
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్వతారోహకుడు అంగోతు తుకారామ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. అతడి సాహస యాత్రను మెచ్చుకున్న సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం అందించారు. రంగారెడ్డి జిల్లా తక్కెళ్లపల్లి తండాకు చెందిన పర్వతారోహకుడు అంగోతు తుకారామ్ ఎవరెస్టు శిఖరంతో పాటు ఐదు ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు.
ఈ క్రమంలో ఏపీలోని తాడేపల్లిలో ఉన్న క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం జగన్‌ను తుకారాం కలిశాడు. తన పర్వతారోహణ వివరాలు తెలిపాడు. అభినందించిన అనంతరం తుకారామ్‌కు సీఎం జగన్ రూ.35 లక్షల చెక్కును అందించారు. ఏపీ సీఎం తనపై చూపిన ఆదరాభిమానాలకు, చేసిన ఆర్థిక సాయానికి జీవితాంతం రుణపడి ఉంటానని తుకారామ్ తెలిపాడు. ఇటీవల ‘సాక్షి’ తుకారామ్‌ను ఎక్స్‌లెన్స్ అవార్డుతో సత్కరించింది.
చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి
Comments
Please login to add a commentAdd a comment