న్యూఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెల్లువెత్తుతోంది. పార్లమెంట్ హౌస్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో తీసిన ఓ ఫోటోకు రాహుల్ గాంధీ ఇచ్చిన పోజు, వేషధారణపై నెటిజన్ల నుంచి ట్రోలింగ్ వ్యక్తమవుతోంది.
కొత్తగా రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సోనియా గాంధీతో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దిగిన ఫొటోను ఉప రాష్ట్రపతి అధికారిక ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాజ్యసభలో సభా నాయకుడు పీయూష్ గోయల్‌తోపాటు సోనియాగాంధీ కుటుంబ సభ్యులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా ఉన్నారు.
సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్లమెంట్ హౌస్‌లో తీసిన ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు రాహుల్ గాంధీని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అధికారిక ఫొటోకు ఆయన ఇచ్చిన పోజు నిర్లక్ష్యంగా ఉందని, వేషధారణ హుందాగా లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే కొంత మంది రాహుల్ గాంధీకి కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఉప రాష్ట్రపతి ట్విటర్ హ్యాండిల్ హ్యాండ్లర్ కావాలనే ఇలాంటి ఫొటోను ఎంచుకుని పోస్ట్ చేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు.
Hon'ble Vice-President of India and Chairman, Rajya Sabha, with Smt. Sonia Gandhi ji and her family during the oath-taking ceremony for elected Members of Rajya Sabha in Parliament House today. @RahulGandhi @priyankagandhi pic.twitter.com/9LdktgtoCE
— Vice President of India (@VPIndia) April 4, 2024
Comments
Please login to add a commentAdd a comment