KVP
-
హస్తినకు ఎక్స్అఫీషియో పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో తలెత్తిన ఎక్స్ అఫీషియో ఓటు వివాదం హస్తినకు చేరింది. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు ఎక్కడ ఓటు వేయాలనే విషయం పై దుమారం రేగింది. తమకు తెలంగాణ లో ఎక్స్ అఫీషియో ఓటు ఉందని ఇద్దరూ గట్టిగా వాదిస్తుండటంతో స్పష్టత కో రుతూ ఎస్ఈసీ రాజ్యసభ సెక్రటేరియట్ కు అధికారిక లేఖ రాసింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యంతరం ఏపీకి కేటాయించిన ఎంపీ కేకే రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ పురపాలికలో ఎక్స్ అఫీషియో ఓటేయడం సరికాదంటూ కాంగ్రెస్, బీజేపీ అభ్యంతరం తెలిపాయి. సూర్యాపేట జిల్లా నేరెడుచర్ల మున్సిపాలిటీలో ఏపీకి చెందిన ఎంపీ కేవీపీని ఎక్స్అ ఫీషియో సభ్యుడిగా నమోదుచేశాక, దా నిని మొదట నేరెడుచర్ల మున్సిపల్ కమిష నర్ తిరస్కరించారు. ఈ అంశాన్ని కాంగ్రె స్ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లడంతో పా టు ఎస్ఈసీని ఆశ్రయించగా ఆయనకు అ క్కడ ఓటు హక్కు కల్పిస్తూ ఎస్ఈసీ ని ర్ణయం తీసుకుంది. మధ్యలో జాప్యంతో చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక మరుసటిరోజుకు వాయిదా పడింది. దీనిపై ఎస్ఈసీ అసంతృప్తి తెలపడంతో సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ బదిలీ, నేరెడుచర్ల ఇన్చార్జీ మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేస్తూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. నేరెడుచర్ల చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ మొదలయ్యాక కొత్తగా ఎమ్మెల్సీ శేరీ సుభాష్‌రెడ్డిని ఎక్స్ అఫీషియోసభ్యుడిగా చేర్చడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. చివరకు ఈ ఎన్నికను ఆ పార్టీ బహిష్కరించడంతో కేవీపీ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. తెలంగాణకు కేవీపీ.. ఏపీకి కేకే కేవీపీని తెలంగాణకు, కేకేను ఏపీకి కేటాయించారని, తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన 2020 డైరీలోనూ, కేవీపీ తెలంగాణకు చెందుతారని రాజ్యసభ వెబ్సైట్లో ఉందని ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. తుక్కుగూడలో కేకే తమ ఓటుహక్కును వినియోగించుకోగా, కేవీపీ కూడా నేరెడుచర్లలో ఓటేసి ఉంటే వివాదం సంక్లిష్టంగా తయారై ఉండే దని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మున్సిపోల్స్ నిర్వహణ సరిగా లేదని అధికారపక్షానికి అనుకూలంగా ఎస్ ఈసీ వ్యవహరిస్తోందని కాంగ్రెస్, బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌పార్టీ ఏకంగా కమిషనర్‌ను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సెక్రటేరియట్ నుంచి కేవీపీ, కేకే ఎక్స్అఫీషియో సభ్యత్వాలపై ఎలాంటి వివరణ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
పోస్టు ఆఫీసు డిపాజిట్లకూ ఆధార్
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్‌ను మరింత విస్తృతిలోకి తీసుకురావాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం, అన్నింటికీ దీన్ని ఆధారం చేస్తూ వెళ్తోంది. ప్రస్తుతం 12 అంకెల ఈ ఆధార్‌ను అన్ని పోస్టు ఆఫీసు డిపాజిట్లకు, పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్, కిషాన్ వికాస్ పాత్రలకు తప్పనిసరి చేసింది. ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌ను సమర్పించడానికి 2017 డిసెంబర్ 31ను తుది గడువుగా విధించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీచేసిన నాలుగు గెజిట్ నోటిఫికేషన్లలో ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పోస్టు ఆఫీసుల్లో డిపాజిట్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్‌ను సమర్పించని వారు, ప్రస్తుతం ఆధార్ నెంబర్‌ను సంబంధిత పోస్టు ఆఫీసు సేవింగ్స్ బ్యాంకు లేదా డిపాజిట్ ఆఫీసు వద్ద సమర్పించాలని ఓ నోటిఫికేషన్లో తెలిపింది. అన్ని బ్యాంకు డిపాజిట్లకు, మొబైల్ ఫోన్ సిమ్‌లకు, పలు ప్రభుత్వ పథకాలకు ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలకు ఆధార్‌ను సమర్పించే గడువును సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగించారు. ఆధార్ అన్నింటికీ తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆధార్ నెంబర్ లేని వాళ్ల కోసం ప్రభుత్వం ఎన్రోల్మెంట్ సెంటర్లను కూడా తెరచింది. 2017 డిసెంబర్ 31 వరకు వారు ఆధార్‌ను ఎన్రోల్ చేసుకుని, ఈ నెంబర్‌ను పొందాల్సి ఉంటుంది. -
ఏ లబ్ధి ఆశించి ‘ప్రైవేటు’కు కట్టబెట్టాలని చూస్తున్నారు?
భావనపాడు పోర్టుపై బాబుకు కేవీపీ లేఖ సాక్షి, అమరావతి/ న్యూఢిల్లీ: ఏ ప్రయోజనం ఆశించి శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు అభివృద్ధి పనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం చంద్రబాబును రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శనివారం సీఎంకు లేఖ రాశారు. ప్రభుత్వరంగంలో కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)-డీబీఎఫ్‌వోటీ పద్ధతిలో అభివృద్ధి చేయాలనుకోవడం ఆశ్చర్యకరమన్నారు. గతేడాది డిసెంబర్ 5న విజయ వాడ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన సందర్భం గా కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ భావనపా డు పోర్టును ప్రైవేటీకరణ చేయొద్దని, నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగిస్తే 25 నుంచి 30 శాతం లాభాన్ని రాష్ట్రాని కిస్తానని చెప్పడాన్ని ఆయన గుర్తుచేశారు. -
ప్రజల గుండెల నుంచి తొలగించలేవు:కేవీపీ
విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించిన చోటు నుంచి తొలగించిన సీఎం చంద్రబాబు కోట్లాది ప్రజల హృదయాల్లో నుంచి ఆయన్ను తొలగించలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. సీఎం తన చౌకబారు పనులను మానుకుని వెంటనే విగ్రహాన్ని పోలీస్ కంట్రోల్ రూం సెంటర్లో పునః ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని ఆంధ్రరత్నభవన్లో పార్టీ నేతలు దేవినేని నెహ్రూ, మల్లాది విష్ణు, కొలనుకొండ శివాజీ, దేవినేని అవినాష్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు అనువుగా ఆరోగ్య శ్రీ పథకాన్ని రూపకల్పన చేసినా, ఆపదలో ఉన్న వారికి సత్వర వైద్య సాయం అందేలా ఆసుపత్రులకు తరలించేందుకు 108 అంబులెన్స్ సేవలు ప్రారంభించినా, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినా.. వైఎస్‌ను ప్రజల గుండెల్లో నుంచి తీసి వేయలేరనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. మైనారిటీలకు విద్య, వైద్యరంగాల్లో రిజర్వేషన్లు కల్పించిన, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేదలకు ఉన్నత విద్య అందించిన రాజశేఖరరెడ్డి ప్రజల మదిలో చిరకాలం ఉంటారని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్తును పొందుతున్న కోట్లాది రైతుల హృదయాల్లోంచి వైఎస్‌ను చంద్రబాబుతో సహా ఎవ్వరూ తొలగించలేరన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. పోగాలం దాపురించినపుడు ఎవరైనా కనరు, వినరని... ఐదు లక్షల మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు అహంకార ధోరణికి ఇది అద్దంపడుతోందని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినా చంద్రబాబు గుండెల్లో నిద్రపోయి ఆయనకు బుద్ధి వచ్చేలా చేస్తారన్నారు. గోదావరి నది నీళ్లను పట్టిసీమ ద్వారా కష్ణా నదికి తీసుకొచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు వాస్తవాలను గమనించాల్సిన అవసరం ఉందన్నారు. రాజశేఖరరెడ్డి పోలవరం కుడికాలువ నిర్మించకపోతే పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు కృష్ణాకు ఎలా వచ్చేవో సమాధానం చెప్పాలన్నారు. పులిచింతల ప్రాజెక్టు కూడా రాజశేఖరరెడ్డి చలవేనని అన్నారు. గోదావరి నీళ్లు కృష్ణాలో ఎలా కలిశాయో పోలవరం కుడి కాల్వ వెంట ఉన్న ప్రజలందరికీ తెలుసని స్పష్టం చేశారు. చంద్రబాబును ప్రపంచంలో ఎవ్వరూ మోసం చేయలేరని, ఆయన ఎవ్వరినీ నమ్మరు కాబట్టే ఇది సాధ్యమన్నారు. ఎవరైనా మరొకరిని నమ్మితేనే మోసగించగలరని అన్నారు. చంద్రబాబు నమ్మిన వారినందరినీ మోసం చేశారని చెప్పారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచారని, తోడల్లుడికి ఉపముఖ్యమంత్రి పదవి అంటూ మోసం చేశారని చెప్పారు. బావమరిదిని ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసి ఆ తరువాత ఎన్నికలు జరగకుండా అడ్డుకుని ఆరు నెలల్లోనే ఇంటికి పంపించారని అన్నారు. బావమరిదికి నువ్వే కాబోయే పార్టీ అధ్యక్షుడివి, బీ ఫారంలు వచ్చే ఎన్నికల్లో నీ చేత్తోనే ఇస్తావని చెప్పి చివరకు మోసం చేశారని వివరించారు. -
కోడెలకు కేవీపీ మరో లేఖ
హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని వెంటనే అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావుకు ఎంపీ కేవీపీ రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కోడెల శివప్రసాద్‌కు కేవీపీ ఆదివారం లేఖ రాశారు. ఇదే అంశంపై తాను గతంలో మీకు రాసిన లేఖ అందలేదని మీరు తెలిపారు.... దీనిపై ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదని లేఖలో కేవీపీ పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆరో వర్థంతి సెప్టెంబర్ 2వ తేదీన... ఈ నేపథ్యంలో ఆ తేదీలోగా వైఎస్ఆర్ చిత్ర పటాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల టీడీపీ ప్రభుత్వం.. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ సీపీ సభ్యులకు మాట మాత్రం కూడా చెప్పకుండా మహానేత వైఎస్ఆర్ చిత్ర పటాన్ని అసెంబ్లీలో నుంచి తొలగించింది. దీంతో ఆ పార్టీ సభ్యులు స్పీకర్‌ను కలసి వైఎస్ఆర్ చిత్రపటాన్ని యాథాస్థానంలో ఉంచాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై గతంలో కేవీపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు లేఖ రాసిన విషయం విదితమే. అయితే సదరు లేఖ తనకు అందలేదని స్పీకర్ ప్రకటించడం గమనార్హం. -
మళ్లీ కిసాన్ వికాస పత్రాలు
న్యూఢిల్లీ: కిసాన్ వికాస పత్రాలను (కేవీపీ) స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం మళ్లీ ప్రారంభిస్తోంది. ఇన్వెస్ట్ చేసిన మొత్తం 8 సంవత్సరాల 4 నెలల్లో రెట్టింపయ్యే ఈ కిసాన్ వికాస పత్రాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు(మంగళవారం) మళ్లీ ఆవిష్కరిస్తారు. ఇవి రూ.1,000, 5,000, 10,000, 50,000 పత్రాలు లభ్యమవుతాయి. వీటిల్లో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. గతంలో ఈ కిసాన వికాస పత్రాలను పోస్ట్ ఆఫీసుల్లోనే విక్రయించేవాళ్లు. ఇప్పడు వీటిని ఎంపిక చేసిన జాతీయ బ్యాంకు బ్రాంచీలలో అందుబాటులో ఉంచుతారు. కేవీపీల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రెండున్నర సంవత్సరాలు లాకిన్ పీరియడ్ ఉంటుంది. చిన్న ఇన్వెస్టర్లకు కిసాన్ వికాస పత్రాలు సురక్షితమైనవి, భద్రమైనవని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీటి వల్ల దేశంలో పొదుపు రేటు పెరుగుతుందని వివరించింది. ఒక వ్యక్తి లేదా సంయుక్తంగా వ్యక్తులకు వీటిని జారీ చేస్తారని, వీటిని ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేసుకోవచ్చని వివరించింది. బ్యాంకుల్లో వీటిని తనఖాగా ఉంచుకొని రుణాలు పొందవచ్చని పేర్కొంది. 1988లో కిసాన్ వికాస పత్రాలను మొదటిసారిగా జారీ చేశారు. అప్పట్లో ఇవి ఐదున్నర సంవత్సరాలకు రెట్టింపయ్యేవి. వీటిని 2011 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. -
తెలంగాణకు కేవీపీ..సీమాంధ్రకు కేకే
-
'లాటరీ విభజన'లో అటు వారిటు.. ఇటు వారటు!
-
తెలంగాణ ఎంపీలు ఆంధ్రాకు.. ఆంధ్రా ఎంపీలు తెలంగాణకు!
ఢిల్లీ: రాజ్యసభ సభ్యుల ఎంపికకు సంబంధించి నిర్వహించిన లాటరీ ప్రక్రియ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో శుక్రవారం జరిగిన ఈ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటి వరకూ ఒకే రాష్ట్రంలో ఉన్న ఇరు ప్రాంతాల్లోని అభ్యర్థులు.. ఇక నుంచి వేరు పడనున్నారు. ఈ క్రమంలో రాజ్యసభ ఎంపిక ప్రక్రియ అనివార్యం కావడంతో లాటరీ పద్దతిలో వీరిని ప్రాంతాల వారీగా విభజించారు. ఇందులో కొంతమంది సీమాంధ్ర ఎంపీలు తెలంగాణ రాష్టానికి ఎంపికవ్వగా, టీ.ఎంపీలలో కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ క పదకొండు మంది, తెలంగాణకు ఏడుగురు రాజ్యసభ సభ్యులను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కోటాలో ప్రస్తుతం ఒక రాజ్యసభ సీటు ఖాళీగా ఉంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ) మరణంతో ఇది ఖాళీ అయ్యింది. ఈ స్థానానికి త్వరలో ఉపఎన్నిక నిర్వహించనున్నారు. సీమాంధ్రలో ఉన్న ఇద్దరు ఎంపీలు సీఎం రమేష్, కేవీపీలను ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రానికి కేటాయించగా, టి.ఎంపీలలో కేకే, ఎంఏఖాన్, దేవేందర్‌గౌడ్, రేణుకాచౌదరి ఏపీకి కేటాయించారు. మిగిలిన ఎంపీలందరూ ఏ ప్రాంతానికి చెందిన వారు ఆ ప్రాంతానికి పరిమితం కానున్నారు. కాగా, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ ను మాత్రం ఏపీకే కేటాయించారు. లాటరీలో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన సభ్యులు.. కె.కేశవరావు(టీఆర్ఎస్) ఎం.ఎ.ఖాన్(కాంగ్రెస్) రేణుకా చౌదరి(కాంగ్రెస్) దేవేందర్ గౌడ్(టీడీపీ) సుజనా చౌదరి(టీడీపీ) సీతారామలక్ష్మి(టీడీపీ) జైరాం రమేష్(కాంగ్రెస్) టి.సుబ్బిరామిరెడ్డి(కాంగ్రెస్) జేడీ శీలం(కాంగ్రెస్) చిరంజీవి(కాంగ్రెస్) తెలంగాణకు కేటాయించిన సభ్యులు.. కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్) వి.హనుమంతరావు (కాంగ్రెస్) ఆనంద భాస్కర్ (కాంగ్రెస్) పాల్వాయి గోవర్దన్ రెడ్డి (కాంగ్రెస్) సీఎం రమేశ్ (టీడీపీ) గుండు సుధారాణి (టీడీపీ) గరికిపాటి మోహన్ రావు(టీడీపీ) -
కేవీపీపై రెడ్ కార్నర్ నోటీసులపై స్టే విధించిన హైకోర్టు
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు సంబంధించిన టైటానియం ఖనిజం కేటాయింపుల కేసులో ఇంప్లీడ్ కావాలని సీబీఐకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీడియా వార్తల ద్వారానే మాకు రెడ్‌కార్నర్ నోటీసు విషయం తెలిసిందని, అయితే అమెరికా కోర్టు నుంచి ఇప్పటి వరకు మాకు నోటీసులు అందలేదని కేవీపీ తరఫు న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు. అయితే రెడ్‌కార్నర్ నోటీసులు తమకు అందాయని, వారెంట్‌పై మాకు ఎలాంటి సమాచారం లేదని సీఐడి అధికారులు హైకోర్టుకు తెలిపారు. కేవీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. కేవీపీపై అమెరికా కోర్టు జారీ చేసిన రెడ్‌కార్నర్ నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. -
మళ్ళీ రాజ్యసభ పదవిని దక్కించుకుంటా:కేవీపీ
-
దిగ్విజయ్‌తో సుదీర్ఘ మంతనాలు జరిపిన కేవీపీ
న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు శుక్రవారం సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరు సమావేశం అయ్యారు. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం కేవీపీ మాట్లాడుతూ సీమాంధ్రుల అభిప్రాయాన్ని దిగ్విజయ్ సింగ్‌కు తెలియచేసినట్లు తెలిపారు. కాగా ఈ భేటీకి కేంద్రమంత్రి జేడీ శీలం హాజరై అనంతరం వెళ్లిపోయారు. కేవీపీ నిన్న కూడా దిగ్విజయ్‌తో సమావేశం అయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ. డిప్యూటీ స్పీకర్ దామోదర రాజనర్సింహ ఈరోజు ఉదయం హస్తిన చేరుకున్నారు. వారికి ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణ ప్రక్రియకు సహకరించాలని వారిని ప్రధానమంత్రి కోరనున్నారు. ఇక కాంగ్రెస్ సమన్వయ కమిటీ రేపు ఉదయం 10.30 గంటలకు ప్రధానమంత్రిని కలవనుంది. -
కలిసి ఉంటేనే తెలుగు జాతి అభివృద్ధి సాధ్యం: కేవీపీ
న్యూఢిల్లీ : బాధ్యత గల పౌరుడిగా, తెలుగు జాతి ప్రతినిధిగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ఆయన మంగళవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కేవీపీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం కలిసి ఉంటేనే తెలుగు జాతి అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం సరికాదని కేవీపీ వ్యాఖ్యానించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటే వచ్చే లాభాలను తెలుగు సోదరులకు తెలియ చేయాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. మరోవైపు కేంద్ర మంత్రి జేడీ శీలం కూడా దిగ్విజయ్‌ను కలిసినవారిలో ఉన్నారు.