Health safety scheme
-
ఒక్క ఆడపిల్ల ఉంటే రూ.2 లక్షలు
సిమ్లా: ఆడపిల్లల భ్రూణ హత్యల నివారణకు హిమాచల్‌ప్రదేశ్ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఒకే ఒక్క ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు రూ.2 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించింది. గతంలో ఒక్క ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు రూ.35 వేలు ఇన్సెంటివ్‌గా ఇచ్చే వారు. ఇప్పుడు దానికి 2 లక్షల రూపాయలకు పెంచినట్టుగా హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్స్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమానికి హాజరవడానికి వచ్చిన సీఎం సుఖు విలేకరులతో మాట్లాడారు. ఒక్క ఆడపిల్ల పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ పాటించే తల్లిదండ్రులకు లక్ష రూపాయలు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇక పిల్లలు వద్దు అనుకున్న వారికి మరో లక్ష రూపాయలు అందిస్తామని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌లో లింగ నిష్పత్తి 1000:950గా ఉంది. దేశంలో అత్యుత్తమ రాష్ట్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. -
ఆరోగ్య బీమా నేడు ప్రారంభం
న్యూఢిల్లీ: దేశంలోని 10.74 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై)ను ప్రధాని మోదీ నేడు జార్ఖండ్‌లో ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల చొప్పున బీమా కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని 8.03 కోట్ల కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లోని 2.33 కోట్ల కుటుంబాలు వెరసి దాదాపు 50 కోట్ల మంది ప్రజలు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. తొలుత ఈ పథకానికి ఆయుష్మాన్ భారత్–జాతీయ ఆరోగ్య పరిరక్షణ మిషన్(ఏబీ–ఎన్‌హెచ్‌పీఎం)గా నామకరణం చేసినప్పటికీ, ఆ తర్వాత పీఎంజేఏవైగా పేరు మార్చారు. ఈ పథకానికి 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అంగీకరించాయనీ, తెలంగాణ, పంజాబ్, ఒడిశా, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలు పీఎంజేఏవై అమలుకు ముందుకు రాలేదన్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు గుర్తింపు పత్రంగా ఆధార్ లేదా ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డు ఇస్తే సరిపోతుందన్నారు. ఈ పథకంలో తమ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు mera.pmjay.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చనీ, లేదంటే టోల్‌ఫ్రీ నంబర్ 14555కు కాల్ చేయవచ్చని వెల్లడించారు. -
పోలీసులకు వైద్యం చేయని ఆస్పత్రులపై చర్యలు
‘ఆరోగ్య భద్రత’ సమావేశంలో డీజీపీ ప్రసాదరావు సాక్షి, హైదరాబాద్: పోలీసులకు ఆరోగ్య భద్రత పథకం కింద ఒప్పందం కుదుర్చుకున్న ఆస్పత్రులు సకాలంలో వైద్యం అందించకుంటే వాటిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ బి.ప్రసాదరావు హెచ్చరించారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన ఆరోగ్య భద్రత పథకం వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం ద్వారా పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులకు, వారి తల్లిదండ్రులకూ వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య భద్రతకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు కేంద్రీయ నియంత్రణ విధానాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. సిబ్బంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు మెరుగు పరిచేందుకు భావవ్యక్తీకరణ నైపుణ్యం, ఆంగ్ల భాషపై ప్రత్యేక పాఠాలు చెప్పించనున్నామని.. ఇందుకు ఎడ్యుకేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. సర్వీసులో దీర్ఘకాలంగా ఉన్న సిబ్బందికి కూడా సొంతిల్లు లేకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగులందరూ కలిసి జిల్లా కేంద్రాలకు సమీపంలో స్థలాలు కొనుక్కుని గృహ నిర్మాణాలు చేపట్టే విధానం ఉంటే బాగుంటుందని డీజీపీ అభిప్రాయపడ్డారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కూ తాగునీటికోసం ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.