హైకోర్టును ఆశ్రయించిన కేవీపీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో టైటానియం కేసులో ఇంటర్ పోల్ ద్వారా అమెరికా జాతీయ క్రైం బ్యూర్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటిస్ అంశంపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు హైకోర్టును ఆశ్రయించారు.
రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా తన అరెస్ట్‌ను ఆపాలంటూ కేవీపీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. కేవీపీపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ పోలీసులకు సీబీఐ లేఖ పంపినట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.