Incentive money
-
ఒక్క ఆడపిల్ల ఉంటే రూ.2 లక్షలు
సిమ్లా: ఆడపిల్లల భ్రూణ హత్యల నివారణకు హిమాచల్‌ప్రదేశ్ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఒకే ఒక్క ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు రూ.2 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించింది. గతంలో ఒక్క ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు రూ.35 వేలు ఇన్సెంటివ్‌గా ఇచ్చే వారు. ఇప్పుడు దానికి 2 లక్షల రూపాయలకు పెంచినట్టుగా హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్స్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమానికి హాజరవడానికి వచ్చిన సీఎం సుఖు విలేకరులతో మాట్లాడారు. ఒక్క ఆడపిల్ల పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ పాటించే తల్లిదండ్రులకు లక్ష రూపాయలు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇక పిల్లలు వద్దు అనుకున్న వారికి మరో లక్ష రూపాయలు అందిస్తామని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌లో లింగ నిష్పత్తి 1000:950గా ఉంది. దేశంలో అత్యుత్తమ రాష్ట్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. -
సీఎం జగన్ కలిసిన చెస్ క్రీడాకారిణి కోలగట్ల మీనాక్షి
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి కలిశారు. చిన్నారిని ప్రత్యేకంగా అభినందించిన సీఎం జగన్, అంతర్జాతీయ స్ధాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టేలా చదరంగంలో మరింతగా రాణించాలని సీఎం ఆకాంక్షించారు. మీనాక్షికి అవసరమైన విధంగా పూర్తిస్ధాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. మీనాక్షికి విశాఖపట్నంలో వెయ్యి చదరపు గజాల ఇంటిస్ధలం, ఆమె చెస్‌లో కెరీర్‌ను కొనసాగించేందుకు కార్పస్ ఫండ్ నుంచి రూ.1 కోటి నిధిని సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో రికార్డులు నెలకొల్పిన మీనాక్షి.. ఇటీవల ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2023 పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. వరల్డ్ నెంబర్ 1 అండర్ 12 గర్ల్స్ చెస్ 2023 (ఫిడే ర్యాంకింగ్స్), వరల్డ్ నెంబర్ 1 అండర్ 11 గర్ల్స్ చెస్ 2022, వరల్డ్ నెంబర్ 2 అండర్ 10 గర్ల్స్ చెస్ డిసెంబర్ 2021, ఉమెన్ ఫిడే మాస్టర్ 2022, ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ 2021 టైటిల్స్ గెలుచుకోవడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లలో పలు పతకాలు సాధించిన విషయాన్ని ముఖ్యమంత్రితో మీనాక్షి, తల్లిదండ్రులు పంచుకున్నారు. మీనాక్షి ప్రతిభను సీఎం ప్రశంసించారు. వివిధ క్రీడా రంగాల్లో ప్రతిభ కనపరిచి ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతలు అంతర్జాతీయ వేదికలపై చాటుతున్న క్రీడాకారులకు తమ ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చదవండి: ఆశా మాలవ్యకు సీఎం జగన్ అభినందనలు.. రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం -
బరువు తగ్గితే రూ.10 లక్షలు.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్
ముంబై: జెరోడా అనే ఆన్లైన్ బ్రోకరేజీ కంపెనీ ఉద్యోగులకు సీఈఓ నితిన్ కామత్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. బరువు తగ్గితే మంచి ఇన్సెంటివ్‌లు ఇస్తారట. అంతేకాదు, ఒక లక్కీ విజేతకు ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. ఇందుకోసం వారు రోజుకు కనీసం 350 క్యాలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా ఏడాది పాటు శ్రమించి లక్ష్యంలో 90 శాతం సాధించిన వారందికీ నెల వేతనం బోనస్‌గా ఇస్తారు! దీనికి తోడు రూ.10 లక్షల బంపర్ బొనాంజా ఉండనే ఉంది! దాంతో ఈ ఫిట్నెస్ చాలెంజ్‌ను సీరియస్‌గా తీసుకుని ఉద్యోగులంతా గట్టిగానే శ్రమిస్తున్నారట. అన్నట్టూ, ఎవరు ఏ మేరకు కొవ్వు కరిగిస్తున్నదీ కంపెనీ తాలూకు ఫిట్నెస్ ట్రాకర్ గమనిస్తుంటుందట. ఉద్యోగుల ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఈ కంపెనీకి కొత్తేమీ కాదట. 25 కంటే తక్కువ బీఎంఐ ఉన్న ఉద్యోగులకు ఇప్పటికే సగం నెల వేతనం బోనస్‌గా ఇస్తోంది!! వర్క్ ఫ్రం హోం వల్ల స్థూలకాయం తెచ్చుకుని అనారోగ్యం పాలు కావొద్దన్నదే తమ ఉద్దేశమంటున్నారు కామత్. కరోనా కాలంలో పెరిగిన బరువును తానెలా తగ్గించుకున్నదీ చెబుతూ ఉద్యోగులను మోటివేట్ చేస్తున్నారు. -
తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్వతారోహకుడు అంగోతు తుకారామ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. అతడి సాహస యాత్రను మెచ్చుకున్న సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం అందించారు. రంగారెడ్డి జిల్లా తక్కెళ్లపల్లి తండాకు చెందిన పర్వతారోహకుడు అంగోతు తుకారామ్ ఎవరెస్టు శిఖరంతో పాటు ఐదు ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. ఈ క్రమంలో ఏపీలోని తాడేపల్లిలో ఉన్న క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం జగన్‌ను తుకారాం కలిశాడు. తన పర్వతారోహణ వివరాలు తెలిపాడు. అభినందించిన అనంతరం తుకారామ్‌కు సీఎం జగన్ రూ.35 లక్షల చెక్కును అందించారు. ఏపీ సీఎం తనపై చూపిన ఆదరాభిమానాలకు, చేసిన ఆర్థిక సాయానికి జీవితాంతం రుణపడి ఉంటానని తుకారామ్ తెలిపాడు. ఇటీవల ‘సాక్షి’ తుకారామ్‌ను ఎక్స్‌లెన్స్ అవార్డుతో సత్కరించింది. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి -
పట్టు జారుతోంది
పట్టు రైతులకు ప్రోత్సాహకమివ్వని ప్రభుత్వం 12 సంవత్సరాలు గడిచిన అందని వైనం ఒక్క కోలారు జిల్లాకు రూ. 5.60 కోట్ల బకాయి కోలారు : పట్టు రైతులకు ప్రోత్సాహక ధనం ప్రకటించిన రాష్ర్ట ప్రభుత్వం ఏడాది గడిచినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఒక్క కోలారు జిల్లాలోని పట్టు రైతులకు రూ. 5.60కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు సమాచారం. కోలారు జిల్లాలో ఐదారు దశాబ్ధాలుగా పట్టుపరిశ్రమపై రైతులు ఆధారపడ్డారు. జిల్లాలోని వాతావరణ పరిస్థితులు పట్టు పరిశ్రమకు అనుకూలంగా ఉండడంతో అధిక శాతం రైతులు దీనిపై ఆధారపడ్డారు. ఇక్కడ పండించే పట్టులో బైవోల్టిన్, సీఆర్ఆర్, కోలార్ గోల్డ్ రకం ప్రఖ్యాతి గాంచాయి. జిల్లాలోని ఐదు తాలూకాల్లో 15,447 హెక్టార్లలో పట్టు పరిశ్రమ విస్తరించి ఉంది. కోలారు తాలూకాలోని 1,531 గ్రామాలలో 22,815 మంది రైతులు పట్టు పురుగులను పెంచుతున్నారు. వీరిలో 1,580 మంది మహిళా రైతులు ఉన్నారు. 2,045 మంది ఎస్సీలు, 879 మంది ఎస్టీలు, 54 మంది వికలాంగులు, 284 మంది మైనారిటీలు పట్టుపరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పట్టుపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా తగ్గించడంతో పట్టు గూళ్ల ధరలు గణనీయంగా పడిపోయి రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. మరో వైపు చైనా పట్టు దిగుమతి అధికం కావడంతో పట్టు రైతు మరింత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నాడు. దీంతో రైతులను ఆదుకునేందుకు మిశ్రతలి పట్టు కిలో ఒక్కంటికి రూ. పది, బైవోల్టిన్ కిలో ఒక్కంటికి రూ. 30 చొప్పున ప్రోత్సాహకాన్ని 2013లో అప్పటి రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించింది. ఇది రైతులకు కాస్త ఉపశమనం కలిగించింది. గత బడ్జెట్లో ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాన్ని పెంచింది. మిశ్రతలికి రూ. 30, బైవోల్టిన్కు రూ. 50 చొప్పున పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపు 2014 ఆగస్టు నుంచి అన్వయం కానుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్రోత్సాహకం ఇంకా అందకపోవడం వల్ల రైతులు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడలేక పోతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా 11,551 మెట్రిక్ టన్నుల పట్టును ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో 10,974 మెట్రిక్ టన్నులు మిశ్రతళి పట్టు అయితే, బైవోల్టిన్ 577 మెట్రిక్ టన్నులను మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ప్రభుత్వం బకాయి పడిన ప్రోత్సాహకం వివరాలు తాలూకా పెంపకందార్లు బకాయి (లక్షల్లో) కోలారు 8163 300.00 బంగారుపేట 3213 150.00 మాలూరు 1907 65.00 ముళబాగిలు 4983 16.00 శ్రీనివాసపురం 4549 35.00 మొత్తం 22815 560.00