సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన రోజు కాంగ్రెస్ పాలిట చీకటి దినమని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. వైఎస్ నాలుగో వర్ధంతి సందర్భంగా గాంధీభవన్‌లో సోమవారం పలువురు నేతలు వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆనంతోపాటు మంత్రులు ఎన్.రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్, దానం నాగేందర్, కాసు వెంకట కృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధర్, ప్రధాన కార్యదర్శి టీజేఆర్ సుధాకర్‌బాబు, పలువురు పీసీసీ నాయకులు వైఎస్‌కు నివాళులర్పించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. బొత్స ఢిల్లీ పర్యటనలో ఉండగా, సీఎం హైదరాబాద్‌లోనే ఉండి కూడా గాంధీభవన్‌కు రాలేదు. కాగా, సీఎల్పీ కార్యాలయంలో వైఎస్ వర్ధంతిని నిర్వహించలేదు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ లాబీలోని వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఏపీభవన్‌లో ఘనంగా వైఎస్ వర్ధంతి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగో వర్ధంతిని సోమవారమిక్కడ ఏపీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఢిల్లీ వైఎస్సార్ ట్రస్ట్ అధ్యక్షుడు కేఎస్ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి అభిమానులు నివాళి ఘటించారు.
వైఎస్ మృతి కాంగ్రెస్‌కు చీకటి రోజు
Published Tue, Sep 3 2013 4:20 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement