సాక్షి, న్యూఢిల్లీ: కాకినాడ–సికింద్రాబాద్ మధ్య నడిచే గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ను (12738/12737) లింగంపల్లి వరకు పొడిగించాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రైల్వే మంత్రికి లేఖ రాశారు. గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ప్రయాణిస్తుంటారని, వారంతా కూకట్‌పల్లి, లింగంపల్లి ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపారు.
అయితే ఈ రైలును సికింద్రాబాద్ వరకే నడపడం వల్ల అక్కడి నుంచి 24 కి.మీ దూరంలో ఉన్న లింగంపల్లికి చేరుకోవడానికి ట్రాఫిక్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి వరకు నడపాలని కేవీపీ కోరారు.
గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి వరకు నడపండి
Published Sat, Jan 20 2018 1:27 AM | Last Updated on Sat, Jan 20 2018 1:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment