పోలీసు విభజనపై కసరత్తు | Exercise of the police divisions | Sakshi
Sakshi News home page

పోలీసు విభజనపై కసరత్తు

Published Sat, Feb 22 2014 1:26 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Exercise of the police divisions

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖను రెండుగా విభజించే ప్రక్రియపై పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి డీజీపీ బి.ప్రసాదరావు శుక్రవారం   హెడ్‌క్వార్టర్స్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారులతో చర్చించారు. ప్రధానంగా ఏయే విభాగాల్లో విభజన ఇబ్బందులు ఎదురవుతాయనే అంశంపైనే దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్ర స్థాయికేడర్ అయిన డీఎస్పీ నుంచి ఎస్పీ, ఆపై అధికారులను రెండు రాష్ట్రాలకు విభజించడంలోనే కొన్ని సమస్యలు ఎదురవుతున్నట్లు  తెలిసింది.
 
  ఇందులో ఏ ప్రాంతానికి చెందినవారిని ఆ ప్రాంతానికి కేటాయిం చే అవకాశం ఉన్నప్పటికీ, ఎక్కువమంది అధికారులు ఒక ప్రాం తంవైపే మొగ్గు చూపితే సమస్య మొదలవుతుందని సీనియర్ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారులు ఏ ప్రాంతానికి చెందినవారో గుర్తించి అక్కడే పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. రాష్ట్ర కేడర్‌లోని ఇతర రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులకు వారి ఆప్షన్‌ను బట్టి కేటాయింపులు జరిగే అవకాశం ఉందని ఐపీఎస్ వర్గాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement