Angothu Tukaram
-
తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్వతారోహకుడు అంగోతు తుకారామ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. అతడి సాహస యాత్రను మెచ్చుకున్న సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం అందించారు. రంగారెడ్డి జిల్లా తక్కెళ్లపల్లి తండాకు చెందిన పర్వతారోహకుడు అంగోతు తుకారామ్ ఎవరెస్టు శిఖరంతో పాటు ఐదు ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. ఈ క్రమంలో ఏపీలోని తాడేపల్లిలో ఉన్న క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం జగన్‌ను తుకారాం కలిశాడు. తన పర్వతారోహణ వివరాలు తెలిపాడు. అభినందించిన అనంతరం తుకారామ్‌కు సీఎం జగన్ రూ.35 లక్షల చెక్కును అందించారు. ఏపీ సీఎం తనపై చూపిన ఆదరాభిమానాలకు, చేసిన ఆర్థిక సాయానికి జీవితాంతం రుణపడి ఉంటానని తుకారామ్ తెలిపాడు. ఇటీవల ‘సాక్షి’ తుకారామ్‌ను ఎక్స్‌లెన్స్ అవార్డుతో సత్కరించింది. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి -
సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం
సాక్షి, అమరావతి: తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు అంగోతు తుకారాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను తుకారాం కలిశాడు. ఈ సందర్భంగా తుకారామ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. తుకారాం స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తక్కెల్లపల్లి తండా. తుకారాం ఎవరెస్టు శిఖరంతో పాటు 5 ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించి సత్తా చాటాడు. చదవండి: రేపటి నుంచి తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం చదవండి: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల -
‘ఎవరెస్టు’ను అధిరోహించిన గిరిజన తేజం
యాచారం(ఇబ్రహీంపట్నం): గిరిపుత్రుడి సాహసయాత్ర విజయవంతమైంది. ప్రపంచంలోనే ఎల్తైన శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటిచెప్పాడు. అతడే అంగోత్ తుకారాం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లి తండాకు చెందిన తుకారాం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. ఏప్రిల్ 5న నేపాల్ నుంచి తుకారాం తన సాహసయాత్రను ప్రారంభించాడు. దాదాపు 50 రోజులపాటు ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించి తన జీవిత లక్ష్యాన్ని సాకారం చేసుకున్నాడు. ఈ నెల 22న 8,845 మీటర్ల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి అక్కడ జాతీయజెండాను ఎగురవేశాడు. 3 రోజుల క్రితమే ఎవరెస్టును అధిరోహించినప్పటికీ అక్కడ ప్రతికూల వాతావరణం ఉండటంతో బేస్‌క్యాంపు వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎవరెస్టును అధిరోహించినట్లు నేపాల్ ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో సర్టిఫికెట్లను అందజేయనున్నట్లు తుకారాం ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలిపాడు. ఈ సాహసయాత్రలో తాను ప్రాణాలతో వస్తానని అనుకోలేదని తెలియజేశాడు. శిఖరాన్ని అధిరోహించడానికి అన్నివిధాలుగా సహకరించిన ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రాంచంద్రునాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ లచ్చిరాం, రైల్వే చీఫ్ ఇంజనీర్ తౌర్యానాయక్, పారిశ్రామిక వేత్త సుధాకర్‌రావుల సహకారంతో ఎవరెస్టు యాత్రకు బయలుదేరాడు. తుకారాం.. పర్వతారోహణలో దిట్ట అంగోత్ రాందాసు, జంకుల దంపతుల నాలుగో సంతానమైన తుకారాం పర్వతారోహణలో దిట్ట. నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్‌లో శిక్షణ పొందాడు. 2016 జూన్ 2న మొదటిసారి హిమాచల్‌ప్రదేశ్‌లోని 17,145 అడుగుల నార్భో పర్వతా న్ని ఎక్కి తెలంగాణ జెండాను ఎగురేసి, బతుకమ్మ ఆడి రాష్ట్ర ఖ్యాతిని చాటాడు. 2017 జూన్ 2న ఉత్తరాఖండ్‌లో 19,091 అడుగుల రుదుగైరా పర్వతాన్ని అధిరోహించాడు. హిమాలయాల్లోని 20,187 అడుగుల స్టాక్‌కాంగ్రీ పర్వతాన్ని 2017 జూలై 15న అధిరోహించాడు. ఇలా పలు మంచు పర్వతాలు అలవోకగా అధిరోహించినందుకుగాను హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తుకారాం తన పేరు నమోదు చేసుకున్నాడు. 2018 జూలైలో సౌతాఫ్రికాలో 5,895 మీటర్ల కిలిమంజారో మంచు పర్వతాన్ని అధిరోహించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ల ప్రశంసలు పొందాడు. -
కొండంత కష్టం..!
- ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు సిద్ధమైన అంగోతు తుకారాం - 29 నుంచి షెడ్యూల్–సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీబ్లాక్ వద్ద పడిగాపులు సాక్షి, హైదరాబాద్: ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడాన్ని ఏమంత కష్టంగా భావించని ఆ యువకునికి సచివాలయంలో తనకు సంబంధించిన ఫైలు ఎక్కడుందో తెలుసుకోవడం అత్యంత క్లిష్టతరమైన సమస్యగా మారింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆమోదించిన ఫైలు కదా.. చకచ కా పరిగెడుతుందిలే అనుకుంటే, తీరా గడువు సమీపించే సమయానికి తన ఫైలు ఎక్కడుందో అధికారులకూ అంతుబట్టడం లేదంటూ సచివాలయంలోని సి–బ్లాక్ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కెళ్లపల్లి తండాకు చెందిన గిరిజన పుత్రుడు ఆంగోతు తుకారాం పర్వతారోహకుడు. నేషనల్ క్యాడెట్ కోర్సులో ప్రతిభ కనబరిచిన తుకారాం జమ్మూ కశ్మీర్‌లోని జవహర్లాల్ నెహ్రూ మౌంటెనీరింగ్ సంస్థలో మౌంటెనీరింగ్, ఎడ్వంచర్ కోర్సులను విజయవంతంగా పూర్తి చేశాడు. 2015 జూన్ 2న రాష్ట్రా వతరణ దినోత్సవం నాడు ఉత్తమ స్పోర్ట్స్‌మెన్‌షిప్ అవార్డు అందుకున్నాడు. జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్లలో బంగారు, రజత పత కాలను సాధించాడు. నాలుగేళ్లుగా మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోíహించాలని కలలుకంటున్న తుకారాంకు నాలుగు నెలల కిత్రం ఆ అవకాశం వచ్చింది. నేపాల్ లోని ఉన్నతాధికారుల నుంచి అందిన సమాచారం తో, పర్వతా రోహణ నిమిత్తం తనకు రూ.28 లక్షలు ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. పలువురు ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు తుకారాం దరఖాస్తును క్రీడాశాఖ మంత్రి పద్మారావు సీఎంఆర్ఎఫ్ విభాగానికి పంపారు. ఈనెల 20న సీఎం కార్యాలయం నుంచి తుకారాంకు ఫోన్ చేసిన అధికారులు మీ దరఖాస్తుకు సీఎం ఆమోదం తెలిపారని, రూ.25 లక్షలు ఇచ్చేందు కు అంగీకారం తెలిపారని చెప్పారు. ఈనెల 29నే పర్వతారోహణ షెడ్యూల్ ఉన్నందున ఈలోగానే చెక్కు వస్తుందని తుకారాం ఆశించాడు. అయితే వారం రోజులు గడచినా చెక్కు అందకపోయే సరికి ఆందోళనతో మంగళవారం సచివాలయానికి వచ్చా డు. సీఎం పేషీలో విచారిస్తే, స్పోర్ట్స్ విభాగానికి వెళ్లమన్నారు. అక్కడకు వెళితే రెవెన్యూ విభాగానికి, అక్కడ్నుంచి ముఖ్యమంత్రి పేషీకే పంపామని జవాబు వచ్చింది. సదరు ఫైలు తమవద్ద లేదంటూ ముఖ్యమంత్రి పేషీ అధికారులు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక, అక్కడే ఉన్న విలేకరులతో తనగోడు వెల్లబోసుకున్నాడు. ఎవరెస్ట్‌పై బతుకమ్మను ప్రతిష్టిద్దామనుకున్నా ఎవరెస్ట్ పర్వతంపై తెలంగాణ ప్రతీక అయిన బతుకమ్మను ప్రతిష్టిద్దా మని అనుకున్నా. ఈ నెల 29న నేపాల్ రాజధాని ఖాట్మండూ నుంచి షెడ్యూల్ ఖరారైంది. పర్వతారోహణ నిమిత్తం సీఎం రూ.25లక్షలు మంజూరు చేసినట్లు అధికారులు ఫోన్ చేసి చెప్పారు. నాలుగు రోజులుగా తిరుగుతున్నా. తీరా విచారిస్తే తన ఫైలు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదంటున్నారు. ‘దేవుడు వరమిచ్చినా పూజారులు కనికరించలేదు’ అన్నట్లుగా తయారైంది నా పరిస్థితి. – అంగోతు తుకారాం