సిమ్లా: ఆడపిల్లల భ్రూణ హత్యల నివారణకు హిమాచల్‌ప్రదేశ్ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఒకే ఒక్క ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు రూ.2 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించింది. గతంలో ఒక్క ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు రూ.35 వేలు ఇన్సెంటివ్‌గా ఇచ్చే వారు. ఇప్పుడు దానికి 2 లక్షల రూపాయలకు పెంచినట్టుగా హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్ సింగ్ సుఖు చెప్పారు.
డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్స్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమానికి హాజరవడానికి వచ్చిన సీఎం సుఖు విలేకరులతో మాట్లాడారు. ఒక్క ఆడపిల్ల పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ పాటించే తల్లిదండ్రులకు లక్ష రూపాయలు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇక పిల్లలు వద్దు అనుకున్న వారికి మరో లక్ష రూపాయలు అందిస్తామని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌లో లింగ నిష్పత్తి 1000:950గా ఉంది. దేశంలో అత్యుత్తమ రాష్ట్రాల్లో మూడో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment