‘ఆరోగ్య భద్రత’ సమావేశంలో డీజీపీ ప్రసాదరావు
సాక్షి, హైదరాబాద్: పోలీసులకు ఆరోగ్య భద్రత పథకం కింద ఒప్పందం కుదుర్చుకున్న ఆస్పత్రులు సకాలంలో వైద్యం అందించకుంటే వాటిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ బి.ప్రసాదరావు హెచ్చరించారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన ఆరోగ్య భద్రత పథకం వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం ద్వారా పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులకు, వారి తల్లిదండ్రులకూ వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఆరోగ్య భద్రతకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు కేంద్రీయ నియంత్రణ విధానాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. సిబ్బంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు మెరుగు పరిచేందుకు భావవ్యక్తీకరణ నైపుణ్యం, ఆంగ్ల భాషపై ప్రత్యేక పాఠాలు చెప్పించనున్నామని.. ఇందుకు ఎడ్యుకేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. సర్వీసులో దీర్ఘకాలంగా ఉన్న సిబ్బందికి కూడా సొంతిల్లు లేకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగులందరూ కలిసి జిల్లా కేంద్రాలకు సమీపంలో స్థలాలు కొనుక్కుని గృహ నిర్మాణాలు చేపట్టే విధానం ఉంటే బాగుంటుందని డీజీపీ అభిప్రాయపడ్డారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కూ తాగునీటికోసం ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
పోలీసులకు వైద్యం చేయని ఆస్పత్రులపై చర్యలు
Published Sun, Jan 5 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement