కోడెలకు కేవీపీ మరో లేఖ | KVP writes another letter to Speaker Kodela Siva Prasad Over Removal of YS Photo | Sakshi
Sakshi News home page

కోడెలకు కేవీపీ మరో లేఖ

Published Sun, Aug 23 2015 12:44 PM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

కోడెలకు కేవీపీ మరో లేఖ - Sakshi

కోడెలకు కేవీపీ మరో లేఖ

హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని వెంటనే అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావుకు ఎంపీ కేవీపీ రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కోడెల శివప్రసాద్కు కేవీపీ ఆదివారం లేఖ రాశారు. ఇదే అంశంపై తాను గతంలో మీకు రాసిన లేఖ అందలేదని మీరు తెలిపారు.... దీనిపై ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదని లేఖలో కేవీపీ పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆరో వర్థంతి సెప్టెంబర్ 2వ తేదీన... ఈ నేపథ్యంలో  ఆ తేదీలోగా వైఎస్ఆర్ చిత్ర పటాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని కోరారు.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నాటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల టీడీపీ ప్రభుత్వం.. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ సీపీ సభ్యులకు మాట మాత్రం కూడా చెప్పకుండా మహానేత వైఎస్ఆర్ చిత్ర పటాన్ని అసెంబ్లీలో నుంచి తొలగించింది. దీంతో ఆ పార్టీ సభ్యులు స్పీకర్ను కలసి వైఎస్ఆర్ చిత్రపటాన్ని యాథాస్థానంలో ఉంచాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై గతంలో కేవీపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు లేఖ రాసిన విషయం విదితమే. అయితే సదరు లేఖ తనకు అందలేదని స్పీకర్ ప్రకటించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement