మహిళలూ.. దరఖాస్తులు పంపండి
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు(సీఎస్‌ఈ) మహిళలు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవాలని యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్(యూపీఎస్సీ) కోరింది. మానవ వనరుల్లో లింగ సమానత్వం ప్రతిబింబించేలా మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని 2016 సీఎస్‌ఈ ప్రకటన విడుదల సందర్భంగా పేర్కొంది. ఈ పరీక్షలను యూపీఎస్సీ ప్రతిఏటా ప్రిలిమినరీ,మెయిన్స్, ముఖాముఖి అనే 3 దశల్లో నిర్వహిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్,ఐఎఫ్‌ఎస్ లాంటి ప్రతిష్టాత్మక సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈసారి 1079 ఖాళీల భ ర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ మే 27 అని కమిషన్ తెలిపింది.