నాల్గోసారి ఆడపిల్ల పుట్టిందని.. | police counseling to parents | Sakshi
Sakshi News home page

నాల్గోసారి ఆడపిల్ల పుట్టిందని..

Apr 7 2016 1:23 PM | Updated on Aug 21 2018 7:17 PM

అప్పుడే పుట్టిన ఆడపిల్లను వదలించుకునేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకు పోలీసులు, వైద్యులు కౌన్సెలింగ్ నిర్వహించారు.

వేంపల్లె: అప్పుడే పుట్టిన ఆడపిల్లను వదలించుకునేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకు పోలీసులు, వైద్యులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సంఘటన వైఎస్సార్ కడపజిల్లా వెంపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. మండలంలోని బక్కన్నపల్లెకు చెందిన హరిత, బాలాజీ నాయక్ దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మళ్లీ ఈ రోజు జరిగిన కాన్పులో కూడా అనారోగ్యంగా ఉన్న ఆడపిల్ల పుట్టడంతో శిశువును వదిలించుకునేందుకు ప్రయత్నించారు. ఆస్పత్రిలో వదిలేసి వెళ్ల్లేందుకు ప్రయత్నిస్తుండటాన్ని గుర్తించిన వైద్యులు పోలీసుల సాయంతో దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించి అనారోగ్యంగా ఉన్న ఆడపిల్లను మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement