‘బీజేపీతో చంద్రబాబు విందు రాజకీయాలు’ | kvp ramachandra rao slams bjp | Sakshi
Sakshi News home page

‘బీజేపీతో చంద్రబాబు విందు రాజకీయాలు’

Published Thu, May 25 2017 4:28 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

‘బీజేపీతో చంద్రబాబు విందు రాజకీయాలు’ - Sakshi

‘బీజేపీతో చంద్రబాబు విందు రాజకీయాలు’

హైదరాబాద్‌: బీజేపీ దగాకోరు రాజకీయాలు చేస్తోందని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రులకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. అమిత్ షా అడుగులకు మడుగులొత్తుతూ చంద్రబాబు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంట గలుపుతున్నారని ఆరోపించారు.
 
రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి అమిత్‌షాతో విందు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర మేలుపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగి పోరాడాలని సవాల్‌ విసిరారు. ప్రత్యేక హోదా కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. టీడీపీ-బీజేపీ కూటమిని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడుతున్నాయని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement