photo poses
-
రాహుల్ గాంధీపై ట్రోలింగ్.. కారణం ఏంటంటే..
న్యూఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెల్లువెత్తుతోంది. పార్లమెంట్ హౌస్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో తీసిన ఓ ఫోటోకు రాహుల్ గాంధీ ఇచ్చిన పోజు, వేషధారణపై నెటిజన్ల నుంచి ట్రోలింగ్ వ్యక్తమవుతోంది. కొత్తగా రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సోనియా గాంధీతో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దిగిన ఫొటోను ఉప రాష్ట్రపతి అధికారిక ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాజ్యసభలో సభా నాయకుడు పీయూష్ గోయల్‌తోపాటు సోనియాగాంధీ కుటుంబ సభ్యులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా ఉన్నారు. సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్లమెంట్ హౌస్‌లో తీసిన ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు రాహుల్ గాంధీని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అధికారిక ఫొటోకు ఆయన ఇచ్చిన పోజు నిర్లక్ష్యంగా ఉందని, వేషధారణ హుందాగా లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే కొంత మంది రాహుల్ గాంధీకి కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఉప రాష్ట్రపతి ట్విటర్ హ్యాండిల్ హ్యాండ్లర్ కావాలనే ఇలాంటి ఫొటోను ఎంచుకుని పోస్ట్ చేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు. Hon'ble Vice-President of India and Chairman, Rajya Sabha, with Smt. Sonia Gandhi ji and her family during the oath-taking ceremony for elected Members of Rajya Sabha in Parliament House today. @RahulGandhi @priyankagandhi pic.twitter.com/9LdktgtoCE — Vice President of India (@VPIndia) April 4, 2024 -
‘‘ఏం సాధించారని ఫొటోలకు ఫోజులు? సిగ్గులేదా?’’
వైరల్: ఫొటోల ఫోజులకు కోసం మన నేతలు ఎంతగా తాపత్రయపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరైతే ప్రత్యేకంగా షూట్లతోనే కాలం గడిపేస్తుంటారు కూడా. తాజాగా డురాండ్ కప్ ఫైనల్ అనంతరం జరిగిన టోర్నీ బహుకరణలో జరిగిన పరిణామాలపై నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఆదివారం కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్, ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ మధ్య డురాండ్ కప్ ఫైనల్ జరిగింది. సునీల్ ఛెత్రి సారథ్యంలోని బెంగళూరు ఎఫ్‌సీ 2-1తో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం టోర్నీ బహుకరణ సమయంలో ఈ ఫుట్‌బాల్ దిగ్గజానికి ఘోర అవమానం జరిగింది. టోర్నీ బహుకరణ సమయంలో ఫొటోలు తీస్తుండగా.. సునీల్ ఛెత్రిని పక్కకు నెట్టేసి మరీ ఫోటోలకు ఫోజు ఇచ్చారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ లా గణేశన్. దీంతో ‘‘ఫుట్‌బాల్ దిగ్గజానికి కనీస మర్యాద ఇవ్వవా? సిగ్గులేదా?. ఏం సాధించారని ఫొజులు’’ అంటూ గవర్నర్‌ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ ట్వీట్లు చేస్తున్నారు పలువురు అభిమానులు. ఇది ఇక్కడితోనే ఆగలేదు. అది కాకతాళీయంగా అనుకున్నా మరో వీడియోలో.. మ్యాచ్ విక్టరీకి కారణమైన శివశక్తి నారాయణన్‌ను పక్కకు నెట్టేశారు హాజరైన మరో రాజకీయ నాయకుడు. దీంతో ఏం ఒరగపెట్టారని ఫొటోల కోసం అంత తాపత్రయమంటూ మండిపడుతున్నారు పలువురు నెటిన్స్. ఫుట్‌బాల్ అభిమానులే కాదు మరోవైపు ఆటగాళ్లు సైతం ఈ చర్యలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. Ladies & gentlemen, bringing you Shri La. Ganeshan, honorable Governor of West Bengal. #DurandCup The high-headedness is audacious. Not expected of a respectable figure, @LaGanesan. A public apology surely won't be too much to ask for. #IndianFootballpic.twitter.com/aEq4Yq6a6R — Debapriya Deb (@debapriya_deb) September 18, 2022 This is what happened with shivshakti minutes before Chhetri. pic.twitter.com/TZmLP93Sdj — Akansh (@AkanshSai) September 18, 2022 -
ఫొటోలు దిగేది ఇందుకే..
న్యూఢిల్లీ : పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి లెదర్ బ్రీఫ్‌కేస్‌ను పట్టుకుని.. మీడియా ముందుకొచ్చి ఫొటోలు దిగడం మనమెప్పుడూ చూస్తుంటాం. దీనికి ఓ కారణముంది. 1869లో బ్రిటిష్ కామన్స్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వచ్చిన జార్జి వార్డ్ హంట్ సభాధ్యక్షుడి నుంచి అనుమతి రాగానే లేచి నిలబడ్డాడు. తీరా చూస్తే.. బడ్జెట్ పత్రాలున్న తన బ్రీఫ్‌కేసు కనిపించలేదు. అప్పుడు గుర్తొచ్చింది మనోడికి.. దాన్ని ఇంట్లోనే మరిచిపోయి వచ్చానన్న విషయం.. దీంతో అప్పట్నుంచి ఆర్థిక మంత్రులు ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టటానికి సభకు వచ్చేముందు తమ వెంట పత్రాలన్నీ తెచ్చుకున్నామని, ఇంట్లో ఏవీ మర్చిపోలేదని పార్లమెంట్ వద్ద గుమికూడిన జనానికి తెలియజేస్తూ బాక్స్‌ను చూపించి లోపలికి వెళ్లడం మొదలు పెట్టారు. తర్వాత అదో సంప్రదాయంగా మారింది. పార్లమెంటు విధివిధానాలకు సంబంధించి చాలావరకూ బ్రిటన్ను ఫాలో అయ్యే మనం.. దీన్ని కూడా యథాతథంగా కాపీకొట్టాం. -
ఫొటోల కోసం 'కోతి' చేష్టలు!
ఎవరైనా పెద్దవాళ్లు ఫొటోలు తీయించుకుంటుంటే పిల్లలు మధ్యలో దూరి తామూ ఆ ఫొటోలో ఉండాలని అనుకుంటారు కదూ. దీన్నే 'ఫొటోబాంబ్' అంటారు. కానీ మనుషులే కాదు, జంతువులకు కూడా ఇలాంటి ఫొటో సరదా ఉంటుందన్న సంగతి మీకు తెలుసా? మడగాస్కర్‌లోని రెడ్ ఐలండ్‌లో అడవుల అందాలను ఫొటో తీసుకోవాలని వెళ్లిన ఓ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌కు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. స్టెఫాన్ క్రైస్బెర్గ్స్ (39) అనే ఈ బెల్జియం ఫొటోగ్రాఫర్ మడగాస్కర్ వెళ్లి అక్కడ అడవులను ఫొటో తీస్తుండగా.. ఉన్నట్టుండి కెమెరా ముందుకు ఓ కోతి వచ్చింది. అడవులు, చెట్లను ఏం ఫొటో తీస్తావు గానీ ముందు నాకు తియ్యి అన్నట్లుగా పళ్లు ఇకిలిస్తూ తలకిందులుగా వేలాడుతూ మాంచి పోజు ఇచ్చింది. అనుకోకుండా ఆ ఫొటో క్లిక్ అయిపోయింది. అయితే.. కెమెరా గురించి దానికి ఏం తెలుసో ఏమో గానీ, ఫొటోగ్రాఫర్‌ను, ఫొటో ఫ్లాష్‌ను చూసి బెదిరిపోవడానికి బదులు అప్పటి నుంచి అది రకరకాల పోజులు పెట్టడం మొదలుపెట్టింది. ఇక చేసేదేముంది అనుకుంటూ.. దాన్ని ఫొటోలు తీయసాగాడు. తోకతో వేలాడుతుండటంతో పాటు చేతులను రకరకాలుగా పెట్టి ఇది పోజులిచ్చింది. చివరగా ఫొటోగ్రాఫర్‌కు సెల్యూట్ చేస్తున్నట్లు కూడా చెయ్యి పెట్టిందీ మర్కటరాజం. ఇప్పటివరకు ఇలాంటి కోతిని తాను ఎప్పుడూ చూడలేదని, అది అచ్చం ''నన్ను చూసి ఓ ఫొటో తీసుకో'' అన్నట్లుగానే నిలబడిందని చెప్పాడు. ఫొటోలు అన్నీ తీసుకోవడం అయిపోయాక అది వెళ్లిపోయందని తెలిపాడు. అశ్శరభ శరభ.. నేనే వస్తాదు! నా ఫొటోలు తీశావుగా.. ఇదిగో ఓ సెల్యూట్! నాలా ఇలా ఎవరైనా చెట్టుమీద కూర్చోగలరా? ఇక ఇది ఫైనల్ పోజు.. ఈ ఫొటో తీస్తే నేను వెళ్లిపోతా