Red Corner
-
ఫోన్ ట్యాపింగ్ లో కీలక మలుపు నిందితులకు రెడ్ కార్నర్..
-
జైషే చీఫ్ మసూద్‌పై రెడ్ కార్నర్ నోటీసు
న్యూఢిల్లీ : పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి, జైషే ఈ మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కు ఇంటర్ పోల్ మంగళవారం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. మసూద్ తో పాటు అతడి సోదరుడు అబ్దుల్ రవూఫ్‌లపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది. అలాగే ఇంటర్‌పోల్ ఈ కేసులో మరో ఇద్దరు షాహిద్ లతిఫ్, ఖషీఫ్ జాన్‌పై కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే యోచనలో ఉంది. ఈ ఏడాది జనవరి 2వ తేదీన పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులు, ఏడుగురు కమెండోలు మృతి చెందారు. ఇక పాకిస్థాన్‌లో ఉంటూనే ఈ దాడికి సూత్రధారిగా వ్యవహరించిన మసూద్ అక్కడి నుంచే ఉగ్రవాదులను పంపాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో తేల్చింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంటును సీబీఐ ఇంటర్ పోల్ కు పంపి వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా కోరింది. దీనిపై స్పందించిన ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది. -
మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులివ్వండి..
ఇంటర్‌పోల్‌కు సీబీఐ లేఖ న్యూఢిల్లీ: భారత్‌లో రూ.9,000 కోట్ల మేర బ్యాంకింగ్ రుణ ఎగవేతలు, అక్రమ ధనార్జన వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ... ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా మరింత సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన కోసం రెడ్ కార్నర్ (అరెస్ట్ వారెంట్) నోటీస్ జారీ చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గ్లోబల్ పోలీస్- ఇంటర్‌పోల్‌కు ఒక లేఖ రాసింది. ముంబైలో రూ.900 కోట్ల ఐడీబీఐ రుణ ఎగవేత కేసుపై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా సీబీఐ ఈ లేఖ రాసింది. ఇంటర్‌పోల్ సభ్యదేశాలకు చెందిన ఒక వ్యక్తి నేరం చేసి ఆయా సభ్యదేశాల్లో ఎక్కడ దాక్కున్నా... రెడ్‌కార్నర్ నోటీసు జారీ... అనంతరం అరెస్ట్‌చేసి... చట్టం ముందు నిలబెట్టడం ఇంటర్‌పోల్ లక్ష్యం. తమ దేశ పాస్‌పోర్ట్‌ను కలిగిఉన్న వ్యక్తిని దేశం నుంచి బహిష్కరించడం కుదరదని, అవసరమైతే నేరస్తుల అప్పగింత ఒప్పందం పరిధిలో మాల్యాను అప్పగించేందుకు సహకరిస్తామని బ్రిటన్ పేర్కొన్న నేపథ్యంలో సీబీఐ చర్య ప్రాధాన్యం సంతరించుకుంది. -
హైకోర్టును ఆశ్రయించిన కేవీపీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో టైటానియం కేసులో ఇంటర్ పోల్ ద్వారా అమెరికా జాతీయ క్రైం బ్యూర్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటిస్ అంశంపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు హైకోర్టును ఆశ్రయించారు. రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా తన అరెస్ట్‌ను ఆపాలంటూ కేవీపీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. కేవీపీపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ పోలీసులకు సీబీఐ లేఖ పంపినట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.