Union Public Services Commission
-
మహిళలూ.. దరఖాస్తులు పంపండి
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు(సీఎస్ఈ) మహిళలు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవాలని యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్(యూపీఎస్సీ) కోరింది. మానవ వనరుల్లో లింగ సమానత్వం ప్రతిబింబించేలా మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని 2016 సీఎస్ఈ ప్రకటన విడుదల సందర్భంగా పేర్కొంది. ఈ పరీక్షలను యూపీఎస్సీ ప్రతిఏటా ప్రిలిమినరీ,మెయిన్స్, ముఖాముఖి అనే 3 దశల్లో నిర్వహిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్,ఐఎఫ్ఎస్ లాంటి ప్రతిష్టాత్మక సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈసారి 1079 ఖాళీల భ ర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ మే 27 అని కమిషన్ తెలిపింది. -
రాహుల్ నివాసాన్ని ముట్టడించిన సివిల్స్ అభ్యర్థులు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసాన్ని సివిల్ సర్వీస్ అభ్యర్థులు చేపట్టిన ముట్టడి కార్యక్రమం గురువారం రెండవ రోజుకు చేరుకుంది. దేశ రాజధాని 12 తుగ్లక్ రోడ్డులోని ఆయన నివాసాన్ని సివిల్స్ అభ్యర్థులు చుట్టుముట్టారు. సివిల్స్ పరీక్షలో గత ఏడాది చేసిన మార్పులను తొలగించాలని వారు రాహుల్‌ను డిమాండ్ చేశారు. అలాగే సివిల్స్ అభ్యర్థులకు మరో మూడు సార్లు పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సివిల్స్ సర్వీసెస్ పరీక్షలలో నూతన విధానాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత ఏడాది అమలులోకి తీసుకువచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా సివిల్స్ అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో సివిల్స్ పరీక్షలలో నూతన విధానాన్ని వ్యతిరేకిస్తు బుధవారం ఉదయం రాహుల్ గాంధీ నివాసాన్ని సివిల్స్ అభ్యర్థులు చుట్టుముట్టారు. దాంతో రాహుల్ నివాస భద్రత సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన రాహుల్ నివాసానికి చేరుకుని ఆందోళనకు దిగిన సివిల్స్ అభ్యర్థులను గత రాత్రి అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. గత అర్థరాత్రి దాటిన తర్వాత ఆందోళనకారులను పోలీసులు విడిచి పెట్టారు. -
పార్లమెంట్ ఎదుట సివిల్స్ సర్విసెస్ అభ్యర్థుల ఆందోళన
సివిల్ సర్వీసుల కోసం యూపీఎస్సీ నిర్వహించే పరీక్ష విధానాన్ని మార్చాలంటూ వందలాది మంది సివిల్ సర్వీస్ ఉద్యోగాలు హాజరయ్యే అభ్యర్థులు పార్లమెంట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఆందోళన చేపట్టిన వారిని అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పార్లమెంట్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన ఆందోళనకారులను వాటర్ క్యానన్స్ తో పోలీసులు చెదరగొట్టారు. యూపీఎస్సీ నిర్వహించే ప్రవేశ పరీక్ష విధానంలో మరో మూడు అవకాశాలు ఇవ్వాలని ఆందోళనకారులు విజ్క్షప్తి చేశారు. పరీక్ష విధానాన్ని సమీక్షించాలని, మరికొన్ని సబ్జెక్ట్ లను చేర్చాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ప్రస్తుత పరీక్ష విధానం వల్ల అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది అని అన్నారు.