
ఎన్నికల నిర్వహణకు సిద్ధం: డీజీపీ
ఎన్నికలు నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. నల్లగొండలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు.
నల్లగొండ, న్యూస్‌లైన్: ఎన్నికలు నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. నల్లగొండలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 35వేల పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తరుణంలో పోలీస్‌శాఖను విభజించాలని కేంద్రం నుండి ఆదేశాలేవీ అందలేదన్నారు. ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్లను హైకోర్టు తీర్పు ప్రకారం చేస్తామని తెలిపారు