
ఏ లబ్ధి ఆశించి ‘ప్రైవేటు’కు కట్టబెట్టాలని చూస్తున్నారు?
భావనపాడు పోర్టుపై బాబుకు కేవీపీ లేఖ
సాక్షి, అమరావతి/ న్యూఢిల్లీ: ఏ ప్రయోజనం ఆశించి శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు అభివృద్ధి పనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం చంద్రబాబును రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శనివారం సీఎంకు లేఖ రాశారు. ప్రభుత్వరంగంలో కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)-డీబీఎఫ్‌వోటీ పద్ధతిలో అభివృద్ధి చేయాలనుకోవడం ఆశ్చర్యకరమన్నారు.
గతేడాది డిసెంబర్ 5న విజయ వాడ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన సందర్భం గా కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ భావనపా డు పోర్టును ప్రైవేటీకరణ చేయొద్దని, నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగిస్తే 25 నుంచి 30 శాతం లాభాన్ని రాష్ట్రాని కిస్తానని చెప్పడాన్ని ఆయన గుర్తుచేశారు.