Parliament House
-
రాహుల్ గాంధీపై ట్రోలింగ్.. కారణం ఏంటంటే..
న్యూఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెల్లువెత్తుతోంది. పార్లమెంట్ హౌస్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో తీసిన ఓ ఫోటోకు రాహుల్ గాంధీ ఇచ్చిన పోజు, వేషధారణపై నెటిజన్ల నుంచి ట్రోలింగ్ వ్యక్తమవుతోంది. కొత్తగా రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సోనియా గాంధీతో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దిగిన ఫొటోను ఉప రాష్ట్రపతి అధికారిక ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాజ్యసభలో సభా నాయకుడు పీయూష్ గోయల్‌తోపాటు సోనియాగాంధీ కుటుంబ సభ్యులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా ఉన్నారు. సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్లమెంట్ హౌస్‌లో తీసిన ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు రాహుల్ గాంధీని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అధికారిక ఫొటోకు ఆయన ఇచ్చిన పోజు నిర్లక్ష్యంగా ఉందని, వేషధారణ హుందాగా లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే కొంత మంది రాహుల్ గాంధీకి కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఉప రాష్ట్రపతి ట్విటర్ హ్యాండిల్ హ్యాండ్లర్ కావాలనే ఇలాంటి ఫొటోను ఎంచుకుని పోస్ట్ చేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు. Hon'ble Vice-President of India and Chairman, Rajya Sabha, with Smt. Sonia Gandhi ji and her family during the oath-taking ceremony for elected Members of Rajya Sabha in Parliament House today. @RahulGandhi @priyankagandhi pic.twitter.com/9LdktgtoCE — Vice President of India (@VPIndia) April 4, 2024 -
రాజ్యసభ ఎంపీగా జైశంకర్ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ సహా తొమ్మిది మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం పార్లమెంట్ హౌజ్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. 2019లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన జైశంకర్ రెండోసారి గుజరాత్ నుంచి ఇటీవల రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు బీజేపీకి చెందిన బాబూభాయ్ జెసంగ్‌భాయ్ దేశాయ్ (గుజరాత్), కేస్రీదేవ్ సింగ్ దిగి్వజయ్‌సింగ్ ఝాలా (గుజరాత్), నాగేంద్ర రాయ్ (పశి్చమ బెంగాల్)లు, ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు డెరెక్ ఒబ్రియాన్, డోలా సేన్, సుఖేందు శేఖర్ రే, ప్రకాష్ చిక్ బరైక్, సమీరుల్ ప్రమాణ స్వీకారం చేశారు. -
మణిపూర్‌కు అఖిలపక్షాన్ని పంపించాలి
న్యూఢిల్లీ/ఇంఫాల్: మణిపూర్‌లో పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో అఖిలపక్ష భేటీ నిర్వహించింది. హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, టీఎంసీ, డీఎంకే, ఏడీఎంకే, బీజేడీ, ఆప్, ఆర్జేడీ, శివసేనతోపాటు వామపక్షాల పార్టీల నేతలు హాజరయ్యారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, నిత్యానంద్ రాయ్, అజయ్ కుమార్ మిశ్రా, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఐబీ డైరెక్టర్ తపన్ డేకా కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు కేంద్రం తీసుకుంటున్న పలు చర్యలను హోం మంత్రి అమిత్ షా వారికి వివరించారు. ప్రధాని మోదీ స్వయంగా ప్రతిరోజూ అక్కడి పరిస్థితులపై వాకబు చేస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయితే, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు వెంటనే అఖిలపక్ష బృందాన్ని పంపించాలని కాంగ్రెస్, టీఎంసీ సహా పలు పార్టీల నేతలు కోరారు. శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, సీఎం బిరెన్ సింగ్‌ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఎస్పీ కోరింది. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ..రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు కేంద్రం చేయగలిగిందంతా చేస్తోందని చెప్పారు. అఖిలపక్ష బృందాన్ని పంపించడంపై అమిత్ షా ఎటువంటి ప్రకటన చేయలేదని అనంతరం బీజేపీ మణిపూర్ ఇన్చార్జి సంబిత్ పాత్ర మీడియాకు తెలిపారు. ప్రభుత్వం మణిపూర్‌ను మరో కశ్మీర్‌లాగా మార్చాలనుకుంటున్నట్లుందని అక్కడి పరిస్థితులపై టీఎంసీ నేత డెరెక్ ఒ బ్రియాన్ మీడియాతో వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో మంత్రి గోదాముకు నిప్పు మణిపూర్‌లో నిరసనకారుల గుంపు మరోసారి రెచ్చిపోయింది. శుక్రవారం రాత్రి తూర్పు ఇంఫాల్ జిల్లా చింగారెల్‌లోని మంత్రి ఎల్.సుసింద్రోకు చెందిన ప్రైవేట్ గోదాముకు నిప్పుపెట్టడంతో అది కాలిబూడిదయింది. అనంతరం ఖురాయ్‌లోని మంత్రి ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై బాష్పవాయువును ప్రయోగించామన్నారు. -
పార్లమెంటులో ఎంపీలు తినే ఆహారంలో బొద్దింకలు.. పాకిస్థాన్‌లో దుస్థితి
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్లో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా దేశ పార్లమెంటు భవనంలో ఎంపీలు తినే ఆహారంలోనే బొద్దింకలు దర్శనమిచ్చాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎంపీలు.. రెండు క్యాంటిన్ల నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఇస్లామాబాద్ జిల్లా అధికారులు పార్లమెంటు హౌస్‌లోని క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించారు. మేనేజ్మెంట్ అస్సలు పరిశుభ్రత పాటించడం లేదని గుర్తించారు. కిచెన్‌లో ఆహారం పక్కన బొద్దింకలు ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే రెండు క్యాంటిన్లను సీజ్ చేశారు. ఈ రెండు క్యాంటిన్లలో నిర్వహణ బాగాలేదని, పరిశుభ్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఎంపీలు ఆరోపించారు. భోజనం కూడా రుచిగా లేదని ఇప్పటికే చాలాసార్లు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అందుకే ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయడమే మానేసినట్లు పేర్కొన్నారు. పాక్ ఎంపీల ఆహారంలో బొద్దింకలు రావడం ఇది కొత్తేం కాదు. 2014లో సాస్ బాటిల్లోనూ బొద్దింకను చూసి ఓ ఎంపీ షాక్ అయ్యారు. అలాగే 2019లో ఇక్కడి క్యాంటిన్లలో ఆహారం బాగాలేదని, పరిశుభ్రత అసలు లేదని స్వయంగా ఎంపీలే నిరసనలు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడిపోతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వ ఆస్తులను విక్రయించాల్సిన దుస్థితి తలెత్తింది. చదవండి: Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో జాతివివక్షా..? -
Presidential Election 2022: ద్రౌపది ముర్ము ఘన విజయం
Presidential Election 2022 Result Live: అప్డేట్స్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. 07:50 మూడో రౌండ్లోనూ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లలో కలిపి ఆమె సగానికి పైగా ఓట్లు సాధించారు. ద్రౌపది ముర్ముకు 5,77,777 ఓట్ల విలువ యశ్వంత్ సిన్హాకు 2,61, 062 ఓట్ల విలువ పోలైంది. 05:30 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ అధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లోనూ ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్లో పది రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు. 1,138 ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటి మొత్తం విలువ 1,49,575.. ఇందులో ద్రౌపది ముర్ముకు1,05,299 విలువగల 809 ఓట్లు. యశ్వంత్ సిన్హాకు 44,276 విలువ గల 329 ఓట్లు పడ్డాయి. ద్రౌపది ముర్ముకు పోలైన ఓట్లు చూస్తుంటే అంచనాలకు మించి మెజార్జీతో గెలిచే అవకాశం కనిపిస్తోంది.. 75 శాతానికిపైగా ఓట్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. రాత్రి 8 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది 03: 00PM రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీ ఓట్ల లెక్కింపు ముగిసింది. కాసేపట్లో ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించనున్నారు. ద్రౌపది ముర్ముకు 62 శాతానికి పైగా ఓట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. 02: 50PM రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 540 ఎంపీ ఓట్లు రాగా.. సిన్హాకు 208 ఎంపీ ఓట్లు పడ్డాయి. ఓటు విలువ ముర్ముకు 3,78,00 ఉండగా , యశ్వంత్ సిన్హాకు 1,45,600 గా ఉంది. చెల్లని ఎంపీ ఓట్లు 15గా తేలాయి. మొత్తం 4809 ఓటర్లలో 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సోమవారం జరిగిన ఎన్నికలో దాదాపు 99 శాతం మంది ఓటేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీపడిన విషయం తెలిసిందే. కాగా ముర్ముకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 1:50PM కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు 11:00AM రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం పార్లమెంట్ భవనంలో మొదలైన కౌంటింగ్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరవుతారో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్లమెంట్ హౌస్‌లోని 63వ నంబర్ గదిలో గురువారం ఉదయం 11 గంటలకు లెక్కింపు ప్రారంభం అయ్యింది. అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను పార్లమెంట్ హౌస్‌లో లెక్కిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యశ్వంత్ సిన్హా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ముర్ము విజయం సాధించడం లాంఛనమేనని రాజకీయ పండితులు తేల్చిచెబుతున్నారు. -
Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నిక నేడే
న్యూఢిల్లీ: దేశ 15వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. 4,800 మందికి పైగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం ఓటు వేయనున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదింటి దాకా పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ బాక్సులను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్ర్రాలకు తరలించడంతో పాటు అన్ని ఏర్పాట్లూ చేసింది. 21న పార్లమెంట్‌హౌస్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు. ఎన్డీఏ తరఫున గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల నుంచి యశ్వంత్ సిన్హా బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏకంగా 60 శాతానికి పైగా ఓట్లు కూడగట్టుకున్న ముర్ము మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేలా కన్పిస్తున్నారు. మొత్తం 10,86,431 ఓట్లలో ఆమెకు 6.67 లక్షల పై చిలుకు ఓట్లు ఇప్పటికే ఖాయమయ్యాయి. దాంతో సునాయాసంగా విజయం సాధించి రాష్ట్రపతి పదవికి ఎన్నికైన తొలి గిరిజన మహిళగా ముర్ము రికార్డు సృష్టించనున్నారు. అంతేగాక ప్రతిభా పాటిల్ తర్వాత ఈ అత్యున్నత పదవి చేపట్టనున్న రెండో మహిళ అవుతారు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఉంటారు. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. నామినేటెడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులకు ఓటు హక్కుండదు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతుంది. ఫలానా అభ్యర్థికే ఓటేయాలంటూ పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయలేవు. కాబట్టి క్రాస్ ఓటింగ్‌కు అవకాశముంటుంది. జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ లేనందున ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 నుంచి 700కు తగ్గింది. ఇక ఎమ్మెల్యేల ఓటు విలువలో 208తో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 176తో జార్ఖండ్, తమిళనాడు రెండోస్థానంలో, 175తో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి. సిక్కిం ఎమ్మెల్యేల ఓటు విలువ అతి తక్కువగా 7గా ఉంది. -
యూఎస్ ‘క్యాపిటల్’ వద్ద దాడి
వాషింగ్టన్: అమెరికా పార్లమెంటు భవనం క్యాపిటల్ వద్ద భద్రత విధుల్లో ఉన్న పోలీసు అధికారులపైకి శుక్రవారం ఒక దుండగుడు కారుతో దూసుకువెళ్లాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక అధికారి మరణించారు. కారులో నుంచి కత్తి పట్టుకుని దిగుతున్నట్లుగా కనిపించిన ఆ దుండగునిపై పోలీసులు వెంటనే కాల్పులు జరిపారు. అనంతరం, గాయపడిన పోలీసు అధికారులతో పాటు ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఆ దుండగుడు కూడా మరణించాడని స్థానిక మీడియా పేర్కొంది. క్యాపిటల్ భవనం వద్ద సెనెట్ వైపు ఉన్న ప్రవేశ ద్వారానికి 100 గజాల దూరంలో ఉన్న చెక్‌పాయింట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం క్యాపిటల్ కాంప్లెక్స్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం యూఎస్ పార్లమెంటు సమావేశాలు జరగడం లేదు. సుమారు మూడు నెలల క్రితం, దేశాధ్యక్షుడిగా జో బైడెన్ గెలుపును పార్లమెంట్ నిర్ధారిస్తున్న సమయంలో, మాజీ అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోనికి చొచ్చుకువచ్చి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. -
‘రాజమండ్రి’ రన్‌వే విస్తరణకు తుది ఆమోదం
రూ.181.45 కోట్లతో విస్తరణ పనులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి విమానాశ్రయ రన్‌వే విస్తరణకు కేంద్రం తుది ఆమోదం తెలిపింది. విస్తరణ పనులకు సంబంధించి పర్యావరణ అనుమతులను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పొందింది. రూ.181.45 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను చేపట్టనున్నారు. ప్రస్తుతం మధురపూడి గ్రామంలో ఈ విమానాశ్రయం ఉంది. పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో తదనుగుణంగా విమానాశ్రయాన్ని విస్తరించాలని ఏఏఐ నిర్ణయించింది. ఈ ప్రతిపాదన ఇదివరకే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) ఆమోదించింది. భోగాపురం విమానాశ్రయ టెండర్లకు కమిటీ సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. ఇంధన, మౌలిక వసతుల కల్పన ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ విభాగాల అధికారులు సభ్యులుగా ఉంటారు. -
రాజ్యాంగాన్ని సవరించాలి
రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన కేవీపీ సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలలో ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలకు రాజ్యాంగపరమైన పూచీకత్తు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రతిపాదించారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తూ శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంట్ ఉభయ సభలలో ప్రధాని, కేంద్ర మంత్రులు చేసే వాగ్దానాలను అమలు చేయడం కేంద్ర మంత్రుల బాధ్యత అన్నారు. హామీలకు రాజ్యాంగపరమైన పూచీకత్తు కల్పించే పక్షంలో తదుపరి వచ్చే ప్రభుత్వాలు వాటి అమలును విస్మరించలేవన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 121 తర్వాత 121 (ఏ)ను పొందుపర్చాలని కేవీపీ ఈ బిల్లులో ప్రతిపాదించారు. -
ప్రజలకు హక్కులు మాత్రమే గుర్తున్నాయి: మోదీ
న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ నాయకుడు లక్ష్మణ్ రావ్ మాధవ్ రావ్ ఇనామ్ దార్ పై రాసిన పుస్తక విడుదల కార్యక్రమానికి శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. గుజరాతీ భాషలో రచించిన ఈ పుస్తకాన్ని రాజాభాయ్ తో కలిసి మోదీ రచించారు. ఈ సందర్భంగా మోదీ పార్లమెంటు హౌస్ లో మాట్లాడారు. యువతలో రాజ్యంగానికి సంబంధించిన అవగాహనను పెంపొందించేందుకు నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. రాజ్యాంగం గురించి ఎక్కడ మాట్లాడుకున్నా.. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రస్తావన వస్తుందని, రాజ్యాంగం, అంబేద్కర్ ల మధ్య విడదీయలేని సంబంధం ఉందని అన్నారు. రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ ను గురించి మాత్రమే తెలుసుకుంటే సరిపోదని, రాజ్యాంగ ఉద్దేశం తెలుసుకోవడం కూడా కీలమేనని అన్నారు. అధిక విలువ కలిగిన నోట్ల రద్దుపై మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తమ డబ్బును వినియోగించుకునే హక్కు ఉందని అన్నారు. కానీ, ప్రస్తుత ప్రపంచ మారుతోందని క్యాష్ లెస్ ఎకానమీ దిశగా పయనిస్తోందని చెప్పారు. అధిక విలువ కలిగిన నోట్ల రద్దుపై ప్రభుత్వ సంసిద్ధతను విమర్శిస్తున్నారని, వారి అసలు సమస్య తమను తాము సంసిద్ధం చేసుకునే అవకాశం ప్రభుత్వం ఇవ్వకపోవడమని చెప్పారు. దేశంలో సాధారణ వ్యక్తి అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా ఓ సైనికుడిలా పోరాడుతున్నాడని చెప్పారు. రాజ్యాంగంలో ఉన్న సగటు పౌరుడు నిర్వర్తించాల్సిన బాధ్యతలను మర్చిపోయి ఏళ్లయిందని, కేవలం రాజ్యాంగంలోని హక్కులు మాత్రమే వారికి గుర్తు ఉన్నాయని అన్నారు. కొందరు తెలివైన వాళ్లు రాజ్యాంగంలో ఉన్న పౌరుడు నిర్వర్తించాల్సిన విధులను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. -
ప్రజలకు హక్కులు మాత్రమే గుర్తున్నాయి
-
ఆ ఏటీఎంలు కూడా నిండుకున్నాయట!
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ సెగ పార్లమెంట్ ఆవరణలోని ఏటీఎం సెంటర్లను కూడా తాకింది. ఒక పక్క శీతాకాల పార్లమెంట్ సమావేశాల ఉభయ సభల్లోనూ ఆపరేషన్ బ్లాక్ మనీ ప్రకంపనలు రేపుతోంది. మరోపక్క పార్లమెంట్ బయట ఏటీఏం కేంద్రాలకు కరెన్సీ కష్టాలు చుట్టుకున్నాయి.. పార్లమెంటు ఆవరణలోని రెండు ఏటీఎంలు గురువారం నగదులేక వెలవెలబోయిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. పార్లమెంట్ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు, కొంతమంది జర్నలిస్టులు ఇక్కడున్న రెండు ఏటీఎం కేంద్రాలవద్ద బారులు తీరారు. కానీ అంతలోనే క్యాష్ అయిపోవడంతో అందరూ నీరసించారు. అయితే ఆర్బీఐ కార్యాలయం, ప్రధానమంత్రి కార్యాలయానికి అతి సమీంపలోని ఏటీఏం కేంద్రాలలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక మిగిలిన ఏటీఎం సంగతి ఏంటన్న నిరసనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఈ వ్యవహారంపై సెంట్రల్ హాల్లో కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంటే ఏటీఎంలలో ఉంటుందంటూ చమత్కరించడం విశేషం. కాగా నవంబరు 8 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.500, రూ. 1000 నోట్ల రద్దు ప్రకటనతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. పెద్దనోట్ల రద్దుతో ఏటీఎం సెంటర్ల దగ్గరకు బ్యాంకుల వద్దకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. అయితే గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడినా చివరకు నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. మరోవైపు నగదు నిల్వలు సరిపడినంత ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్ బీఐ, ఆర్థిక శాఖ భరోసా ఇస్తున్న సంగతి తెలిసిందే. -
నియంతృత్వం, కిరాతకం
-
నియంతృత్వం, కిరాతకం
• మమత ధ్వజం.. పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ • పాలుపంచుకున్న ఆప్, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమ తా బెనర్జీతోపాటు నేషనల్ కాన్ఫరెన్స్, ఆప్, ఎన్డీఏ భాగస్వామి శివసేన నాయకులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రూ. 500 / 1000 నోట్ల రద్దు తో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేస్తూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. బుధవారం పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లిన ఈ బృందానికి మమత నేతృత్వం వహించారు. ఆమె వెంట తృణమూల్ ఎంపీలు, ఆప్ ఎంపీ భగవంత్ మన్, శివసేన ఎంపీ హర్సుల్, నేషనల్ కాన్ఫరెన్స నేత ఒమర్ అబ్దుల్లా తదితరులున్నారు. రాష్ట్రపతిని కలసిన అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితి రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసేలా ఉందన్నారు. ‘సామాన్యుల కష్టాలను రాష్ట్రపతికి వివరించాం. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి, దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయాలని కోరాం’ అని చెప్పారు. దీనికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించి, ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారన్నారు. గురువారం లోక్‌సభలో వారుుదా తీర్మానాన్ని ప్రవేశపెడతామన్నారు. మోదీ చర్యను నియంతృత్వ, కిరాతక చర్యగా అభివర్ణించారు. సరిపడా నిత్యావసరాలు మార్కెట్లో సరఫరా అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. శివసేన ప్రభుత్వ చర్యను సమర్థించినప్పటికీ, పాత నోట్ల మార్పిడికి గడువును మరింత పొడిగించాలని చెప్పింది. -
'రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్‌ను కూల్చాలి'
రాంపూర్: సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మంత్రి ఆజమ్ ఖాన్ మరోసారి వివాదానికి తెరలేపారు. గతంలో తాజ్‌మహల్ కూల్చి శివాలయం నిర్మించాలంటూ వివాదాన్ని సృష్టించిన ఆయన.. తాజాగా మరో వివాదాన్ని రగిలించారు. రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనాలు బానిసత్వానికి ప్రతీకలని, వాటిని కూలగొట్టాలంటూ వ్యాఖ్యానించారు. రాంపూర్‌లోని డిగ్రీ కళాశాలలో జరిగిన ఒక సెమినార్లో ప్రసంగించిన ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన ఈ భవనాలు బానిసత్వానికి చిహ్నాలని పేర్కొన్నారు. ఈ వరుసలో ముందు తాజ్‌మహల్, తరువాత రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్ నిలుస్తున్నాయన్నారు. అందుకే వాటికి పడగొట్టాలన్నారు. ప్రజాధనాన్నిభారీగా వృధా చేసిన స్మారక కట్టడాల్లో తాజ్ మహల్ ఒకటనీ, అక్కడ నిలబడాలంటేనే తనకు నచ్చదన్నారు. అదొక క్రిమినల్ వేస్ట్ అంటూ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సింగపూర్ పార్లమెంటుకు 'లీ' పార్థీవ దేహం
సింగపూర్: ఆధునిక సింగపూర్ వ్యవస్ధాపక ప్రధాని, పితామహుడు లీ క్వాన్ యూ పార్థీవ దేహాన్ని బుధవారం ఆ దేశ పార్లమెంటుకు తరలించారు. పలువురి సందర్శనార్ధం శనివారం వరకు అక్కడే ఉంచనున్నారు. ఇస్తానా గ్రౌండ్‌లోని ప్రధాని అధికారిక నివాసం శ్రీ తెమాసెక్ నుంచి పార్లమెంటుకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. 91 ఏళ్ల లీ క్వాన్ యూ గత కొద్ది కాలంగా న్యూమోనియాతో బాధపడుతూ సింగపూర్ జనరల్ ఆస్పత్రిలో సోమవారం తుది శ్వాస విడిచారు. -
రైతుల హక్కులపై ఉక్కుపాదం
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్, పార్లమెంటు భవనం, సచివాలయం నిర్మించిన రైసినాహిల్స్ ప్రాంతంలో వ్యవసాయ భూములు కోల్పోయిన వారి వారసులు, తమకు రావాల్సిన నష్టపరిహారం కోసం ఇప్పటికీ క్రమం తప్పకుండా ప్రతి నెలా జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలిపి పోతుంటారంటే మనకు నమ్మబుద్ధి కాకపోయినా, నిజం. ఇందుకు సంబంధించి ఈ సోమవారమే ఢిల్లీ హైకోర్టు స్థానిక ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. కోర్టులో వ్యాజ్యం వేసిన సజ్జన్ సింగ్ ముత్తాత, ముత్తాత, ముత్తాతకు ముత్తాత అయిన షాదికి, ఇతరులకు చెందిన భూమిని ఏకపక్షంగా సేకరించారు. రోగి కోరిందే వైద్యుడిచ్చాడన్న సామెత చందంగా కార్పొరేట్ కోరిందే బీజేపీ నేతృత్వపు ఎన్డీయే ప్రభుత్వం అందించింది. ఏమిచ్చింది? రాచమార్గంలో వచ్చిన చట్టాన్ని నీరుగార్చే దొడ్డిదారి అస్త్రం ఆర్డినెన్స్‌ను. ఎందుకు? అభివృద్ధి- సంస్కరణల పేరిట. దీంతో ఏం జరుగుతుంది? నూటపాతికేళ్ల కింద బ్రిటిష్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన భూసేకరణ చట్టమే తిరిగి దిక్కవుతుంది. దాని పరిణామమేంటి? భూ యజమానుల హక్కులు హరీమని, వారి నోటికి తాళం పడుతుంది. వారి అంగీకారంతో పని లేకుండా, నష్టపరిహారానికి కచ్చితమైన భరోసా లేకుండా... పశుబలాన్ని ఉపయోగించి ఏ భూమినైనా ఏకపక్షంగా లాక్కునే హక్కు రాజ్యానికి మళ్లీ ధారాదత్తమౌతుంది. నిన్నటికి నిన్న పార్లమెం టరీ ప్రజాస్వామ్య పంథాలో తీవ్ర కసరత్తు చేసి తెచ్చుకున్న భూసేకరణ చట్టం- 2013కు తూట్లు పడతాయి. ఎకరం, రెండెకరాలున్న బడుగు, బలహీనజీవులు నిర్వాసితులవుతారు. సొంత వ్యవసాయమే కాకుండా భూమి ఆదరువుగా జరిగే వ్యవసాయాన్నే నమ్ముకొని కౌలు, వివిధ వృత్తులు, కూలిపని, ఇతరేతర అను బంధ వ్యాపకాలు, చిన్నచిన్న వ్యాపారాలతో జీవనోపాధి పొందేవారు దిక్కులేని వారవుతారు. పెద్ద మొత్తాల్లో భూసేకరణ చేసే చోట ఊళ్లకు ఊళ్లే ఛిద్రమౌ తాయి. ఇవీ రాగల పరిణామాలు. చర్చలకు ఆస్కారం లేని, హేతువుకు తావు లేని కర్కశ పంథాయే భూసేకరణకిక మార్గమౌతుంది. ప్రాణాలు పణంగా పెట్టి సగటు పౌరులు ప్రతిఘటిస్తారు. పోలీసు బలగాల్ని దించి ఉద్యమాల్ని ప్రభు త్వాలు అణచివేస్తాయి. రాజ్యం తన అప్రతిహత అధికారాలతో వందలు, వేలు, లక్షల ఎకరాల్ని చాపచుట్టి చెరపడుతుంది. తన అవసరాలు తీర్చుకొని, ఇంకా మిగిల్చిన భూమిని కార్పొరేట్లకు కైంకర్యం చేస్తుంది. నిర్దిష్టంగా నిర్వచనం లేని అభివృద్ధి, ఎవరికి మేలుజేస్తాయో తెలియని సంస్కరణల పేరిట ఇప్పుడు చేసే ఈ నిర్వాకం భూభద్రతని, భూసంస్కరణల్ని భూస్థాపితం చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఇది వ్యవస్థను వెనక్కి నడిపే తిరోగమన చర్యే అని నిరూపణ అవుతుందని సామాజికవేత్తలంటున్నారు. ఇప్పుడున్న చట్టానికేమయింది? రైతులు, ఇతర భూయజమానుల ఆమోదంతో నిమిత్తం లేకుండా దేశ ప్రయో జనాలని చెప్పి సర్కారు గుడ్డిగా భూసేకరణ జరిపే బ్రిటిష్ కాలం నాటి చట్టం కావటంతో ప్రజాక్షేత్రంలో ఘర్షణలు నిత్యకృత్యమయ్యాయి. భూయజమాని ఆమోదం లేకుండా, ఎందుకోసమో హేతుబద్ధత లేకుండా, సేకరించి కార్పొరేట్ల వశం చేయడం వల్ల, అక్కడ వచ్చే పరిశ్రమలు, కార్పొరేట్ కార్యకలాపాలు పర్యావరణానికి, పౌరుల జీవన ప్రమాణాలకు ప్రతిబంధకంగా మారడం వల్ల ప్రజావ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ప్రతి భూసేకరణ ఓ యుద్ధ పరిస్థితిని తలపించేది. మానవహక్కుల ఉల్లంఘనగా దాఖలయ్యే పిటిషన్లతో న్యాయ వివాదాలు, అసాధారణ జాప్యాలకు దారితీయడం వంటి పరిస్థితులు తలె త్తాయి. ఈ స్థితిని అధిగమించడానికి చట్ట సవరణ అవసరమైంది. భూయజమా నుల అనుమతి, అవసరాల్ని సరిగ్గా అంచనా వేయడం, భూములు కోల్పోయే వారిపై ప్రభావం-సామాజిక ప్రభావాల్ని అంచనా వేయడం (ఎస్.ఐ.ఎ.) వం టివి తప్ప నిసరిగా చేస్తూ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. భూమి కోల్పోతున్న వారికి సరైన పునరావాసం, పునఃస్థిరీకరణ, తగు నష్టపరిహారం ఇప్పించే అంశాలతో ఈ చట్టం వచ్చింది. ఉభయ ప్రయోజనకరమైన సంప్రదిం పులకు ఓ ప్రాతిపదిక ఏర్పడింది. ఈ చట్టం ఆషామాషీగా రాలేదు. రెండేళ్ల పాటు దేశవ్యాప్తంగా భాగస్వాములతో చర్చ జరిగింది. ఈ కసరత్తు తర్వాత పార్లమెంటు ఆమోదం పొందిన భూసేకరణ చట్టం-13 సరిగ్గా ఏడాది కింద అమల్లోకొచ్చింది. రెండుసార్లు అఖిలపక్ష సమావేశాలు, రెండు పార్లమెంటు స్టాండింగ్ కమిటీల వడపోత తర్వాత ఉభయ సభల్లో చర్చ అనంతరం సదరు బిల్లు పలు సవరణలతో ఆమోదం పొంది చట్టరూపు సంతరించుకుంది. భూమి కోల్పోతున్న వారిలో కనీసం 80-70 శాతం మంది ఆమోదం తర్వాతే భూసేక రణ జరపాలని, ఆ ప్రాంతంలో సామాజిక ప్రభావాన్ని అంచనా వేయాలని, బాధితులకు తగు నష్టపరిహారం ఇవ్వాలని, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని, అభివృద్ధి చేసిన భూమిలో వాటా కల్పించాలని, మూడు పంటల భూముల్ని ముట్టుకోవద్దని... ఇలా చాలా అంశాల్ని పొందుపరిచారు. భూభద్ర తకు ఇది భరోసా కల్పించింది. కానీ, ఇలా చేయడం వల్ల భూసేకరణే కష్టమైం దని, ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల అమలు నిలిచిపోయిందని ప్రస్తుత ప్రభుత్వం అభిప్రాయం. అధికారంలోకి వచ్చిన ఆరుమాసాల్లో ఈ వాద నను బలోపేతంచేసి, సదరు చట్టాన్ని వీలైనంతగా తూట్లుపొడిచే యోచన ఈ ప్రభుత్వ పెద్దలు ప్రారంభించారు. పర్యవసానమే ప్రస్తుత ఆర్డినెన్స్. దీనిని కేంద్రమంత్రివర్గం ప్రతిపాదించింది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ ఆర్డినెన్స్‌తో సవరణకు గురవుతున్న చట్టం అమలే ఇక తరువాయి. కనిపించని నష్టం అపారం ఈ ఆర్డినెన్స్ ద్వారా జరిగే చట్ట సవరణ అనంతరం ఇక భూసేకరణకు పంచా యతీ, గ్రామసభల అనుమతి కూడా అవసరం ఉండదు. ఇది 73, 74 వ రాజ్యాంగ సవరణల స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. తాము కేవలం భూసేకరణకున్న అవరోధాలు తొలగిస్తున్నామంటున్న ప్రభుత్వ పెద్దలు ‘మేం, చట్టంలో ఉన్న పరిహార, పునరావాస, పునఃస్థిరీకరణ వ్యవహారాల జోలికి వెళ్లడం లేదు’ అంటు న్నారు. కానీ, ఇది నిజం కాదు. భూములు కోల్పోయేవారి ఆమోదం అవసరం లేకుండా, ప్రభావాల అంచనాలు లేకుండా, షరతులు వర్తింపజేయకుండా సేక రించే ఏకపక్ష హక్కును ప్రభుత్వాలకు కల్పించడం వల్ల భూములు కోల్పోయే వారు, సహజంగానే తమ ‘బేరమాడేశక్తి’ని కూడా కోల్పోతారు. అప్పుడు వారికి దక్కేది తృణమో! పణమో! అభివృద్ధి పరచిన భూమిలో వాటా కూడా దక్కే అవకాశాలు లేవు. రైతులకు, సాధారణ పౌరులకు ఇంకా చాలా ప్రత్యక్ష, పరోక్ష నష్టాలకు ఆస్కారముంది. ప్రస్తుత చట్టంలో ఉన్న భూములు కోల్పోయే వారిపై ప్రభావాలు, సామాజిక ప్రభావాల అంచనా వల్ల బహుళ ప్రయోజనా లుండేవి. అది పౌర సమాజం పోరాడి సాధించుకున్న హక్కు. అది లేకపోతే సమాజానికి కనీసం అరడజన్ అరిష్టాలు తప్పవు. 1. ఏ అవసరానికి ఎంత భూమి సేకరి స్తారన్న హేతుబద్ధత లేకుండాపోయి, ఆయా ప్రాజెక్టులకు వాడగా మిగిలింది ఇతరేతర అవసరాలకు వాడి వినియోగ సమతూకం చెడగొట్టే ప్రమాదముంది. 2. లెక్కకు మించి భూసేకరణ జరిపి ప్రయివేటు, వ్యాపారశక్తుల పరం చేయడం వల్ల సామాన్యుల జీవనం దుర్భరమౌతుంది. 3. అభివృద్ధి పేరుతో సహజవన రుల్ని నిర్హేతుకంగా కొల్లగొట్టే రకరకాల పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాలు, కారి డార్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. 4. ప్రజలపై చూపే దుష్ర్పభావాల్ని లెక్క చేయకుండా పర్యావరణ సమతూకా నికి భంగం కలిగించే సంస్థల ఏర్పాటు ప్రమాదముంటుంది. 5. ఏడాదికి 3 పంటలిచ్చే భూముల్ని కూడా పెద్ద మొత్తా ల్లో సేకరించడంవల్ల ఆహార ఉత్పత్తిపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. వీటన్నింటికన్నా ముఖ్యమైంది భూయజమానుల మౌలిక హక్కు. దానికి తీవ్ర మైన భంగం కలుగుతుంది. ముందే భరోసా కల్పించాలి భూసేకరణ సమయంలో తను ఇష్టపూర్వకంగా ఆమోదం తెలిపే రీతిలో తగు పరిహారం, పునరావాసం, పునఃస్థిరీకరణ ఇప్పించే చట్టబద్ధమైన హక్కు లేకుం టే, తర్వాత లబ్ధి అన్నది దాదాపు అసాధ్యం. వారి జీవితాలు కల్లోలమౌతాయి. కొన్ని వందల, వేల కేసులు మనముందున్నాయి. సింగూరు వంటి చిన్న ప్రాజెక్టు నిర్వాసితుల నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల వరకు చెప్పుకుంటే అన్నీ కన్నీటి గాథలే! విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరిపిన భూసేకరణతో నిర్వాసితులైన రైతులు, దశాబ్దాలు నష్ట పరిహారం అందక జీవ నోపాధి కోసం అక్కడే దొంగలుగా మారి, పోలీసుల కాల్పుల్లో మరణించిన ఘటనలు ఉన్నాయి. పాట్నాలో రాజధాని నిర్మాణ సమయంలో భూముల కోల్పోయిన రైతుల వారసులు, అధికారికంగా ప్రకటించిన నష్టపరిహారం కోసం ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్, పార్లమెంటు భవ నం, సచివాలయం నిర్మించిన రైసినా హిల్స్ ప్రాంతంలో వ్యవసాయ భూములు కోల్పోయిన వారి వారసులు, తమకు రావాల్సిన నష్టపరిహారం కోసం ఇప్పటికీ క్రమం తప్పకుండా ప్రతి నెలా జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలిపి పోతుంటా రంటే మనకు నమ్మబుద్ధి కాకపోయినా, నిజం. ఈ కేసుకు సంబంధించి ఈ సోమవారమే ఢిల్లీ హైకోర్టు స్థానిక ప్రభుత్వానికి తాజాగా నోటీసులిచ్చింది. కోర్టులో వ్యాజ్యం వేసిన సజ్జన్ సింగ్ ముత్తాత, ముత్తాత, ముత్తాతకు ముత్తాత అయిన షాదికి, ఇతరులకు చెందిన భూమిని ఏకపక్షంగా సేకరించారు. కలకత్తా నుంచి రాజధానిని ఢిల్లీకి మారుస్తున్నామని, 1894 భూసేకరణ చట్టం సెక్షన్ 6 కింద, 21 డిసెంబర్, 1911న ఉత్తర్వులిచ్చి 150 గ్రామాలకు చెందిన 17,000 ఎకరాల భూమిని సేకరించారు. ఇలా సేకరించిన భూమిని అధికారిక నిర్మా ణాల కోసమే కాకుండా ప్రయివేటు వ్యక్తులు, రాజ కీయ నాయకులకు ప్రభు త్వం ఆనాడే అప్పగించింది. కానీ, భూమి కోల్పోయిన వారికి రావాల్సిన 2,217 రూపాయల, 10 అణాల, 11 పైసల నష్టపరిహారం ఇప్పటికీ బాధితులకు అందలేదు. తగిన చట్టబద్ధమైన భద్రతతో రైతులకు ముందుగానే భరోసా కల్పించకుంటే భూములు కోల్పోయే నిర్వాసితుల దుస్థితి ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది. రాజధాని పేరిట భూసమీకరణ కోసం ఆంధ్ర ప్రదేశ్‌లో, ప్రాజె క్టులకు భూసేకరణ కోసం తెలంగాణలోనే కాదు, దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో అధినేతలు ఈ ఆర్డినెన్స్ కోసం కాచుక్కూర్చున్నారు. కానీ, సర్కారు అండతో అప్పనంగా భూములు కాజేయజూస్తున్న కార్పొరేట్ శక్తుల ఆయుధమే కాదు, రైతుల హక్కులపై ఉక్కుపాదం ఈ ఆర్డినెన్స్. ఈమెయిల్: dileepreddy@sakshi.com - దిలీప్ రెడ్డి -
కాన్బెర్రా నుంచి మెల్బోర్న్కు మోదీ
మెల్బోర్న్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ మెల్బోర్న్ చేరుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన ప్రత్యేక విమానంలో కాన్బెర్రా నుంచి మెల్బోర్న్ విచ్చేశారు. అంతకు ముందు కాన్బెర్రాలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ ఎబాట్, మోదీ మధ్య మంగళవారం శిఖరాగ్ర చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సామాజిక భద్రత, ఖైదీల మార్పిడి, డ్రగ్స్‌పై పోరు...తదితర అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. సాంస్కృతిక, పర్యాటక రంగాలపై కూడా ఇరుదేశాల మధ్య అవగాహనా ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. కాగా అబాట్‌తో చర్చల అనంతరం ఆస్ట్రేలియా పార్లమెంట్‌నుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని టోనీ ఎబాట్ చారిత్రక రికార్డు పత్రాలను మోదీతో పంచుకున్నారు. మోదీ తన ప్రసంగం అనంతరం బ్రిటన్ పార్లమెంట్ నేతలను పరిచయం చేసుకున్నారు. కాగా మోదీ రాత్రికి మెల్బోర్న్ నుంచి ఫిజి పర్యటనకు బయల్దేరతారు. ఆయన పదిరోజుల్లో మూడు దేశాల్లో పర్యటించటం విశేషం. -
పార్లమెంటు భవనంలో జవాన్ కాల్పులు!
న్యూఢిల్లీ: పార్లమెంటు భవనంలో విధులు నిర్వహిస్తున్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ చేతిలోని రైఫిల్ నుంచి ప్రమాదవశాత్తూ నాలుగు తూటాలు పేలిన సంగతి వెలుగు చూసింది. ఇటీవల జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు సాగుతోంది. విధులు ముగించుకున్న జవాన్ రైఫిల్‌ను ఆయుధాగారంలో పెడుతుండగా ఈ కాల్పులు జరిగాయని, అతన్ని, సూర్వైజర్ను విధుల నుంచి తప్పించామని అధికారులు చెప్పారు. -
‘షూట్’ అవుట్!
విదేశాల్లో షూటింగ్ అనగానే ఎగిరి గంతేసి... ‘షాట్’ గ్యాప్‌లో అక్కడ ఎంజాయ్ చేసేయొచ్చనుకున్న శ్రీలంక సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మర్చిపోలేని షాక్ తగిలింది కెనడాలో. ఏకంగా రెండు రోజులు హోటల్ రూమ్‌లోనే లాకైపోయింది. పార్లమెంట్ హౌస్ వద్ద కాల్పులు జరిగిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం.. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు ఎవరూ గడప దాటడానికి వీల్లేదని హుకుం జారీ చేసింది. విశేషమేంటంటే... జాక్ బస చేసిన హోటల్‌కు సంఘటనా స్థలం రెండే కిలోమీటర్లు దూరం! దెబ్బకు షూటింగ్ ఆగిపోయి... న్యూస్ అప్డేట్స్ చూసుకోవాల్సి వచ్చిందట అమ్మడికి. -
సీశాట్ వద్దు
భారీ ఆందోళనకు దిగిన విద్యార్థులు అడ్డుకున్న పోలీసులు యూపీఎస్సీలో సీశాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగి పార్లమెంట్ హౌస్ దిశగా వెళుతున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు లాఠీచార్జీపై విచారణ జరిపించాలని ఆప్ డిమాండ్ చేసింది. సాక్షి, న్యూఢిల్లీ : యూపీఎస్సీ పరీక్షలో సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్)ను రద్దు డిమాండ్ ఊపందుకుంటోంది. దీనిపై విద్యార్థి లోకం మండిపడుతోంది. కాగా సీసాట్‌ను రద్దు చేస్తామంటూ ప్రభుత్వం ఇటీవల హామీ ఇచ్చింది. అయితే వచ్చే నెల 24వ తేదీన జరగనున్న ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు జారీ కావడంతో తీవ్ర ఆందోళనకు గురైన 500 మంది విద్యార్థులు శుక్రవారం పార్లమెంట్ హౌస్‌కు చేరుకునేందుకు వస్తుండగా ముఖర్జీనగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా దాదాపు 150 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కాగా సీశాట్ పేపర్ వ ల్ల హిందీ భాషలో యూపీఎస్సీ పరీక్ష రాసే హ్యూమనిటీస్ విభాగానికి చెందినవారికి అన్యాయం జరుగుతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇంగ్లిషులో రూపొందించిన ప్రశ్నపత్రాన్ని హిందీలో అనువదించడం వల్ల తమకు నష్టం వాటిల్లుతోందనే ప్రధాన ఆరోపణతో విద్యార్థులు సీశాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై పోలీసు అధికారి మాట్లాడుతూ 150 మందిని అదుపులోకి తీసుకున్నామని, అవసరమైతే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రయాణికులు ఇక్కట్లపాలు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో మెట్రో రైలు ప్రయాణికులు నానాఅగచాట్ల పాలయ్యారు. దాదాపు రెండు గంటలపాటు స్టేషన్లోనే చిక్కుకుపోయారు. ఎల్లో లైన్ మార్గంలోని సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్ భవన్ మెట్రో స్టేషన్లను సంబంధిత అధికారులు మధ్యాహ్నం 12.45 నుంచి మూడు గంటలవరకూ మూసివేశారు. ఆ తర్వాత వాటిని తిరిగి తెరిచారు. ఇబ్బందికరం సీసాట్ విషయమై కొందరు ఆందోళనకారులు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఫార్మాట్ వల్ల ఆంగ్ల భాషలో ప్రావీణ్యం లేనివారు ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుందన్నారు. తమ బాధలను పార్లమెంట్లో ప్రస్తావించే వారే కరువయ్యారని, అందువల్లనే పార్లమెంట్ హౌస్ దిశగా మార్చ్ నిర్వహించామన్నారు. ఈ అంశానికి సంబంధించి గతంలో తమకు అనేక హామీలు లభించాయని, అయితే జరిగిందేమీ లేదన్నారు. తమకు ఇప్పటికే అడ్మిట్ కార్డులు అందాయని, వచ్చే నెల 24వ తేదీన పరీక్ష జరుగుతుందన్నారు. అందువల్లనే ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి జరగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. -
పార్లమెంట్లో అద్వానీకి గది లేనట్లేనా?
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ పార్లమెంట్ హౌస్‌లో గదిని కోల్పోనున్నారా? ప్రస్తుత పరిణామాలను చూస్తే అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్డీఏ వర్కింగ్ చైర్మన్‌గా పదేళ్ల పాటు రూమ్ నం.4లో కార్యకలాపాలు నిర్వహించిన అద్వానీ.. ఇప్పుడు ఆ రూమ్‌ను వినియోగించలేని సంకట స్థితిలో ఉన్నారు. ఇంతకాలం ఆ గది బయట ఉన్న ఆయన నేమ్‌ప్లేట్ ఇపుడు కనిపించకపోవడం, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఎన్డీఏ చైర్మన్‌గా వాజ్‌పేయి పేరుతో పాటు అద్వానీ పేరు ఉన్న బోర్డు కూడా ఆ గది ముందు ఉండేది. వాజ్‌పేయి అనారోగ్యం బారిన పడడంతో ఆ గదిని అద్వానీ పూర్తిగా వినియోగించుకునేవారు. ప్రస్తుతం ఆయన ఎంపీలు పార్లమెంట్ పనికోసం వినియోగించే పార్టీ పార్లమెంటరీ ఆఫీసులో విశ్రాంతి తీసుకున్నారు. ఆయన బీజేపీ పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌గా ఉన్నా ఆ గదిలోని ప్రధాన కుర్చీలో కూర్చోకుండా పక్కనే ఉన్న సోఫాలో ఆసీనులవ్వడం గమనార్హం. అంతేగాక లోక్‌సభలో ఆయన ఎక్కడ కూర్చోవాలనే దానిపైన కూడా స్పష్టతలేదు. గురువారం ఉదయం ఆయన రెండో వరుసలో కూర్చోడానికి యత్నించగా.. అక్కడ ఉన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆయనను మొదటి వరుసలో కూర్చోవలసిందిగా కోరారు. ప్రధాని మోడీ పక్క సీటు ఖాళీగా ఉన్నా అక్కడ కూర్చోలేదు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సీటు కోసం వెతుక్కుని 8వ వరుసలో ఆసీనులయ్యారు. -
పార్లమెంట్ ఎదుట సివిల్స్ సర్విసెస్ అభ్యర్థుల ఆందోళన
సివిల్ సర్వీసుల కోసం యూపీఎస్సీ నిర్వహించే పరీక్ష విధానాన్ని మార్చాలంటూ వందలాది మంది సివిల్ సర్వీస్ ఉద్యోగాలు హాజరయ్యే అభ్యర్థులు పార్లమెంట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఆందోళన చేపట్టిన వారిని అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పార్లమెంట్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన ఆందోళనకారులను వాటర్ క్యానన్స్ తో పోలీసులు చెదరగొట్టారు. యూపీఎస్సీ నిర్వహించే ప్రవేశ పరీక్ష విధానంలో మరో మూడు అవకాశాలు ఇవ్వాలని ఆందోళనకారులు విజ్క్షప్తి చేశారు. పరీక్ష విధానాన్ని సమీక్షించాలని, మరికొన్ని సబ్జెక్ట్ లను చేర్చాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ప్రస్తుత పరీక్ష విధానం వల్ల అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది అని అన్నారు. -
సెప్టెంబర్ 4 వరకు పార్లమెంటు!
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలను సెప్టెంబర్ 4 వరకు పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉభయ సభలు తరచు వాయిదా పడుతున్న కారణంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రతా బిల్లు చర్చకు నోచుకోలేకపోతోంది. ఈ బిల్లుపై చర్చ చేపట్టేందుకు వీలుగా సమావేశాలను పొడిగించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్‌లోని ఉన్నతస్థాయి నేతలు అంగీకరిస్తున్నారు. జేడీ(యూ) నేత శరద్ యాదవ్ కూడా పార్లమెంటు సమావేశాల పొడిగింపు అంశంపై ఆ పార్టీ బీహార్ యూనిట్‌కు లేఖ రాసినట్టు తెలిసింది. ఇదిలావుంటే, ప్రధాని మన్మోహన్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌లు లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌తో భేటీ కావడం సభ పొడిగిస్తారనే ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.