DGP Prasad rao
-
సీమాంధ్రలో ఎన్నికలు ప్రశాంతం: డీజీపీ
హైదరాబాద్: చెదురుమదురు ఘటనలు మినహా సీమాంధ్రలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని డీజీపీ ప్రసాదరావు అన్నారు. టెక్నికల్ ఇబ్బందులు మినహా ఎక్కడా పోలింగ్‌కు ఇబ్బంది కలగలేదన్నారు. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం పలకజీడిలో రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. కడప జమ్మలమడుగు అడిషనల్ ఎస్పీ పోలీసులపై దాడి ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. చిత్తూరు నడవలూరులో మీడియాపై జరిగిన దాడి ఘటనలో కేసు నమోదు చేశామన్నారు. విశాఖపట్నం జిల్లా పలకజీడి ప్రాంతంలో ఓ పోలింగ్ కేంద్రంపై మావోయిస్టులు దాడి చేశారు. రెండు ఈవీఎంలు ఎత్తుకెళ్లి, వాటిని తగులబెట్టారు. అక్కడున్న పోలింగు సిబ్బందికి చెందిన ఓ కమాండర్ జీపును కూడా వారు తగలబెట్టారు. దీంతో ఇక్కడ రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించింది. -
కేవీపీపై రెడ్ కార్నర్ నోటిస్ అందింది: డీజీపీ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావుపై రెడ్‌కార్నర్ నోటీసు అందిందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. తమకు అందిన రెడ్ కార్నర్ నోటిస్ పై సీబీఐతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రసాదరావు అన్నారు. కేవీపీ ఎంపీ కనుక ప్రత్యేక పర్యవేక్షణ అవసరం లేదని ఓ ప్రశ్నకు సమాధానం తెలిపారు. టైటానియం ఖనిజం తవ్వకాల వ్యవహారంలో ఇంటర్‌పోల్ కేవీపీకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. కేవీపీపై ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు శుక్రవారం సీఐడీ అధికారులకు అందిన సంగతి తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పారిపోకుండా అతడి అప్పగింత ప్రక్రియ పూర్తయ్యే వరకు అదుపులో ఉంచుకోమని కోరిన ప్రొవిజినల్ అరెస్టుపై సీబీఐకి ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపామని, సీబీఐ జవాబు కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. -
సజావు ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
-
ఆడిటోరియం నిర్మాణం అభినందనీయం : డీజీపీ ప్రసాదరావు
జిల్లాతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్న పోలీస్‌బాస్ సాక్షి, నల్లగొండ తీవ్రవాదుల చేతిలో అసువులు బాసిన పోలీసు కుటుంబాల పిల్లలను ఆదుకునేందుకు ఆడిటోరియం నిర్మిం చడం అభినందనీయమని డీజీపీ ప్రసాదరావు అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 1.50 కోట్లతో నిర్మించిన ఎమిలినేటి మాధవరెడ్డి పోలీసు ఆడిటోరియం భవనాన్ని గురువారం డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడారు. తీవ్ర వాదుల చేతి లో జిల్లాకు చెందిన పోలీసులే ఎక్కువ మంది చనిపోయారని పేర్కొన్నారు. ఆడిటోరియం నిర్మాణానికి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపి నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. 1992-93లో తాను జిల్లా ఎస్పీ గా పనిచేసినపుడు సాగునీటి వనరులు పెరగలేదని, ఫ్లోరిన్ సమస్య ఉండేదని గుర్తుచేశారు. నల్లగొండ జిల్లా ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత హోంమత్రి మాధవరెడ్డితో ఉన్న అనుబంధంతోనే పోలీసు అమరుల కుటుంబాల పిల్లలను ఆదుకునేందుకే ఆడిటోరియం నిర్మాణానికి కృషిచేసినట్లు చెప్పారు. ఆడిటోరియానికి ఒక కమిటీని నియమించి వచ్చే ఆదాయం తో అమరుల కుటుంబాలకు తోడ్పాటునందిస్తామన్నారు. వారంలోపు మిర్యాలగూడెంలో మరో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్ చిరంజీవులు మాట్లాడుతూ ఆడిటోరియాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 14 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భవనాన్ని పట్టుదలతో పూర్తిచేయడం అభినందనీయమన్నారు. శిథిలావస్థకు చేరిన పోలీస్క్వార్టర్స్ స్థానంలో క్వార్టర్స్ నిర్మించేందుకు చొరవ చూపాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డీజీపీకి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉమామాధవరెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్రావు, దిలీప్‌కుమార్, ఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ శశిధర్‌రెడ్డి, ఎస్పీ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. డీజీపీకి ఘన సన్మానం పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డీజీపీ ప్రసాదరావును సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌గౌడ్, అమర్‌సింగ్, ఉపేందర్, స్వామి, సోమయ్య ఉన్నారు. బెటాలియన్‌లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన నల్లగొండ మండలం అన్నెపర్తి బెటాలియన్‌లో *10 లక్షలతో నిర్మించే రోడ్డుకు డీజీపీ ప్రసాదరావు గురువారం శంకుస్థాపన చేశారు. బెటాలియన్ సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. బెటాలియన్‌లో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ టి.చిరంజీవులు, ఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ శశీధర్‌రెడ్డి, ఎస్పీ ప్రభాకర్‌రావు, కమాండెంట్ బాబూజీ రావు, సీతారాం ఉన్నారు. -
ఎన్నికల నిర్వహణకు సిద్ధం: డీజీపీ
నల్లగొండ, న్యూస్‌లైన్: ఎన్నికలు నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. నల్లగొండలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 35వేల పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తరుణంలో పోలీస్‌శాఖను విభజించాలని కేంద్రం నుండి ఆదేశాలేవీ అందలేదన్నారు. ఎస్ఐ రిక్రూట్మెంట్లను హైకోర్టు తీర్పు ప్రకారం చేస్తామని తెలిపారు -
కిరణ్ రాజీనామా ఆమోదం
19వ తేదీ నుంచి అమల్లోకి: గవర్నర్ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని విజ్ఞప్తి మంత్రులు కూడా కొనసాగాలని సూచన సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామాను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం ఆమోదించారు. రాజీనామా ఫిబ్రవరి 19 నుంచే అమల్లోకి వచ్చినట్టు స్పష్టం చేశారు. ఆ వెంటనే రాజీనామా ఆమోదంపై గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేదాకా ఆపద్ధర్మ సీఎం గా కొనసాగాలని, ఆయన మంత్రివర్గ సహచరులు కూడా పదవుల్లో కొనసాగాలని గవర్నర్ కోరారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన మర్నాడు 19వ తేదీన కిరణ్ రాజీనామా చేయడం, గవర్నర్‌కు లేఖ సమర్పించడం తెలిసిందే. దానిపై రెండు రోజులుగా ఏ నిర్ణయం తీసుకోని గవర్నర్, రాజీనామాను ఆమోదించారు. కిరణ్, సహచర మంత్రుల రాజీనామాలు ఆమోదం పొందాయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేదాకా పదవుల్లో కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, తాను ఆపద్ధర్మ సీఎంగా కూడా కొనసాగలేనని రాజీనామా లేఖ సమర్పణ సందర్భంగానే గవర్నర్‌కు స్పష్టం చేయడం తెలిసిందే. తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం పొందే ప్రయత్నాల్లో తలమునకలై ఈ రెండు రోజులూ రాజీనామా అంశాన్ని కేంద్రం పట్టించుకోలేదు. కిరణ్ రాజీనామా అనంతర పరిస్థితులపై కేంద్రానికి గవర్నర్ నివేదిక కూడా అందించారు. రాష్ట్రపతి పాలనకు ఆయన సిఫార్సు చేసినట్టు సమాచారం. దానిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకునేదాకా రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ వెలువడ్డాక గానీ పరిస్థితి ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదని వివరించాయి. రెండో రోజూ ఇంటికే పరిమితం రాజీనామా చేసిన తర్వాత రెండో రోజైన శుక్రవారం కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంటికే పరిమితమయ్యారు. రెండో రోజు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులెవరూ కిరణ్‌ను కలుసుకోవడానికి రాలేదు. చిత్తూరుకు చెందిన కొందరు రెండవ స్థాయి కాంగ్రెస్ నేతలు మాత్రం నలుగురు ఆయన్ను కలిశారు. వారితో గంటపాటు మాట్లాడి నియోజకవర్గ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం డీజీపీ ప్రసాద్‌రావు పావుగంట పాటు కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. మీడియాతో మాట్లాడేందుకు డీజీపీ నిరాకరించడంతో వారి చర్చల సారాంశం తెలియరాలేదు. కిరణ్ రోజంతా టీవీ చూస్తూ ఢిల్లీ పరిణామాలను గమనించారని ఆయన సన్నిహితుడొకరు చెప్పారు. అలాగే జిల్లాల వారీగా నేతలకు ఫోన్లు చేస్తూ విభజన అనంతర పరిస్థితులను అంచనా వేశారని సమాచారం. కొత్త పార్టీ ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉందా? లేదా? అనే అంశాలను వారి నుంచి కిర ణ్ ఆరా తీశారని తెలుస్తోంది. -
పోలీసు విభజనపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖను రెండుగా విభజించే ప్రక్రియపై పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి డీజీపీ బి.ప్రసాదరావు శుక్రవారం హెడ్‌క్వార్టర్స్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారులతో చర్చించారు. ప్రధానంగా ఏయే విభాగాల్లో విభజన ఇబ్బందులు ఎదురవుతాయనే అంశంపైనే దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్ర స్థాయికేడర్ అయిన డీఎస్పీ నుంచి ఎస్పీ, ఆపై అధికారులను రెండు రాష్ట్రాలకు విభజించడంలోనే కొన్ని సమస్యలు ఎదురవుతున్నట్లు తెలిసింది. ఇందులో ఏ ప్రాంతానికి చెందినవారిని ఆ ప్రాంతానికి కేటాయిం చే అవకాశం ఉన్నప్పటికీ, ఎక్కువమంది అధికారులు ఒక ప్రాం తంవైపే మొగ్గు చూపితే సమస్య మొదలవుతుందని సీనియర్ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారులు ఏ ప్రాంతానికి చెందినవారో గుర్తించి అక్కడే పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. రాష్ట్ర కేడర్‌లోని ఇతర రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులకు వారి ఆప్షన్‌ను బట్టి కేటాయింపులు జరిగే అవకాశం ఉందని ఐపీఎస్ వర్గాలు తెలిపాయి. -
మరో 45 మంది డీఎస్పీల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి డీఎస్పీల బదిలీలు జరిగాయి. 45 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ప్రసాదరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 20 మంది ఇన్స్పెక్టర్లు పదోన్నతిపై డీఎస్పీలుగా నియమితులయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలు, నిబంధనల మేరకే బదిలీలు జరిగినట్లు అధికారులు తెలిపారు. డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉండటం వల్లే 20 మంది ఇన్స్పెక్టర్లకు పదోన్నతులు కల్పించామని శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ కౌముది తెలిపారు. 15 జిల్లాలకు కొత్త మైనారిటీ సంక్షేమ అధికారులు 15 జిల్లాలకు మైనారిటీల సంక్షేమ శాఖాధికారుల (డీఎండబ్ల్యూవో)ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన 19 మంది అధికారులను ప్రభుత్వం ఒక సంవత్సరంపాటు డెప్యుటేషన్‌పై మైనారిటీ శాఖకు బదిలీ చేసింది. దీంతో వారిని డీఎండబ్ల్యూవోలుగా నియమించారు. -
విద్యార్థుల్లో వైజ్ఞానిక స్ఫూర్తిని నింపాలి
లిఫ్ట్ ఇస్తారా.. సార్ నిత్యం ‘లెఫ్ట్..రైట్..లెఫ్ట్..రైట్’ అంటూ విధి నిర్వహణలో తలమునకలై ఉండే రాష్ట్ర పోలీస్ బాస్ ప్రసాదరావు కాసేపు స్టూడెంట్‌లా మారిపోయారు. విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. లిఫ్ట్ పనిచేసే విధానాన్ని డీజీపీకి వివరిస్తున్న ఓ విద్యార్థి. రాంగోపాల్‌పేట్, న్యూస్‌లైన్: విద్యార్థులకు విద్యతో పాటు వైజ్ఞానిక స్ఫూర్తిని చిన్ననాడే నింపాల్సిన బాధ్యత గురువులపై ఉందని రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రసాదరావు సూచించారు. మంగళవారం సికింద్రాబాద్ మహబూబ్ కళాశాల 150వ వార్షికోత్సవాలు, స్వామి వివేకానంద 150వ జయంతుత్సవాల్లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్, రిసోర్స్ సెంటర్, మ్యూజియమ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞానిక అంశాల్లో ప్రయోగాత్మకంగా వివరించడం మూలంగా వారిలో పాఠ్యాంశాలు సులభంగా అర్ధం కావడంతో పాటు అది వారిలో ఈ అంశాల్లో సరికొత్త అంశాలపై ఆలోచనా శక్తి కూడా పెరుగుతుందన్నారు. 150 ఏళ్లుగా ఉత్తమ విద్యాబోధనలతో ఇప్పటికీ అదే పంథాలో మహబూబ్ కళాశాల కొనసాగుతుండటం అభినందించదగ్గ విషయమన్నారు. ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ సైన్సు పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని కలిగించి దేశానికి ఉపయోగపడే మేధావులను తయారు చేయాలని సూచించారు. నేటి విద్యా వ్యవస్థలో నైతిక విలువలు బోధించడం లోపించడం మూలంగానే నేడు అనేక ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు ప్రజల్లో ఉండే మూఢనమ్మకాలు తొలగించేందుకు పలు రకాల అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ గోపాల్‌రెడ్డి, పాఠ శాల పాలక మండలి అధ్యక్షులు సీబీ నాంధేవ్, కార్యదర్శి డాక్టర్ విద్యారాణి, కరస్పాండెంట్ భగవత్ వారణాసీ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సత్య ప్రసాద్, ఎన్ఐఎన్ చీఫ్ సైంటిస్టు వి భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆసక్తిగా పరిశీలించిన డీజీపీ మహబూబ్ కళాశాలలో నూతనంగా ప్రారంభించిన సైన్స్ రిసోర్స్ సెంటర్, మ్యూజియంలో సైన్సు ప్రయోగాలకు చెందిన పలు నమూనాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఏర్పాటు చేసిన ఈ నమూనాలను డీజీపీ ఆసక్తిగా తిలకిస్తూ వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. స్వయంగా వాటి పనితీరును పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో ఓ మొక్కను నాటారు. -
పోలీసులకు వైద్యం చేయని ఆస్పత్రులపై చర్యలు
‘ఆరోగ్య భద్రత’ సమావేశంలో డీజీపీ ప్రసాదరావు సాక్షి, హైదరాబాద్: పోలీసులకు ఆరోగ్య భద్రత పథకం కింద ఒప్పందం కుదుర్చుకున్న ఆస్పత్రులు సకాలంలో వైద్యం అందించకుంటే వాటిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ బి.ప్రసాదరావు హెచ్చరించారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన ఆరోగ్య భద్రత పథకం వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం ద్వారా పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులకు, వారి తల్లిదండ్రులకూ వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య భద్రతకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు కేంద్రీయ నియంత్రణ విధానాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. సిబ్బంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు మెరుగు పరిచేందుకు భావవ్యక్తీకరణ నైపుణ్యం, ఆంగ్ల భాషపై ప్రత్యేక పాఠాలు చెప్పించనున్నామని.. ఇందుకు ఎడ్యుకేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. సర్వీసులో దీర్ఘకాలంగా ఉన్న సిబ్బందికి కూడా సొంతిల్లు లేకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగులందరూ కలిసి జిల్లా కేంద్రాలకు సమీపంలో స్థలాలు కొనుక్కుని గృహ నిర్మాణాలు చేపట్టే విధానం ఉంటే బాగుంటుందని డీజీపీ అభిప్రాయపడ్డారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కూ తాగునీటికోసం ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.