పార్లమెంట్ ఎదుట సివిల్స్ సర్విసెస్ అభ్యర్థుల ఆందోళన
పార్లమెంట్ ఎదుట సివిల్స్ సర్విసెస్ అభ్యర్థుల ఆందోళన
Published Mon, Dec 9 2013 7:03 PM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM
సివిల్ సర్వీసుల కోసం యూపీఎస్సీ నిర్వహించే పరీక్ష విధానాన్ని మార్చాలంటూ వందలాది మంది సివిల్ సర్వీస్ ఉద్యోగాలు హాజరయ్యే అభ్యర్థులు పార్లమెంట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఆందోళన చేపట్టిన వారిని అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పార్లమెంట్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన ఆందోళనకారులను వాటర్ క్యానన్స్ తో పోలీసులు చెదరగొట్టారు.
యూపీఎస్సీ నిర్వహించే ప్రవేశ పరీక్ష విధానంలో మరో మూడు అవకాశాలు ఇవ్వాలని ఆందోళనకారులు విజ్క్షప్తి చేశారు. పరీక్ష విధానాన్ని సమీక్షించాలని, మరికొన్ని సబ్జెక్ట్ లను చేర్చాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ప్రస్తుత పరీక్ష విధానం వల్ల అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది అని అన్నారు.
Advertisement