రూ.181.45 కోట్లతో విస్తరణ పనులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి విమానాశ్రయ రన్‌వే విస్తరణకు కేంద్రం తుది ఆమోదం తెలిపింది. విస్తరణ పనులకు సంబంధించి పర్యావరణ అనుమతులను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పొందింది. రూ.181.45 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను చేపట్టనున్నారు. ప్రస్తుతం మధురపూడి గ్రామంలో ఈ విమానాశ్రయం ఉంది. పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో తదనుగుణంగా విమానాశ్రయాన్ని విస్తరించాలని ఏఏఐ నిర్ణయించింది. ఈ ప్రతిపాదన ఇదివరకే ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) ఆమోదించింది.
భోగాపురం విమానాశ్రయ టెండర్లకు కమిటీ
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. ఇంధన, మౌలిక వసతుల కల్పన ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ విభాగాల అధికారులు సభ్యులుగా ఉంటారు.
‘రాజమండ్రి’ రన్‌వే విస్తరణకు తుది ఆమోదం
Published Sat, Mar 11 2017 1:38 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement