
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థికమంత్రుల ఫోటోలు
న్యూఢిల్లీ : పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి లెదర్ బ్రీఫ్‌కేస్‌ను పట్టుకుని.. మీడియా ముందుకొచ్చి ఫొటోలు దిగడం మనమెప్పుడూ చూస్తుంటాం. దీనికి ఓ కారణముంది. 1869లో బ్రిటిష్ కామన్స్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వచ్చిన జార్జి వార్డ్ హంట్ సభాధ్యక్షుడి నుంచి అనుమతి రాగానే లేచి నిలబడ్డాడు. తీరా చూస్తే.. బడ్జెట్ పత్రాలున్న తన బ్రీఫ్‌కేసు కనిపించలేదు.
అప్పుడు గుర్తొచ్చింది మనోడికి.. దాన్ని ఇంట్లోనే మరిచిపోయి వచ్చానన్న విషయం.. దీంతో అప్పట్నుంచి ఆర్థిక మంత్రులు ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టటానికి సభకు వచ్చేముందు తమ వెంట పత్రాలన్నీ తెచ్చుకున్నామని, ఇంట్లో ఏవీ మర్చిపోలేదని పార్లమెంట్ వద్ద గుమికూడిన జనానికి తెలియజేస్తూ బాక్స్‌ను చూపించి లోపలికి వెళ్లడం మొదలు పెట్టారు. తర్వాత అదో సంప్రదాయంగా మారింది. పార్లమెంటు విధివిధానాలకు సంబంధించి చాలావరకూ బ్రిటన్‌ను ఫాలో అయ్యే మనం.. దీన్ని కూడా యథాతథంగా కాపీకొట్టాం.
Comments
Please login to add a commentAdd a comment