
రాజ్యాంగాన్ని సవరించాలి
పార్లమెంట్ ఉభయసభలలో ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలకు రాజ్యాంగపరమైన పూచీకత్తు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని రాజ్యసభలో
రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన కేవీపీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలలో ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలకు రాజ్యాంగపరమైన పూచీకత్తు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రతిపాదించారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తూ శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంట్ ఉభయ సభలలో ప్రధాని, కేంద్ర మంత్రులు చేసే వాగ్దానాలను అమలు చేయడం కేంద్ర మంత్రుల బాధ్యత అన్నారు. హామీలకు రాజ్యాంగపరమైన పూచీకత్తు కల్పించే పక్షంలో తదుపరి వచ్చే ప్రభుత్వాలు వాటి అమలును విస్మరించలేవన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 121 తర్వాత 121 (ఏ)ను పొందుపర్చాలని కేవీపీ ఈ బిల్లులో ప్రతిపాదించారు.