కేవీపీపై రెడ్ కార్నర్ నోటిస్ అందింది: డీజీపీ
కేవీపీపై రెడ్ కార్నర్ నోటిస్ అందింది: డీజీపీ
Published Sun, Apr 27 2014 1:28 PM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావుపై రెడ్‌కార్నర్ నోటీసు అందిందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు.
తమకు అందిన రెడ్ కార్నర్ నోటిస్ పై సీబీఐతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రసాదరావు అన్నారు. కేవీపీ ఎంపీ కనుక ప్రత్యేక పర్యవేక్షణ అవసరం లేదని ఓ ప్రశ్నకు సమాధానం తెలిపారు.
టైటానియం ఖనిజం తవ్వకాల వ్యవహారంలో ఇంటర్‌పోల్ కేవీపీకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. కేవీపీపై ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు శుక్రవారం సీఐడీ అధికారులకు అందిన సంగతి తెలిసిందే.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పారిపోకుండా అతడి అప్పగింత ప్రక్రియ పూర్తయ్యే వరకు అదుపులో ఉంచుకోమని కోరిన ప్రొవిజినల్ అరెస్టుపై సీబీఐకి ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపామని, సీబీఐ జవాబు కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
Advertisement