్లవ్ ఠాకూర్ మధ్యప్రదేశ్: దిగ్విజయ్‌సింగ్ మహారాష్ట్ర: మురళీ దేవ్రా, హుస్సేన్ ఉమర్ దాల్వే మణిపూర్: హజీ అబ్దుల్ సలాం మేఘాలయ: వాన్సుక్ సయ్యం ఒడిశా: రణ్జిబ్ బిశ్వత్. నన్ను పార్టీ నమ్మింది: సుబ్బరామిరెడ్డి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక కావడంపై సుబ్బరామిరెడ్డి స్పందించారు. ‘సంప్రదాయాన్ని పక్కనబెట్టి నాకు మూడోసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాంగ్రెస్‌కు నేను పూర్తిగా విధేయుడిని. ఎలాం టి పరిస్థితి ఉన్నా పార్టీ మాట జవదాట లేదు. నేను అజాత శత్రువునని పార్టీ నమ్మింది’ అని అన్నారు. -
దిగ్విజయ్‌తో సుదీర్ఘ మంతనాలు జరిపిన కేవీపీ
న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు శుక్రవారం సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరు సమావేశం అయ్యారు. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం కేవీపీ మాట్లాడుతూ సీమాంధ్రుల అభిప్రాయాన్ని దిగ్విజయ్ సింగ్‌కు తెలియచేసినట్లు తెలిపారు. కాగా ఈ భేటీకి కేంద్రమంత్రి జేడీ శీలం హాజరై అనంతరం వెళ్లిపోయారు. కేవీపీ నిన్న కూడా దిగ్విజయ్‌తో సమావేశం అయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ. డిప్యూటీ స్పీకర్ దామోదర రాజనర్సింహ ఈరోజు ఉదయం హస్తిన చేరుకున్నారు. వారికి ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణ ప్రక్రియకు సహకరించాలని వారిని ప్రధానమంత్రి కోరనున్నారు. ఇక కాంగ్రెస్ సమన్వయ కమిటీ రేపు ఉదయం 10.30 గంటలకు ప్రధానమంత్రిని కలవనుంది. -
వైఎస్ మృతి కాంగ్రెస్‌కు చీకటి రోజు
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన రోజు కాంగ్రెస్ పాలిట చీకటి దినమని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. వైఎస్ నాలుగో వర్ధంతి సందర్భంగా గాంధీభవన్‌లో సోమవారం పలువురు నేతలు వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆనంతోపాటు మంత్రులు ఎన్.రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్, దానం నాగేందర్, కాసు వెంకట కృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధర్, ప్రధాన కార్యదర్శి టీజేఆర్ సుధాకర్‌బాబు, పలువురు పీసీసీ నాయకులు వైఎస్‌కు నివాళులర్పించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. బొత్స ఢిల్లీ పర్యటనలో ఉండగా, సీఎం హైదరాబాద్‌లోనే ఉండి కూడా గాంధీభవన్‌కు రాలేదు. కాగా, సీఎల్పీ కార్యాలయంలో వైఎస్ వర్ధంతిని నిర్వహించలేదు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ లాబీలోని వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏపీభవన్‌లో ఘనంగా వైఎస్ వర్ధంతి సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగో వర్ధంతిని సోమవారమిక్కడ ఏపీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఢిల్లీ వైఎస్సార్ ట్రస్ట్ అధ్యక్షుడు కేఎస్ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి అభిమానులు నివాళి ఘటించారు. -
వై.ఎస్.రాజశేఖరరెడ్డి వేర్పాటువాది కాదు: కేవీపీ రామచంద్రరావు
రాష్ట్ర విభ జనకు బీజం వేసింది దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డేనంటూ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ అగ్రనేతలు చేస్తున్న ఆరోపణలను సోమవారం రాజ్యసభలో అదే పార్టీకి చెందిన సీనియర్ నేత డాక్టర్ కె.వి.పి. రామచంద్రరావు తిప్పికొట్టారు. తెలంగాణ అంశంపై రాజ్యసభలో దాదాపు మూడు గంటలకు పైగా, పూర్తిస్థాయిలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. వైఎస్ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించారనే విమర్శను తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. చర్చలో పాల్గొన్న వివిధ పక్షాలకు చెందిన సభ్యుల వాదనలు అర్ధసత్యాలు, వక్రీకరణలతో కూడుకొని ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తెలుగు దేశం సభ్యులు చేసిన వ్యాఖ్యలు అనవసరమైనవే కాక అభ్యంతరకరమైనవని అంటూ కేవీపీ ఖండించారు. తెలంగాణ అంశానికి సంబంధించి తాను వెల్లడించబోయే వివరాలు తప్పని ఏ కమిటీ అయినా రుజువు చేస్తే.. సభ విధించే ఎలాంటి శిక్షకైనా తాను బద్ధుడనై ఉంటానంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఇంతకుముందు ఎన్నడూ, ఎక్కడా ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. 2001లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానంలో తెలంగాణపై రెండవ ఎస్సార్సీని నియమించాలని మాత్రమే పేర్కొన్నదని, 2004 ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎన్నికల ప్రణాళిలో కూడా రెండవ ఎస్సార్సీని ఏర్పాటు చేస్తామనే హామీ ఇచ్చామని, ఎన్నికల పొత్తు సమయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య కుదిరిన ఒప్పందంలో కూడా ఎస్సార్సీ ప్రస్తావనే ఉందని స్పష్టంచేశారు. 2009 ఎన్నికలకు ముందు రాష్ట్ర శాసనసభలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి తెలంగాణ డిమాండ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా సంబంధిత భాగస్వాములందరి అనుమానాలను, ఎదురయ్యే సమస్యలను పరిశీలించి తగిన పరిష్కారాలు కనుగొనాల్సి ఉందంటూ అప్పటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య అధ్యక్షతన ఒక కమిటీని నియమించారని ఆయన వివరించారు. ఆ తీర్మానం ఎప్పుడు జరిగిందో చెప్పండి..: రోశయ్య కమిటీ నియామకాన్ని ప్రకటించిన ప్రభుత్వ ఉత్తర్వును, ఆ తర్వాత విడుదలైన మరో జీవోలో పేర్కొన్న రోశయ్య కమిటీ పరిశీలనాంశాలను కేవీపీ సభలో చదివి వినిపించారు. వైఎస్ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించారనడం అర్ధ సత్యమని, ఇదంతా వక్రీకరణేనని అన్నారు. తెలంగాణపై రాష్ట్ర శాసనసభ ఇప్పటికే తీర్మానం చేసిందన్న కేంద్ర హోం మంత్రి ప్రకటనను కూడా తీవ్రంగా ఖండించిన కేవీపీ, ఆ తీర్మానం ఎప్పుడు జరిగిందో, అప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఎవరో, ముఖ్యమంత్రి ఎవరో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కారణాలేమిటని కూడా ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంటుకు సమర్పించి దానిపై సమగ్ర చర్చను అనుమతించాలని కోరారు. దేశంలో మొత్తం చిన్న రాష్ట్రాల డిమాండ్లు ఎన్నున్నాయని ప్రశ్నించిన ఆయన వాటన్నింటి పరిశీలనకు రెండో ఎస్సార్సీ వేస్తారా అని అడిగారు. దేశ చరిత్రలో రాజధాని నగరంతో కూడిన ప్రాంతం ఎప్పుడైనా వేరు పడిందా? అసలు చరిత్రలో ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం అస్థిత్వంలో ఉండేదా అన్న విషయాలను కూడా వెల్లడించాలని ఆయన చిదంబరాన్ని డిమాండ్ చేశారు.