girl chaild
-
ఒక్క ఆడపిల్ల ఉంటే రూ.2 లక్షలు
సిమ్లా: ఆడపిల్లల భ్రూణ హత్యల నివారణకు హిమాచల్‌ప్రదేశ్ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఒకే ఒక్క ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు రూ.2 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించింది. గతంలో ఒక్క ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు రూ.35 వేలు ఇన్సెంటివ్‌గా ఇచ్చే వారు. ఇప్పుడు దానికి 2 లక్షల రూపాయలకు పెంచినట్టుగా హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్స్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమానికి హాజరవడానికి వచ్చిన సీఎం సుఖు విలేకరులతో మాట్లాడారు. ఒక్క ఆడపిల్ల పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ పాటించే తల్లిదండ్రులకు లక్ష రూపాయలు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇక పిల్లలు వద్దు అనుకున్న వారికి మరో లక్ష రూపాయలు అందిస్తామని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌లో లింగ నిష్పత్తి 1000:950గా ఉంది. దేశంలో అత్యుత్తమ రాష్ట్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. -
తెలంగాణ: ఈ నలుగురు ‘యంగ్ అచీవర్స్’..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన నలుగురు విద్యార్థినులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కేంద్ర మానవ వనరుల విభాగం, కేంద్ర విద్యా విభాగం వర్చువల్ విధానంలో ‘యంగ్ అచీవర్స్’ పోటీని సోమవారం నిర్వహించింది. దేశవ్యాప్తంగా 75 మంది బాలికలు పోటీలో పాల్గొన్నారు. ఎంహెచ్ఆర్డీ సెక్రటరీ అనితా అగర్వాల్ సహా పలువురు కేంద్ర విద్యారంగ నిపుణులు నిర్వహించిన ఈ సెమినార్లో మన ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న బాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. నలుగురు బాలికలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీదేవసేన అభినందించారు. భయాన్ని అధిగమించి.. కె.సోను (మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల కేజీబీవీ)ది నిరుపేద కుటుంబం. తండ్రి వ్యవసాయదారుడు. ఆమె 5వ తరగతిలో ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. ఆన్లైన్ జూమ్ కోచింగ్ ద్వారా కేజీబీవీలో సీటు పొందింది. అక్కడ అంతా ఇంగ్లిష్ మాట్లాడుతుంటే భయపడింది. వార్డెన్ ఇతర టీచర్ల సాయంతో ఆ భయాన్ని అధిగమించింది. తర్వాత ఆమె ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించింది. ‘సైబర్’పై సమరం కషిష్ సింగ్.. హైదరాబాద్ గన్‌ఫౌండ్రీలోని జీజీహెచ్‌ఎస్‌లో 8వ తరగతి విద్యార్థిని. రాష్ట్ర ప్రభుత్వం, మహిళా రక్షణ విభాగం, తెలంగాణ పోలీసు, స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన సైబర్ కాంగ్రెస్‌లో శిక్షణ పొందింది. సైబర్ సెక్యూరిటీలో అత్యుత్తమ ప్రతిభను సొంతం చేసుకుంది. సైబర్ సెక్యూరిటీపై స్కూల్స్, తన పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. చదవండి: హైదరాబాద్: కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలతో తల్లి.. శానిటరీ ప్యాడ్స్ చేసి.. ధీరావత్ అనిత యాదాద్రి జిల్లా ముల్కలపల్లి జెడ్పీహెచ్ఎస్లో టెన్త్ చదువుతోంది. తండాల్లో ఉండే గిరిజన మహిళలు రుతుస్రావ సమయంలో సాధారణ బట్టవాడుతూ అనారోగ్యానికి గురవుతున్నారు. వారి వేదనను దగ్గర్నుంచి చూసిన ఈ బాలిక... స్థానికంగా లభించే వేపాకులు, మెంతులు, కొన్ని రకాల పూలు, పసుపు పొడి, వృథా పేపర్లను వాడి శానిటరీ ప్యాడ్స్‌ను తయారుచేసి అందించింది. ‘వలస’ వెతలపై.. జి.శ్రీజ.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కుర జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. 6వ తరగతి నుంచి సామాజిక ఇతివృత్తంతో కథలు రాసేది. 20 కథలతో ఓ పుస్తకం కూడా ప్రచురితమైంది. కరోనా సమయంలో ఆమె రాసిన వలస కూలీలు కథనం రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందింది. ఇద్దరు తెలుగు బాలలకు ‘బాల పురస్కారాలు’ ప్రదానం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఇద్దరు బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు ప్రదానం చేశారు. సోమవారం వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో 2021–2022కి గాను 29 మంది రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీతలతో ప్రధాని మోదీ మాట్లాడారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా సర్టిఫికెట్లు అందించారు. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన తేలుకుంట విరాట్ చంద్రతోపాటు ఏపీకి చెందిన గురుగు హిమప్రియ ఈ పురస్కారాలను అందుకున్నారు. గత మార్చిలో విరాట్ ఆఫ్రికా ఖండంలో ఎత్తైన కిలీ మంజారో పర్వతాన్ని అధిరోహించాడు. కాగా, జమ్మూలోని సుంజువన్ మిలిటరీ క్యాంపుపై టెర్రరిస్టుల దాడిలో చాకచక్యంగా వ్యవహరించి ధైర్యసాహసాలు ప్రదర్శించిన గురుగు హిమప్రియకూ ఈ పురస్కారం అందించారు. వీళ్లు ఈ నెల 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొననున్నారు. -
పసికూనపై పైశాచికం
భువనేశ్వర్ : వయసుతో నిమిత్తం లేకుండా పసికందు నుంచి పండు ముదుసలులపైనా కామాంధులు విరుచుకుపడుతున్న ఉదంతాలు కొనసాగుతున్నాయి. ఒడిషాలో 17 నెలల చిన్నారిపై స్వయంగా బంధువే లైంగిక దాడికి తెగబడిన ఘటన వెలుగుచూసింది. మయూర్భంజ్లోని కుంటా గ్రామంలో ఈనెల 5న ఈ ఘోరం చోటుచేసుకోగా చిన్నారని వైద్య పరీక్షకు తరలించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డీఎస్పీ ఎస్ మహాపాత్ర తెలిపారు. -
చెలరేగిన మృగాళ్లు
తుమకూరు: కామాంధులు చెలరేగిపోయారు. బాలికకు సినిమా చూపిస్తానని చెప్పి పాడుబడిన ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లి ఐదుగురు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని యల్లాపుర గ్రామం సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాలిక స్నేహితుడు హరీష్‌తో పాటు మధు, కేశవ్, చిదానంద, చందు ఈ ఘోరానికి పాల్పడ్డారు. బాలికతో హరీష్ స్నేహంగా ఉండేవాడు. అతని మిత్రులందరూ కలిసి ఈ పన్నాగానికి కుట్ర పన్నారు. అతడు ఆమెను ఆటోలో ఎక్కించుకుని సినిమాకని బయల్దేరాడు. మార్గమధ్యంలో అతని స్నేహితులు కూడా ఆటోలో వచ్చారు. అనంతరం యల్లాపుర సమీపంలో ఉన్న ఓ పాడు బడిన కర్మాగారంలోకి తీసుకెళ్లి ఘోరానికి ఒడిగట్టి పరారయ్యారు. బాధితురాలు తన బంధువుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హరీష్, చిదానందలు దొరికిపోగా, మిగతావారి కోసం గాలిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న హరీష్, చిదానంద్ -
ఐదురోజుల ఆడ శిశువును వదిలివెళ్లిన తల్లి
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆసుపత్రి అధికారులు తెనాలిఅర్బన్ (గుంటూరు) : పొత్తికడుపులో బాధ మెలిపెడుతున్నా.. అంతులేని ఆవేదనను మునిపంటి కింద బిగపట్టి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి పురిటిలోనే వదిలేసి వెళ్లింది. పట్టుమని నాలుగు రోజులు కూడా నిండకుండా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డకు కడుపు నింపకుండా వదిలివెళ్లిందంటే ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ... ఆ పాపను చూసిన వారు మాత్రం అయ్యో పాపం... అని అనుకోక మానరు. ఈ ఉదంతం తెనాలి జిల్లా వైద్యశాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. వైద్యుల కథనం ప్రకారం గత నెల 27వ తేదీన 25 ఏళ్ల వయస్సు ఉన్న గర్భిణి ప్రసవం నిమిత్తం జిల్లా వైద్యశాలకు వచ్చింది. అదే రోజు పురిటి నొప్పులు రావడంతో వైద్యులు ప్రసవం చేసి ఆడ శిశువును బయటకు తీశారు. మంగళవారం వరకు శిశువుతో ఉన్న ఆమె అదే రోజు రాత్రి శిశువును ప్రసూతి వార్డులోనే వదిలివేసి వెళ్లిపోయింది. ఈ విషయం గమనించిన సిబ్బంది వైద్యశాల సూపరింటెండెంట్ సులోచనకు ఫిర్యాదు చేశారు. శిశువును చిక్సిత నిమిత్తం ఎస్ఎన్సీయు వార్డుకు తరలించారు. అక్కడ ఉన్న నర్సులే శిశువు ఆలనా పాలనా చూస్తున్నారు. మహిళ కోసం గాలించినా ఆమె ఆచూకీ తెలియరాలేదని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరే ముందు తన పేరు పెచ్చముడి అంజలి అని, తన భర్త పేరు గోపాల్ అని, విజయవాడ టూటౌన్ పరిధిలో నివసిస్తున్నట్లు కేస్‌షీట్‌లో పేర్కొంది. స్టాఫ్ నర్సు స్వర్ణలత, ఆర్ఎంవో డాక్టర్ సురేష్ త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల్లో శిశువును శిశుసంక్షేమ శాఖాధికారులకు అప్పగించే అవకాశం ఉంది. -
నాల్గోసారి ఆడపిల్ల పుట్టిందని..
వేంపల్లె: అప్పుడే పుట్టిన ఆడపిల్లను వదలించుకునేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకు పోలీసులు, వైద్యులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సంఘటన వైఎస్సార్ కడపజిల్లా వెంపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. మండలంలోని బక్కన్నపల్లెకు చెందిన హరిత, బాలాజీ నాయక్ దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మళ్లీ ఈ రోజు జరిగిన కాన్పులో కూడా అనారోగ్యంగా ఉన్న ఆడపిల్ల పుట్టడంతో శిశువును వదిలించుకునేందుకు ప్రయత్నించారు. ఆస్పత్రిలో వదిలేసి వెళ్ల్లేందుకు ప్రయత్నిస్తుండటాన్ని గుర్తించిన వైద్యులు పోలీసుల సాయంతో దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించి అనారోగ్యంగా ఉన్న ఆడపిల్లను మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
కన్నపేగుకు ఖరీదు..?
♦ పసికందు రూ. 2 లక్షలకు విక్రయం.. ♦ ఎట్టకేలకు శిశువిహార్‌కు తరలించిన అధికారులు మంచాల: పోషణ భారమనుకున్నారో.. లేక ఆడపిల్ల అనుకున్నారో ఏమో ఆ తల్లిదండ్రులు తమ కన్నపేగుకు ఖరీదు కట్టి విక్రయించారు. ఎట్టకేలకు ఐసీడీఎస్ అధికారులు శిశువును శిశు విహార్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండలేమూర్‌లో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బండలేమూర్కు చెందిన పద్మకు ఆరేళ్ల క్రితం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం చింతపల్లి పరిధిలోని బండకింది తండాకు చెందిన రాజుతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈక్రమంలో గత జనవరి 1న పద్మ తిరిగి ఆడపిల్లను ప్రసవించింది. పాప పుట్టిన నాలుగు రోజులకే రూ. 2 లక్షలకు ఘట్కేసర్ మండలం అన్నోజీగూడకు చెందిన వెంకన్నకు విక్రయించారు. అయితే, స్వగ్రామంలో ఎవరికీ అనుమానం రాకుండా పద్మ తన పుట్టిల్లు బండలేమూర్ వచ్చింది. గతంలో కూడా పద్మ, రాజు దంపతులు తమ మూడో కూతురును అప్పట్లో రూ.70 వేలకు విక్రయించారు. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పాపను శిశు విహార్‌కు తరలించారు. అయితే తిరిగి పద్మ ఆడపిల్లకు జన్మనివ్వడంతో ఆమెపై ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. అయినా పద్మ తన పుట్టింటికి వచ్చి శిశువును విక్రయించింది. ఈ విషయం తెలుసుకున్న చింతపల్లి ఐసీడీఎస్ అధికారి లావణ్య, సూపర్వైజర్లు సత్యమ్మ, సుగుణ ఇబ్రహీంపట్నం ఐసీడీ ఎస్ అధికారుల సహకారంతో విచారణ మొదలు పెట్టగా పుట్టిన నాలుగోరోజునే పాపను విక్రయించినట్లు తేలింది. దీంతో పద్మ, రాజు దంపతులతోపాటు వారి కుటుంబీకులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. తాము శిశువును విక్రయించలేదని, కేవలం పెంచుకోవడానికి మాత్రమే ఇచ్చామని దంపతులు అన్నోజిగూడకు చెందిన వెంకన్న అడ్రస్ ఇచ్చారు. పోలీసుల సహకారంతో అధికారులు ఆ పాపను తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు నగరంలోని శిశు విహార్‌కు తరలించారు. అయితే, తాను పాపను కొనుగోలు చేయలేదని, పెంచుకోవడానికి మాత్రమే తీసుకున్నానని మల్లయ్య అధికారులకు తెలిపాడు.