
సీమాంధ్రలో ఎన్నికలు ప్రశాంతం: డీజీపీ
చెదురుమదురు ఘటనలు మినహా సీమాంధ్రలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని డీజీపీ ప్రసాదరావు అన్నారు.
హైదరాబాద్: చెదురుమదురు ఘటనలు మినహా సీమాంధ్రలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని డీజీపీ ప్రసాదరావు అన్నారు. టెక్నికల్ ఇబ్బందులు మినహా ఎక్కడా పోలింగ్‌కు ఇబ్బంది కలగలేదన్నారు. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం పలకజీడిలో రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. కడప జమ్మలమడుగు అడిషనల్ ఎస్పీ పోలీసులపై దాడి ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. చిత్తూరు నడవలూరులో మీడియాపై జరిగిన దాడి ఘటనలో కేసు నమోదు చేశామన్నారు.
విశాఖపట్నం జిల్లా పలకజీడి ప్రాంతంలో ఓ పోలింగ్ కేంద్రంపై మావోయిస్టులు దాడి చేశారు. రెండు ఈవీఎంలు ఎత్తుకెళ్లి, వాటిని తగులబెట్టారు. అక్కడున్న పోలింగు సిబ్బందికి చెందిన ఓ కమాండర్ జీపును కూడా వారు తగలబెట్టారు. దీంతో ఇక్కడ రీపోలింగ్కు ఈసీ ఆదేశించింది.